రైతుభీమా పథకం అర్హుల నమోదుపై ఈ రోజు వివిధ దినపత్రికలలో వచ్చిన కథనాలపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ రఘునందన్ రావు గారు…
2021-22 సంవత్సరానికి రైతుభీమా కింద ఆగష్టు 3 నాటికి ధరణి పోర్టల్ లో నమోదైన పట్టాదారులు మరియు ఆర్వో ఎఫ్ ఆర్ పట్టా కలిగి ఉన్న రైతుల డేటాను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఆ డేటాలోని 18 – 59 సం” రాల మధ్య వయస్సు గల రైతులు ఈ పధకంలో నమోదు చేసుకొనుటకు అర్హులు. ఒకటి కంటే ఎక్కువ గ్రామాలలో భూమిని కలిగి ఉన్నప్పటికీ ఒక రైతు ఒకే చోట నమోదుకు అర్హులు. గత ఏడాది ఉన్న అర్హుల జాబితాను పరిశీలించడం, నూతన అర్హులను గుర్తించడం, ఆన్ లైన్ లో నమోదు చేయడంపై ఆగస్ట్ 5న రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల ప్రధాన శిక్షకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది
రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన వారితో ఆయా జిల్లాలలోని సంబంధిత వ్యవసాయ శాఖ ఉద్యోగులు , వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల వరకు సరియైన ధృవీకరణ మరియు కొత్త నమోదు చేసుకున్న రైతుల డేటాను లోపాలు లేకుండా నమోదు చేయడానికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 16 నుండి ఆగస్ట్ 30 వరకు పాత జాబితా సవరణనే కాకుండా, కొత్తగా అర్హులయిన వారి జాబితా కూడా అన్ లైన్ నమోదు నిరంతరాయంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. కేటాయించిన తేదీలలో ఏ రోజు కూడా ఆన్ లైన్ నమోదుకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు కలగలేదు.
2021-22 సంవత్సరానికి రైతుభీమా కింద మొత్తం 35.64 లక్షల మంది రైతులు నమోదు చేయబడ్డారు, ఇందులో 31.58 లక్షల రెన్యూవల్స్ మరియు 4.06 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్న రైతులు ఉన్నారు. 4.06 లక్షల కొత్త ఎన్రోల్మెంట్లలో 1.06 లక్షల మంది రైతులు 2020-21 పాలసీ సంవత్సరంలో అర్హత ఉన్నా కూడా వివిధ కారణాల చేత నమోదు చేయించుకోని రైతులు కూడా ఈ సంవత్సరం నమోదుచేసుకున్నారు.
గత సంవత్సరం 32.73 లక్షల మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది అదనంగా 2.9 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు. 2021-22 సంవత్సరానికి 35.64 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు. ప్రస్తుత పాలసీ సంవత్సరంలో నమోదైన రైతుల సంఖ్య (35.64 లక్షల) గత 3 పాలసీ సంవత్సరాలతో పోలిస్తే అత్యధికంగా ఉంది. (2018-19లో 31.25 లక్షలు, 2019-21లో 30.81 లక్షలు, 2020-21లో 32.73 లక్షలు).
రాష్ట్రంలో 57.79 లక్షల మంది రైతులలో , 61.7 శాతం రైతులు రైతుభీమాకు అర్హులు కాగా వయసు రీత్యా 26.4 శాతం మంది రైతులు అనర్హులుగా గుర్తించారు. మిగిలిపోయిన వారిలో కొందరు ఇతర భీమాలు, ప్రవాస రైతులు , మరికొందరు ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో రైతుభీమా నమోదుకు ఆసక్తి చూపలేదు. రైతుభీమా ధరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు వ్యవసాయ శాఖకు ఇప్పటి వరకు క్షేత్రస్థాయి నుండి ఎలాంటి నివేదికలు గానీ, వినతులు గానీ అందలేదు . ఆగస్టు 30 వరకు తుది గడువు ఉన్న విషయం శాఖలో అందరికీ విదితం కావున 45 వేల ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి అన్న మాట, రైతు భీమా ధరఖాస్తులకు ఆన్ లైన్ ఆటంకం అన్నది సత్యదూరం రైతుభీమా పథకం అర్హుల నమోదుపై ఈ రోజు వివిధ దినపత్రికలలో వచ్చిన కథనాలపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ రఘునందన్ రావు గారు.
Leave Your Comments