తెలంగాణ

PJTSAU: పీజేటీఎస్ఏయూలో ఘనంగా ముగిసిన చర్చా కార్యాక్రమం.!

2
PJTSAU
PJTSAU

PJTSAU: ‘భారత వ్యవసాయ రంగంలో భవిష్యత్తు సవాళ్ళను అధిగమించేందుకు అవసరమైన వంగడాల రూపకల్పనకు సానుకూలమైన జన్యుల గుర్తింపు’ అన్న అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శనివారం ఒక్క రోజు చర్చ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఈఏ సిద్ధిఖీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు గుర్తించని జన్యులను వైల్డ్ వెరైటీస్ లో గుర్తించి వాటి లక్షణాలను అధ్యయనం చేయడం వల్ల వివిధ పంటలలో ముఖ్యంగా వరి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుందని సూచించారు. జన్యు శాస్త్రంలో వచ్చిన ప్రస్తుత ఆధునిక బ్రీడింగ్ పద్ధతులను ఉపయోగించి వైల్డ్ వెరైటీస్ నుంచి ఉత్తమ లక్షణాలు కల్గిన, ఇప్పటివరకు గుర్తించబడని వాటిని వెలుగులోకి తేవడానికి శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు.

Also Read: Drip Irrigation: డ్రిప్ ద్వారా నీటిని అందించడం లో పాటించాల్సిన మెళకువలు.!

PJTSAU

PJTSAU

భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మహోపాత్ర మాట్లాడుతూ శాస్త్రవేత్తలు జరిపిన కృషి ఫలితంగా వరిలో 2-లైన్ బ్రీడింగ్ ద్వారా హైబ్రిడ్ రైస్ లో పురోగతి సాధిస్తున్నామని అలాగే జన్యుపరమైన ఆవాల సంకర రకాలను రూపొందించగలుగుతున్నామన్నారు. అయితే ఈ అంశంపై న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తగిన అవగాహన కల్పించడం వల్ల ఈ ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మరింత విస్తృత పరచడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు.

మొత్తం 5-టెక్నికల్ సెషన్స్ లో 11 మంది శాస్త్రవేత్తలు వివిధ పంటలలో జన్యుపరమైన పరిశోధన అంశాలపై ప్రజెంటేషన్స్ ఇచ్చారు. క్రాఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం జెనెటిక్ టెక్నాలజీ సమర్థ వినియోగంపై చర్చించారు. సుమారు 100 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ ఒక్క రోజు చర్చాకార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘురామిరెడ్డి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ్ రావు, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ సమీర్ కుమార్, డాక్టర్ ఆర్.ఎం సుందరం, డాక్టర్ దీపక్ పటేల్, డాక్టర్ దుర్గారాణి తో పాటు పలువురు శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

Also Read: World Coconut Day: నేడు (సెప్టెంబర్ 2న)ప్రపంచ కొబ్బరి కాయ దినోత్సవం.!

Leave Your Comments

Drip Irrigation: డ్రిప్ ద్వారా నీటిని అందించడం లో పాటించాల్సిన మెళకువలు.!

Previous article

Organic Sugarcane Farming: సేంద్రియ వ్యవసాయంలో చెరుకు సాగు చేయడం ఎలా ?

Next article

You may also like