Kisan Credit Card for Dairy Farmers పాడి రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేస్తామని కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాలా తెలిపారు. ఈ పథకంతో పాడి రైతులు తక్కువ వడ్డీతో రూ. 3 లక్షల వరకు రుణాలు పొందవచ్చన్నారు మంత్రి. గుజరాత్‌లో జాతీయ పాల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక & పాడి పరిశ్రమల మంత్రి పురుషోత్తమ్ సింగ్ రూపాలా, గోపాల్ రత్న అవార్డులను పంపిణీ చేశారు. అలాగే పశువుల పెంపకం కోసం ఆన్‌లైన్ IVF ల్యాబ్‌లను ప్రారంభించారు.
Dairy Farmers పశువుల పెంపకందారుల కోసం ప్రధాని మోదీ ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో రైతులకు మాత్రమే కేసీసీ జారీ చేయగా ఇప్పుడు పాడి రైతులకు కూడా జారీ చేయనున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ లబ్ధిదారులు నాబార్డ్ నుండి 2 నుండి 4 శాతం వరకు రేట్లలో రుణాలు పొందే అవకాశముంది. అందులో భాగంగా డాక్టర్ వర్గీస్ కురియన్ ప్రారంభించిన సహకార ఉద్యమాన్ని మంత్రి మెచ్చుకున్నారు మరియు సహకారాల వారసత్వం మరియు సంప్రదాయాన్ని కొనసాగించినందుకు NDDB మరియు AMUL ఉత్పత్తులని మంత్రి అభినందించారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను దేశంలోని అర్హులైన పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యకారులందరికీ అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు.నవంబర్ 15న ప్రారంభమైన ఈ ప్రచారం ఫిబ్రవరి 15, 2022 వరకు 3 నెలల పాటు కొనసాగుతుందని మంత్రి పురుషోత్తమ్ రూపాలా తెలిపారు. Kisan Credit Card