తెలంగాణ

Telangana Rains: తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వర్షాలు..

0
Telangana Rains
Rains in Telangana

Telangana Rains: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలు చేశాయి. ఇప్పుడు కొంచెం తగ్గిన వర్షాలు , మళ్ళీ రెండు రోజులు భారీగా కురుస్తాయి. తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాలో భారీవర్షాలు కురుస్తాయని వాతవరణశాఖ హెచ్చరికలు ఇచ్చింది. భారీవర్షాలకు రైతులు కూడా భారీ స్థాయిలో నష్టపోయారు.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయి అని హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావం హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉంది.

Also Read: Good News for Farmers: రైతులకి శుభవార్త..సేంద్రియ వ్యవసాయ రైతులకి సబ్సిడీ పై ఎరువులు.!

Rains in Telangana

Telangana Rains

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఈరోజు , రేపు భారీ వర్షాలు నమోదు అవుతాయి.

తెలంగాణ ప్రాతంలోనే కాకుండా దేశంలో కొన్ని రాష్ట్రలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఈశాన్య వైపుగా ఏర్పడిన అల్పపీడనం బంగ్లాదేశ్‌ తీరంలోకి చేరుకుంది. ఈ నెల 2 నుంచి 6 తేదీల వరకు భారతదేశం మొత్తం వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read: Cotton Crop: ప్రస్తుత వర్షాలకు ప్రత్తి పైరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Poultry Farm Loans: కోళ్ల ఫారం ఏర్పాటుకు రూ.50 లక్షలు ఇస్తున్న కేంద్రం.!

Leave Your Comments

Good News for Farmers: రైతులకి శుభవార్త..సేంద్రియ వ్యవసాయ రైతులకి సబ్సిడీ పై ఎరువులు.!

Previous article

Koheda Fruit Market: కోహెడ పండ్లమార్కెట్ నిర్మాణంపై సమీక్ష సమావేశం.!

Next article

You may also like