World Coconut Day: మనిషి ఆరోగ్యానికి అవసరయ్యే వాటన్నింటినీ ప్రకృతి మనకు సహజంగానే అందించింది. కానీ మనమే ప్రకృతి ప్రసాదించిన వాటిని పక్కన పెట్టి డబ్బులు ఖర్చు చేసి మరీ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాము. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ల పేరుతో అనారోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాము. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో కొబ్బరి ఒకటి.
మనదేశంలో కొబ్బరికాయను శుభప్రదంగా భావిస్తారు. పెళ్లి, పూజ, పేరంటం, హోమం, యజ్ఞం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాల్లో కొబ్బరికాయ వినియోగం తప్పనిసరి. కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు. పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా పరిగణిస్తారు. మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి, నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరికాయను కొడతారు.
Also Read: Crop Rotation System: పంట మార్పిడి విధానం తో ఎన్నో లాభాలు.!
కొబ్బరికాయకు ఉండే మూడు కళ్ళని సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెబుతారు.ఆరోగ్య, ఔషధ, సౌందర్య ప్రయోజనాలను అందించే వనరుగా కొబ్బరికాయను చూస్తారు. కేరళ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లోనైతే నిత్యం వండుకునే వంటల్లోనూ కొబ్బరికాయను విరివిగా వినియోగిస్తారు. ఈ కొబ్బరి ఎక్కడ పుట్టిందో ఏమో కానీ ప్రపంచం మొత్తం విస్తరించింది. అలాంటి కొబ్బరికాయకూ ఓ స్పెషల్ డే ఉంది.
ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని తొలిసారిగా 2009 సంవత్సరంలో జరిపారు. కొబ్బరి వాడకం దాని ప్రయోజనాల గురించి ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కమిటీ (UN-ESCAP) ఈ దినోత్సవాన్ని గుర్తించింది.
Also Read: Weed Management in Paddy: వరిలో ప్రధాన సమస్యగా మారిన కలుపు.!