అంతర్జాతీయంవార్తలు

Niranjan Reddy: మూడవరోజు పర్యటనలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

2
Minister Singireddy Niranjan Reddy
Minister Singireddy Niranjan Reddy

Niranjan Reddy:  మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటన చివరి రోజు కొనసాగుతోంది. కేసీఆర్ ఆదేశాలు ప్రకారం వెళ్లిన మంత్రి పరిశోధన రంగంలో USDA (యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్) సహకారం ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే మాఆకాంక్ష అని, భావితరాలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చూసుకునే బాధ్యత మనపై ఉన్నదని మంత్రి అన్నారు. ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మ్యానేజ్మెంట్, మార్కెటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యుయర్ ప్లాంటింగ్ టెక్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాల గురించి మూడో రోజు పర్యటనలో USDA ప్రతినిధులతో మంత్రి బృందం చర్చలు కొనసాగాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ వ్యవసాయం గణనీయమైన పురోగతి సాధించిందని ఉపాధి కల్పనలో వ్యవసాయ, దాని అనుబంధరంగాల పాత్ర ముఖ్మంత్రి కేసీఆర్ కు తెలుసు .. అందుకే వ్యవసాయ అనుకూల విధానాలకు పెద్దపీట వేసి రైతులను ప్రోత్సహిస్తున్నారన్నారు. సమైక్య పాలనలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో సంబరంగా మారిందని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్నారని రైతుభీమాతో వ్యవసాయ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు పూడిక తీసి చెరువులకు మళ్ళీ జలకళ సంతరించుకునేలా చేశారని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి గోస తీర్చాలన్నారు. వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నారు.. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని ఇప్పడు తెలంగాణలో నీళ్ళు, కరెంట్ పుష్కలంగా ఉండటం, సాగు విస్తీర్ణం పెరగడం, ఉపాధి అవకాశాలు లభిస్తుండడంతో వలసలు ఆగిపోయాయి.. వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు వాపస్ వస్తున్నారని మంత్రి అన్నారు.

Also Read:  PJTSAU: వ్యవసాయ విశ్వవిద్యాలయము M.P.C స్ట్రీం కోర్సులకు వాక్.ఇన్.కౌన్సిలింగ్

US Department of Agriculture

US Department of Agriculture

వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ని దాటిపోయిందని భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ పంటలు పండించడానికి అనువుగా ఉంటుందని భారతదేశంలో వనరులతో మన దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకు ఆహారాన్ని అందించగలం అలాగే విదేశాలకు కూడా ఎగుమతి చేయగలగాలి. నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని మనం భావి పౌరులకు అందించాలని అమెరికా పర్యటనలో భాగంగా మూడవ రోజు వాషింగ్టన్ డీసి లో ఉన్న NIFA (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్) సందర్శన NIFA డైరెక్టర్, మంజిత్ మిశ్రా, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (NIFA) US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) కి చెందిన ఏజెన్సీ. అమెరికాలో వ్యవసాయాన్ని మెరుగుపరిచే పరిశోధనలు చేయడం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం, కావలసిన నిధులు సమకూర్చడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, పర్యావరణ సమతుల్యత పాటించేలా చూడడం NIFA ప్రధాన లక్ష్యమన్నారు.

ఈసమావేశంలో NIFA డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ ఏ దేశంలో అయినా వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యం అని, కానీ ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకం అని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు అని, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్‌లో ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ని కలిశాను అని వివరించారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు చాలా గర్వంగా ఉందని .. రాష్ట్రంలో పాలన అభినందనీయమని NIFA డైరెక్టర్ మంజిత్ మిశ్రా అభినందించారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలోని NIFA సందర్శించి, USDA ప్రతినిధులతో చర్చలు జరిపి NIFA డైరెక్టర్ మంజిత్ మిశ్రాతో భేటీ అయిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చర్చలలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ లు పాల్గొన్నారు.

Also Read: Palamuru-Rangareddy: ఇది తెలంగాణ చారిత్రాత్మక విజయం, రైతుల విజయోత్సవాలు

Leave Your Comments

 PJTSAU: వ్యవసాయ విశ్వవిద్యాలయము M.P.C స్ట్రీం కోర్సులకు వాక్.ఇన్.కౌన్సిలింగ్

Previous article

Farmer Support: రైతులకు భరోసాని ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Next article

You may also like