Azadpur Mandi: ఆసియాలో అతిపెద్ద కూరగాయల,పండ్ల మార్కెట్ ఎక్కడుందనే ప్రశ్న మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇది మన దేశంలో ఉంది అంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల, పండ్ల మార్కెట్ దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో ఉంది. రైతుల ప్రయోజనాలను కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా ఈ మార్కెట్‌ను ప్రారంభించారు.
దేశంలోని చాలామంది రైతులు ఆమార్కెట్‌లో వ్యాపారం చేయాలని తపన పడుతుంటారు. ఇక్కడ రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు స్వేచ్ఛగా అమ్ముకునే వెసలుబాటు ఉంది. వినియెగదారులు కూడా ఈ మార్కెట్‌కు వచ్చి తక్కువ ధరకే తాజా కూరగాయలను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా పూలు, పండ్లు, ఇతరత్రా ఉత్పత్తులను కూడా ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయి.
ఆజాద్‌పూర్ మండీని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 1977లో నిర్మించింది. మండి పరిషత్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వివిధ చట్టాలను రూపొందించింది. 101 ఎకరాల విస్తీర్ణంలో 1,400కు పైగా హోల్‌సేల్ షాపులు ఉన్నాయి. ఇక్కడ 4 వేల మంది కమీషన్ ఏజెంట్లు, హోల్‌సేల్ వ్యాపారులున్నారు. ఈ మార్కెట్‌లో మహిళలు కూడా అధికసంఖ్యలో కూరగాయలు, పండ్ల వ్యాపారం చేస్తుంటారు. ఆజాద్‌పూర్ మండికి వెళ్లగానే ముందుగా పెద్ద గేటు కనిపిస్తుంది. దానిపై చౌదరి హరి సింగ్ హోల్‌సేల్ వెజిటబుల్ మార్కెట్ ఆజాద్‌పూర్’అని రాసి వుంటుంది. మనకు కాలసిన అన్నిరకాల కూరగాయలు, పండ్లు ఇక్కడ తాజాగా దొరుకుతాయి.
Also Read: పెరటి కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్న నిరుద్యోగులు
ప్రతి రోజు ఇక్కడ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందంటే మీరు ఆశ్ఛర్యపోతారు. అంతేకాదు ఆపిల్, అరటి, నారింజ, మామిడి, బత్తాయి తదితర పండ్లకు అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. ఆలుగడ్డ, గోబీ, టమాట, ఉల్లి, వెల్లుల్లి, అల్లం తదితరాలకు మార్కెట్‌గా ఉంది. ఏపీ నుంచి అరటి తదితర ఉద్యాన పంటలు, టమాట, ఉల్లి తెలంగాణ నుంచి బత్తాయి, మామిడి, కూరగాయలు సరఫరా అవుతాయి. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి దానిమ్మ, పుచ్చకాయ, ద్రాక్ష తదితరాలు ఈమండీకీ వస్తాయి.
అతి పెద్ద పండ్లు, కూరగాయల మార్కెట్ ఆజాద్‌పూర్ మండీ 24 గంటలపాటు పనిచేస్తుండడం రైతులకు ఆశాకిరణంగా మారింది. రోజూ 20,000+ మంది మండిలోకి వస్తారు. ఆజాద్‌పూర్ మండిలో 8 బ్యాంకులు మరియు 8 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. అన్ని ఆపరేషన్లు మండిలో మాన్యువల్‌గా జరుగుతాయి. ఆజాద్‌పూర్ మండీలో ఏటా 50 లక్షల టన్నుల పైగా పండ్లు, కూరగాయల అమ్మకాలు జరుగుతాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి పండ్లు, కూరగాయలు వస్తాయి. తెలంగాణ బత్తాయి రైతుల అవసరాలు తీరుస్తుంది. ఏటా 30 వేల మెట్రిక్ టన్నుల పంట ఈ మండీకి వస్తుంది.
ఏపీ నుంచి బత్తాయి, అరటి, మామిడి ఇక్కడికి రవాణా అవుతున్నాయి. జగిత్యాల నుంచి మామిడి, అనంతపురం నుంచి బత్తాయి మండికి వస్తుంది. ఇక్కడ ఉత్పత్తుల రవాణాకు ఎలాంటి ఆటంకం ఉండదు. అవాంతరాలు వస్తే 14488 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయొచ్చు. వివిధ సమస్యలను పరిష్కరించడానికి వ్యవసాయ రంగంలో అనేక స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. ఆజాద్‌పూర్ మండి దాని వ్యాపారంతో సాంకేతికతను మిళితం చేయగలిగితే మరింత సమర్థవంతంగా పని చేస్తుంది.
Also Read: వానకాలంలో గొర్రెల సంరక్షణ.!