వార్తలు

శాసనమండలిలో దేశంలో తెలంగాణ వరి ఉత్పత్తి, విస్తీర్ణం స్థానం, సదరు ఉత్పత్తికి వినియోగించిన నీరు, వరి ధాన్యం ఉత్పత్తి విలువపై సభ్యులు తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

0
singireddy niranjan reddy

తెలంగాణ విజయాలను దేశం గుర్తించింది :-

  • ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీటి లభ్యత పెంచుకోవడం జరిగింది
  • ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతు తల ఎత్తుకుని తిరుగుతున్నాడు
  • సాగు నీటి రాక, వ్యవసాయ పథకాలతో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తులు పెరిగాయి
  • దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది
  • గత ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి రూ.41 వేల 240 కోట్ల విలువైన వరి ధాన్యం ఉత్పత్తి అయింది
  • ప్రతిపక్షాలు, కొందరు నేతలు అవగాహన లేక ప్రాజెక్టులు, పంటల మీద విమర్శలు చేస్తున్నారు
  • స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు నిర్మించారు .. వాటిని అధునిక దేవాలయాలు అన్నారు
  • ఏ ప్రాజెక్టు కట్టినా సాగునీటి కల్పనతో పాటు భూగర్భజలాలు, మత్య్స సంపద పెరుగుతాయి
  • ఆరుతడి పంటలకు కూడా సాగునీరు అవసరం .. ప్రాజెక్టు కడితే వరి పంట సాగుకే అనుకోవడం అవగాహనా రాహిత్యం
  • మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ తో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది
  • కొందరు వరి ధాన్యం ఎక్కువ ఎందుకు పండిస్తున్నారు అని ప్రశ్నించడం ఆశ్చర్యకరం
  • రాజస్థాన్ లో వరి పండించగలరా ? కేరళ, తమిళనాడులలో డిమాండ్ కు తగ్గ వరి ధాన్యం దిగుబడి వస్తుందా ?
  • ఇక్కడ పండిన పంట దేశంలోని అనేక రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అవుతుంది
  • దేశంలో ఆహార ధాన్యాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
  • తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా సభలో సుధీర్ఘ చర్చ జరగాలి
  • నూనె, పప్పుగింజల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం
  • రైతువేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను చైతన్యం చేయడం జరుగుతుంది
  • యాసంగిలో ఆరుతడి పంటలు సాగుచేయాలి .. వేరుశెనగ పెద్ద ఎత్తున సాగు చేయాలని చెబుతున్నాం
  • తెలంగాణలో పండే ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశెనగకు అంతర్జాతీయ డిమాండ్ ఉంది
  • గత ఏడాది 3.75 లక్షల ఎకరాలలో ఉన్న సాగును ఈ ఏడాది 5 లక్షల ఎకరాల పైకి తీసుకుపోవాలని కృషిచేస్తున్నాం
  • కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే అంశం మీద మరి కొద్ది రోజులలో స్పష్టత వస్తుంది
  • పంజాబ్ లో వరిని కేంద్రమే కొనుగోలు చేస్తుంది …అదేవిధంగా తెలంగాణ నుండి కొనుగోలు చేయాలని కోరుతున్నాం
  • పంజాబ్ లో విస్తృతంగా వరి పండుతుంది .. ఆ తరువాత విస్తృతంగా వరి సాగయ్యేది తెలంగాణలో .. అందుకే పంజాబ్ మాదిరిగా పూర్తిస్థాయిలో ఇక్కడ కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలి
  • నియంత్రిత సాగు మీద కొందరు బురదజల్లి అక్కసు వెళ్లగక్కారు
  • యాసంగిలో వరి తగ్గించి ఇతర పంటలు వేయాలని చెబుతున్నాం
  • తప్పనిసరి పరిస్థితులు ఉన్న చోటనే వరి సాగు చేయమని చెబుతున్నాం
  • యాసంగిలో 30 డిగ్రీల ఊష్ణోగ్రత దాటితే వరిధాన్యంలో నూక శాతం పెరుగుతుంది ..అందుకే యాసంగిలో ఒక నెల ముందు అంటే మార్చి 10 లోపు పంట కోతకు వచ్చేలా చూసుకోవాలి
  • పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నేతలు పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించాలి

 

Leave Your Comments

సెప్టెంబర్ 27న భారత్ బంద్ కు పిలుపు  మంత్రి పేర్ని నాని కామెంట్స్

Previous article

PJTSAU లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 106వ జయంతి వేడుకలు

Next article

You may also like