జాతీయం

Electricity Consumption: రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్, పగటిపూట మాత్రమే.!

2
Electricity Consumption
Electricity Consumption

Electricity Consumption: దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. రాత్రి పూట కూడా కరెంటు నినియోగం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరెంటు వినియోగం తక్కువగా ఉండటం వల్లన సాగుకు 24 గంటలు కరెంటు ఇవ్వలేమని చెబుతుంది. అందువల్లన పగలు మాత్రమే ఇవ్వగలమని, రాత్రిపూట ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అందువల్ల వ్యవసాయానికి పగటివేళల్లో మాత్రమే విద్యుత్‌ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వం సూచించింది.

ఈనెల 1న దేశంలో పగటిపూట విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు పెరిగిపోయిందని అయినా దానిని తీర్చడం సాధ్యమైందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతం మాత్రమే విద్యుత్‌ కొ రత ఉందని తెలిపింది. కొంతకాలం నుంచి భారీగా విద్యుత్‌ డిమాండ్‌ ఉంటోందని విద్యుత్‌ లభ్యత అందుబాటులో లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని అందువల్లన పగటికి మాత్రమే విద్యుత్‌ ను అందిస్తామని సూచించింది. ఈమేరకు భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడానికి సూచిస్తూ కేంద్ర విద్యుత్‌శాఖ ఈనెల 5న అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది.

Also Read: వరి రకాల విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన మెళకువలు.!

Electricity Consumption

Electricity Consumption in India

దేశంలో ఆగస్టులో 23 శాతం డిమాండ్‌ పెరిగినా తీర్చగలగడం ప్రపంచ స్థాయిలో ఇది ఒక రికార్డు. ఆనెలలో ఏడు రోజులపాటు రోజువారీగా 5 బిలియన్‌ యూనిట్లకుపైగా విద్యుత్‌ వినియోగం జరిగింది. 16 రోజుల పాటు రోజువారీ గరిష్ట డిమాండ్‌ 220 గిగావాట్లకుపైనే రికార్డు అయింది. ఆగస్టులో రాత్రివేళల్లో డిమాండ్‌తో పోల్చితే సరఫరాలో 10 గిగావాట్ల లోటు ఏర్పడింది. రోజువారీగా 6 నుంచి 9 గిగావాట్ల కొరత నెలకొంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరపాలని కేంద్రం ఆదేశించడంతో 30–32 గిగావాట్ల విద్యుత్‌ లభ్యత పెరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్‌ కొరత ఎక్కువగా ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోవడంతో జలవిద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.

విద్యుత్‌ కేంద్రాల్లో జరుగుతున్న మరమ్మతులను సత్వరంగా పూర్తిచేసి ఉత్పత్తిని పునరుద్ధరించాలని కేంద్రం తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం విద్యుత్‌ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతులను డిమాండ్‌ తక్కువగా ఉండే కాలానికి వాయిదా వేసుకోవాలని కోరింది. ఏదైనా కారణాలతో ఉత్పత్తి నిలిచిపోయిన విద్యుత్‌ కేంద్రాల్లో సత్వరంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల విడిభాగాలను ముందుగానే సమీకరించి పెట్టుకోవాలని కోరింది.

నాణ్యత లేని బొగ్గు, యాష్‌ పాండ్, ఇతర చిన్న సమస్యలతో చాలా కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగక 12–14 గిగావాట్ల విద్యుత్‌ లభ్యత లేకుండా పోయిందని పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరిగేలా చూడాలని ఈ నెల 1న జారీ చేసిన అడ్వైజరీ మేరకు అన్నిరాష్ట్రాల జెన్‌కోలు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కోరారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కింద తీసుకోవాల్సిన విద్యుత్‌ను ఏదైనా రాష్ట్రం వదులుకుంటే.. ఆ విద్యుత్‌ను పవర్‌ ఎక్స్చేంజిల్లో ఇతర రాష్ట్రాల కోసం అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ అధికంగా ఉండే వేళల్లో, రాత్రివేళల్లో గ్యాస్‌ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తి జరిగేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని నిర్మాణంలోని థర్మల్, సౌర, పవన విద్యుత్‌ కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కోంది.

Also Read: ప్రకృతి సేద్యం ద్వారా మునగ సాగు, ఆదాయం మొండు.!

Leave Your Comments

Paddy Seed Varieties: వరి రకాల విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన మెళకువలు.!

Previous article

Chickpea Farming: శనగ పంట సాగులో మెళకువలు.. అధిక దిగుబడులు.!

Next article

You may also like