తెలంగాణవార్తలు

Palamuru-Rangareddy: ఇది తెలంగాణ చారిత్రాత్మక విజయం, రైతుల విజయోత్సవాలు

2
Palamuru Rangareddy lift scheme
Palamuru Rangareddy lift scheme

Palamuru-Rangareddy:  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద వేలాది మంది రైతులతో కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ స్పందించారు. ఇది తెలంగాణ విజయమని మంత్రి అన్నారు. ఎన్నో అవాంతరాలు వచ్చిన కూడా వాటిని జయించి మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులు వచ్చాయని కాబట్టి రిజర్వాయర్ల మీద సంబరాలు నిర్వహించాలని మంత్రి కోరారు. రైతన్నలతో కలిసి సంతోషాన్ని పంచుకోవాలన్నారు. పాలమూరు కష్టాలు తీర్చిన కేసీఆర్ కి ధన్యవాదాలు అని తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయమని తెలిపారు.

Also Read: Palamuru-Rangareddy: రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు, కేసీఆర్ కే సాధ్యం

Palamuru-Rangareddy

Palamuru-Rangareddy

కోనసీమను మరిపిస్తుందన పాలమూరు:

కాళేశ్వరం పంపులను మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు అని, కాళేశ్వరం పంపుల సామర్థ్యం 139 మొగావాట్లని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుల సామర్థ్యం 145 మెగావాట్లు, ఒక మోటరు ఒక లక్ష 96,500 హార్స్ పవర్ రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే విధంగా పనులు ఉన్నాయని అన్నారు. నార్లాపూర్ అంజనగిరి రిజర్వాయర్ వద్ద 145 మొగావాట్ల సామర్థ్యం గల 10 పంపులు, రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 11 కిలోమీటర్లు, ఎత్తు 60 మీటర్లు, 6.5 టీఎంసీల సామర్థ్యంతో త్వరలో డ్రై రన్ కు సన్నాహాలు చేస్తున్నామని నెలాఖరుకు మొదటి పంపు ప్రారంభం ఆవుతుందని అన్నారు. తెలంగాణలో అత్యంత ఎత్తయిన రిజర్వాయర్ అని 85 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఏదుల వీరాంజనేయ ఆనకట్ట పొడవు 7.5 కిలోమీటర్లు, 6.55 టీఎంసీల సామర్థ్యం, 145 మెగావాట్ల సామర్థ్యం గల 10 పంపుల ఏదుల పంప్ హౌస్, 24 నెలల రికార్డు సమయంలో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం జరుగుతందన్నారు. దీనిలో 1299 మంది ముంపు బాధితులను గుర్తించి రూ.205 కోట్ల పరిహారం అందజేశామని అన్నారు. దీని కింద 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఉందని తెలిపారు. వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 15.23 కిలోమీటర్లు, లక్ష 39 వేల ఎకరాల ఆయకట్టు,145 మెగావాట్ల సామర్థ్యం గల 10 పంపులతో వట్టెం పంప్ హౌస్, కరివెన కురుమూర్తి రాయ రిజర్వాయర్ సామర్థ్యం 19 టీఎంసీలు .. ఆనకట్ట పొడవు 15 కిలోమీటర్లు .. లక్ష 50 వేల ఆయకట్టు, కాలువ పొడవు 110 కిలోమీటర్లు, ఉదండాపూర్ రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 15.8 కిలోమీటర్లు, 16.03 టీఎంసీల సామర్థ్యం, 9.36 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు.

కేసీఆర్ సంకల్ప బలమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి కారణమన్నారు. రాబోయే పదేళ్లలో పాలమూరు కోనసీమను మరిపిస్తుందన్నారు. హైదరాబాద్ నుండి అలంపూరు వరకు దారి పొడవునా పచ్చదనం పరుచుకుంటుందని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల విజయోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read: Acharya N.G. Ranga Agricultural University: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో డ్రోగో డ్రోన్స్ అవగాహన ఒప్పందం

Leave Your Comments

Palamuru-Rangareddy: రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు, కేసీఆర్ కే సాధ్యం

Previous article

 PJTSAU: వ్యవసాయ విశ్వవిద్యాలయము M.P.C స్ట్రీం కోర్సులకు వాక్.ఇన్.కౌన్సిలింగ్

Next article

You may also like