ముందుగా ప్రకటించిన దానికంటే 25000 మెట్రిక్ టన్నుల అదనపు సేకరణకు మంత్రి తుమ్మల ఆదేశాలు.
ఈ వానాకాలం 2024 పంటకాలములో రాష్ట్ర ప్రభుత్వము, మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీ ద్వారా రైతుల వద్దనుండి ఇప్పటికే 59,000 మెట్రిక్ టన్నుల సోయాబీన్ ను కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన మద్ధతు ధర రూ. 4892 తో సేకరించింది. రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ల విజ్ఙప్తి మేరకు కేంద్ర ప్రభుత్వము నిర్దేశించిన పరిమాణం 59,508 మెట్రిక్ టన్నుల కంటే అదనంగా 25,000 మెట్రిక్ టన్నుల సేకరణకు గౌరవ వ్యవసాయశాఖ మంత్రివర్యులు ఆదేశాలు ఇవ్వగా, దాని ప్రకారం రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా మార్క్ ఫెడ్ 49 సెంటర్ల ద్వారా సోయాబీన్ సేకరణ ఈ రోజు కూడా కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగింది. ఇదిలా ఉండగా రాష్ట్ర సోయాబీన్ రైతులకు మద్ధతు ధర లభించేందుకు వీలుగా మరొక 25,000 మెట్రిక్ టన్నుల సేకరణకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా, ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుగారు తెలియజేశారు. అయితే రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని మంత్రివర్యులు తెలిపారు.
ఆదిలాబాద్ లో అత్యధికంగా 27,811 మెట్రిక్ టన్నులు సేకరించగా, నిర్మల్ లో 14,476 మెట్రిక్ టన్నులు, కామారెడ్డి 7867.75 మెట్రిక్ టన్నులు, నిజామాబాద్ లో 5413.85 మెట్రిక్ టన్నులు, సంగారెడ్డిలో 3339 మెట్రిక్ టన్నులను రైతుల వద్ద నుండి సేకరించడం జరిగిందని సోయాబీన్ అదనపు కొనుగోళ్ళకు అనుమతి
ఈ వానాకాలం 2024 పంటకాలములో రాష్ట్ర ప్రభుత్వము, మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీల ద్వారా రైతుల వద్దనుండి ఇప్పటికే 59,000 మెట్రిక్ టన్నుల సోయాబీన్ ను కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన మద్ధతు ధర రూ. 4892 తో సేకరించింది. రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ల విజ్ఙప్తి మేరకు కేంద్ర ప్రభుత్వము నిర్దేశించిన పరిమాణం 59,508 మెట్రిక్ టన్నుల కంటే అదనంగా 25,000 మెట్రిక్ టన్నుల సేకరణకు గౌరవ వ్యవసాయశాఖ మంత్రివర్యులు ఆదేశాలు ఇవ్వగా, దాని ప్రకారం రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా మార్క్ ఫెడ్ 49 సెంటర్ల ద్వారా సోయాబీన్ సేకరణకు ఆటంకం కలగకుండా ఈ రోజు కూడా కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగింది. ఇదిలా ఉండగా రాష్ట్ర సోయాబీన్ రైతులకు మద్ధతు ధర లభించేందుకు వీలుగా మరొక 25,000 మెట్రిక్ టన్నుల సేకరణకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా, ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుగారు తెలియజేశారు. అయితే రైతులకు ఇబ్బంది తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రివర్యులు తెలియజేశారు.
ఆదిలాబాద్ లో అత్యధికంగా 27,811 మెట్రిక్ టన్నులు సేకరించగా, నిర్మల్ లో 14,476 మెట్రిక్ టన్నులు, కామారెడ్డి 7867.75 మెట్రిక్ టన్నులు, నిజామాబాద్ లో 5413.85 మెట్రిక్ టన్నులు, సంగారెడ్డిలో 3339 మెట్రిక్ టన్నులను రైతుల వద్ద నుండి సేకరించడం జరిగిందని మంత్రివర్యులు తెలిపారు..
Leave Your Comments