తెలంగాణ : వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక పై జిల్లాలో వరి విత్తనాలు అమ్మితే నేను కలెక్టర్ గా ఉన్నంత కాలం ఆ షాప్ క్లోజ్ చేస్తా. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, రాజకీయ నాయకులు అధికారుల ద్వారా తెరిచేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదు. చెండాడుతా……వేటాడుతా. ఈ రోజు నుంచి వరి విత్తనాలు అమ్మితే ఖబడ్దార్ ” అని దుకాణాల యజమానులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Leave Your Comments