Koheda Fruit Market: హైదరాబాద్ మంత్రుల నివాసంలో కోహెడ పండ్లమార్కెట్ నిర్మాణంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ సకల హంగులతో కోహెడ మార్కెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యాపారులు, ట్రేడర్లు, రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఇది 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తామన్నారు. 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం చేస్తామని, కమీషన్ ఏజెంట్లు ద్వారా అందరికీ దుకాణాలు ఏర్పాటు చేస్తామన్నారు. 16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, 11.76 ఎకరాలలో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్. 56.54 ఎకరాల్లో రహదారులు ఏర్పాటు చేస్తామన్నారు. 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యంగా ఏర్పాటు చేస్తామన్నారు.

Koheda Fruit Market
మార్కెట్ నిర్మాణ ప్రణాళికను ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుని ప్రారంభిస్తామని ఎమ్మెల్యేలు, మంత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈకార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, కౌసర్ మొహియుద్దీన్, అహ్మద్ బిన్ అబ్దుల్ల బలాలా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఆర్డీడీఎం పద్మహర్ష, డీఎంఓ ఛాయాదేవి, మార్కెట్ కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Good News for Farmers: రైతులకి శుభవార్త..సేంద్రియ వ్యవసాయ రైతులకి సబ్సిడీ పై ఎరువులు.!
Cotton Crop: ప్రస్తుత వర్షాలకు ప్రత్తి పైరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Poultry Farm Loans: కోళ్ల ఫారం ఏర్పాటుకు రూ.50 లక్షలు ఇస్తున్న కేంద్రం.!