వార్తలు

ధాన్యం కొనుగోలులో చీకటి ఒప్పందాలు ?

0
Revanth Reddy Fires On CM Kcr Over Boild Rice Procurement

KCR MODI

Revanth Reddy Fires On CM KCR టిఆర్ఎస్ బీజేపీ చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతుందన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో యాసంగి పంట బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం చేతకాని తనాన్ని ప్రదర్శిస్తుంటే సీఎం అయి ఉండి నువ్వేం చేస్తున్నావ్ కెసిఆర్ అంటూ నిలదీశారు. దేశంలో నువ్వు మాత్రమే రైతుల్ని ఆదుకుంటున్నట్టు ప్రగల్భాలు పలుకుతావ్, మరి రైతాంగంపై ని కార్యాచరణ ఏంటో స్పష్టం చెయ్యాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం బెదిరింపులకు బయపడి తెలంగాణ రైతుల్ని నట్టేట ముంచుతావా, అందుకే ధాన్యం పంపనని కేంద్రంతో చీకటి ఒప్పందం చేసుకున్నావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. కేంద్రం నీ మెడపై కత్తి పెడితే రైతుల్ని మోసం చేస్తున్నావ్ మరి నీ ఫామ్ హౌస్ కూడా రాసిస్తావా అంటూ మండిపడ్డారు రేవంత్. నీ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ప్రయోజనాల్ని కేంద్రానికి ఎలా కట్టపెడతావ్.

revanth reddy

Revanth Slams CM KCR ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అందుకు జంతర్ మంతర్ వద్ద నువ్వు దీక్ష చేయాలని, కెసిఆర్ సచ్చుడో, కేంద్రం ధాన్యం కొనుగోలు చేసుడో తేలిపోవాలన్నారు రేవంత్. తెలంగాణ రైతాంగం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దానికోసం దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధమన్నారు. ఇక ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు లోకసభలో నాటకాలు ఆడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కాపాడేందుకు ఎంపీలు లోకసభలో ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తెరాస బీజేపీ చీకటి రాజకీయ ఒప్పందాలు తేటతెల్లమయ్యాయని, ఇదంతా యావత్ రైతాంగం గమనిస్తుందన్నారు రేవంత్. ఇక రైతులపై టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే, లోక్‌సభలో ఉన్న 9 మంది ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, కవిత, దయాకర్‌ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

boild rice

Revanth vs KCR అయితే యాసంగి పంట వరిని కొనుగోలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో చర్చలు చేపట్టింది. సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కీలక యంత్రంగా రోజులపాటు ఢిల్లీ పర్యటన చేపట్టి కేంద్ర పెద్దలతో చర్చలు జరిపారు. అయితే ముందు నుంచి చెప్తున్నట్టుగానే కేంద్రం తన వైఖరి మార్చుకోలేదు. యాసంగి బాయిల్డ్ రైస్ కొనమని తెగేసి చెప్పింది. దీంతో సీఎం కెసిఆర్ కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు పాల్పడ్డారు. అందులో భాగంగా రాష్ట్ర సమస్యని దేశ సమస్యగా మార్చాలని కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో తమ వాణి వినిపించాల్సిందిగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దీంతో తెలంగాణ ఎంపీలు లోకసభలో నిరసనలతో సభను అడ్డుకుంటున్నారు. దీంతో సభ వాయిదా పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. మరి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేయగా… సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా ఆ అంశాన్ని సాగదీయడం వెనుక ఎలాంటి ఎత్తుగడలు ఉన్నాయో తెలియని పరిస్థితి. Boild Rice Issue In Telangana

Leave Your Comments

ఇక సెలవు…

Previous article

దేశవ్యాప్తంగా ఎంత పంట నష్టం జరిగింది?

Next article

You may also like