ధాన్యపు పంటలలో అతి ముఖ్యమైన ఆహారపంటలు వరి, ప్రస్తుత సమయంలో రాష్ట్ర రైతాంగం లక్షల ఎకరాలతో వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. సరైన మద్దతు ధర, స్వల్పకాలిక రకాలతో కూడిన పంట మరియు ఆర్థిక ప్రాముఖ్యత దృష్ట్యా వరి సాగును అధిక మొత్తంలో చేపడుతున్నారు. సరైన సమయంలో వర్షాలు రావడం, జలవనరులు వుండి పంటకు కావాల్సినంత అందడం వరి సాగుకే అనుకూలంశాలు. అయితే రైతు సోదరులు చాలా వ్యయ సంప్రదాయిక పద్దతులలో నారుపోసి నాటు చేయటం జరుగుతుంది. నేటి శాస్త్రీయత పరిజ్ఞానం పెరిగాక వరిసాగులో వివిధ పద్ధతులు వున్నాయి. వాటిని అనుసరించి రైతులు ఎన్నో స్థిరమైన దిగుబడులను సాధించారు.
వరిలో వివిధ పంట కాలాలు మరియు భిన్నమైన, వైవిధ్య పూరితమైన, సన్న మరియు దొడ్డు రకాలు వున్నాయి. అలాగే స్వలు, మర్యా దీర్ఘకాలిక రకాలు కూడ వుండి వివిధ వరి సాగు పద్ధతులకే అనుకూలంగా వున్నాయి. ఇంకా వరిసాగు పద్ధతుల విషయానికొస్తే, నాట్లు వేయడం, దమ్ము చేసిన పొలంలో వరిని శీరుగా విత్తే పద్ధతి, శ్రీ వరి సాగు, యాంత్రీకరణ శ్రీ వరి సాగు, నేరుగా విస్తే వరి, యంత్రంతో వరి నాటడం మరియు ఎరోబిక్ రైస్ (ఆరుతడి వరి) దీంతో బాలుగా ఔత్సాహికులు విత్తనోత్పత్తివి రైతుస్నాయితో, ప్రయివేట్ సంస్థలు సంకర రకాల విత్తనోశృతని చేపడుతున్నారు. నాట బహుళ పద్ధతులను అనుసరిస్తూ, మెళుకువలను పాలిస్తూ సత్పలితాలు పొందుతున్నారు. సాంగు అంశాలలో తేడాలు పెద్దగా లేక పోయినా లాభూలు మరియు నష్టాలు ప్రతి పద్ధతిలోనూ వున్నాయి.
నాట్లు వేయటానికి పొలాన్ని తయారు చేయటం: నాట్లు వేయటానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేపి 2-3 దఫాలుగా మురగ చమ్మ చేయాలి. పొలమంతా సమానంగా చదును చేసుకోవాలి. రేగడి పొలంలో నాట్లు వేసినప్పుడు దమ్ము చేసిన 2రోజుల తరువాత నాట్లు వేసుకోవడం మంచిది. నాల్లు వేసేటప్పుడు కాలా పరిమితిని, కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వరిరకాల కాల పరిమితిని బట్టి కుదుళ్ళ సంఖ్య ప్రధానే పొలంలో వచ్చేలా నిర్ధారించాలి. తీరం కాలిక రకాలు 150 రోజుల పైన వుంటే 33 కుదుళ్ళ్ళ మధ్యకాలిక రకాలు 130 రోజులు వుంటే కూడ 33 కుదుళ్ళు, ఇంకా స్వల్పకాలిక రకాలు మరియు రచనతో సాగుచేస్తే ప్రధాన పొలంలో 44 కు కుదుళ్ళు చదరపు మీటరుకు వచ్చేలా చూసుకోవాలి. మిగతా యాజమాన్య పద్ధతులు క్రమబద్ధంగా పాటించుకోవాలి. దిగుబడులను ఎక్కువగా సాధించవచ్చు. ఈ పద్ధతి చాలా. వ్యయంతో కూడుకున్నది. కూలీలపై నిరంతరం ఆధారపడాల్సి వుంది. సమయం ఎక్కువగా వృద్ధి అవుతుంది.
దమ్ము చేసిన పొలంలో వరిని నేరుగా విత్తే పద్ధతి : ప్రస్తుత కాలంలో వరి సాగు వ్యయంతో కూడుకొన్నది, కూలీలపై ఖర్చు పెరగడు, కూలీలు సకాలంలో కూడ చేసుకోవాలి. పొలంలో నీరు నిలువ ఉండకూడదు. వీలైనంత చదును చేసుకోవాలి. మండికట్టి మొలక వచ్చిన విత్తనాలను నేరుగా లేదా డ్రమ్ సీడర్ తో గాని విత్తుకోవాలి. సమస్యత్మిక నేలలు, ముంపునేలలు సాగుక్కి అనుకూలం కాదు. లభ్యం కావడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో సాగు ఖర్చు తగ్గించుకొని, కూలీల సమస్యను అధిగమిస్తూ నాట్లు వేయడానికీ బదులుగా నేరుగా విత్తు పద్ధతి ఆచరణలోకి వచ్చింది.
నేరుగా విత్తే పద్దతులు :
1. విత్తన మోతాదు:- రకాన్ని బట్టి ఎకరాకు 10-15 కిలోలు అవసరమవుతాయి. ఆయా ప్రాంతాన్ని బట్టి అనువైనా, రకాన్ని, ఏదైనా రకాన్ని ఈ నేరుగా విత్త పద్ధతిలో సాగు చేసుకోవచ్చును.
2. విత్తనాన్ని మండె కట్టడు:- దీనిని రైతు సోదరులు విత్తనాలను 24 గంటలు నానబెట్టి తెల్ల మోసు వచ్చినప్పుడు డ్రమ్ సీడర్ లో లేదా నేరుగా జల్లటు చేస్తున్నారు. మొలక పొడుగ్గా రాకుండా జాగ్రత్త పడాలి.
3. ప్రధాన పొలం తయారీ:- సంప్రదాయిక వరి నాట్లకు చేసినట్లుగా ఈ పద్ధతిలో
4. అవసరమయ్యే కూలీ : ఈ పద్దతిలో ఒక ఎకరా విత్తడానికి కేవలం ఇద్దరు కూలీలు సరిపోతారు. డ్రమ్ సీడర్ లాగడానికి ఒక మనిషి, గింజలు నింపడానికి తాడు మార్చడానికి ఇంకొక మనిషి అవసరమవుతారు.
5. విత్తడానికి పట్టే సమయం: ఎకరానికి 2గంటల సమయం పడుతుంది. ఒక రోజులో 3 ఎకరాల వరకు విత్తుకోవచ్చు.
6. ఎరువుల యాజమాన్యం మరియు కలుపు యాజమాన్యం ను సమర్థవంతంగా శాస్త్రీయ సలహాలతో పాటించాలి.
7. నీటి యాజమాన్యం : విత్తనం వేసినప్పటి నుండి పొట్టదన వరకు పొలంలో నీరు నిల్వ వుండకుండా కేవలం బురద మాత్రమే వుంచాలి. కానీ పైరు పొట్ట దశ నుండి పంట కొసే 15 రోజుల ముందు వరకు 2 సెం.మి నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి.యాజమాన్య పద్ధతులను ఏదీ ఆచారించిన సమగ్రంగా పాటించుకోవాలి. ఎంత వీలయితే అంతంగా తక్కువ ఖర్చు చేస్తూ అధిక నికర ఆదాయం ఆర్జించాలి.నేరుగా విత్తే పద్ధతినే డ్రంమ్ సీదర్ యంత్రం లేదా పరికరంతో వర్షాలు పడి, నీరు చేయున్న వెంటనే కాలాతీతము కాకుండా నారు పెంచే పని లేకుండ వరి సాగు చేసే పద్దతి.డ్రమ్ సీడర పరికంచికే 4 ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెంమీ. దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలు వుంటాయి. ఈ డ్రమ్ములో మెలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి క్రమంలో కేవలం 75 శాతం మాత్రమే గింజలను నింపాలి. తాడువాడి డ్రమ్ లాగితే వరుసలు బాగా వస్తాయి. కోనోవీడర్ తిప్పడానికి వీలుగా వుంటుంది. కలుపు నివారణ సులభమవుతుంది. దీంతో బాటుగా తదితర యాజమాన్య పద్ధతులను చేసుకోవాలి.నేరుగా విత్తే వరి ఈ పద్ధతిలో డ్రమ్ సీడర్ పరికరానికీ బదులుగా నైపుణ్యత కలిగిన వ్యక్తులు నేరుగా వెదజల్లుతారు.
యంత్రంతో వరి నాటుట :- యంత్రాల ద్వారా కూలీల సమస్యను అధిగమించడానికి, వీరు వచ్చిన వెంటనే దమ్ము మొదలు పెట్టి వారు పెంచుకుని నాట్లు వేసుకోవడానికి వీలవుతుంది. చాప పద్దతిలో పెంచిన నారును 14-17 రోజులలో నాట్లు వేసుకోవచ్చును. ఎకరాకు సుమారు 70 ట్రే లు అవసరమవు తాయి. ట్రేకు 150 గ్రాముల విత్తనము చొప్పున 10-12 కిలోల విత్తనము సరిపోతుంది.
శ్రీవరిసాగు: లేత నారు, 25×25 సె.మీ దూరములో నాటడం, కోనో వీజర్లను త్రిప్పడము, పొలంలో నీరు నిల్వ లేకుండా పదునుగా ఉంచడం జరుగుతుంది. దీనిపై రైతులు అవగాహానతో వున్నారు.
యాంత్రీకరించిన శ్రీవరి:– వరిసాగును యాంత్రీకరణతో పాట ‘శ్రీ’ వరి సాగులో ఉన్న సమస్యలను అధిగమించడానికి రైతులు తక్కువగా యంత్రాలను వాడుతున్నారు. మిషన్ నాటు లాగా అన్పించేలా వుంటుంది. అయితే) రోటా వేటరు తో దమ్ము చేయడము, పొలంలో నీరు నిల్వ లేకుండా చూడటము, పదునుతో) వుండేలా చూసుకొని, కోనోవీడర్లను ఉపయోగిస్తూ కలుపు నివారించుకోవాలి.
ఆరుతడివరి (ఎఐబిక్ రైస్):-తక్కువగా నీరు ఉపయోగిస్తూ వరి పండిన పద్ధతిలో ఎరోబిక్ సాగు విధానము ప్రాచుర్యంలో వుంది. ఆరుతడి పద్ధతిలో వరిసాగుకీ పలు యాజమాన్య పద్ధతులు ఆచరించాలి. అమవైన రకాలు, భూమి తయారీ, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, నేరుగా విత్తులు, ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం నీటి యాజమాన్యం, చేసుకోవాలి. ఈ పద్ధతిలో స్వలు మరియు మధ్యకాల రకాలు అనుకూలం, ఎకరాకు 16కిలోల విత్తనము సరిపోతుంది. ఈ పద్ధతిలో చదును చేసిన పొలంలో వెదజల్లడం, గాని 20 సెం.మీ దూరంలో నాగతి సాలు వెనకగాని, దీరుతో గాని, ట్రాక్ట్బలు తో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసుకోవచ్చు. ఇంకా ఎరువుల యాజమాన్యం మరియు కలుపు యాజమాచ్యం ఎప్పటికప్పుడు చేస్తూ ఆరోగ్యవంతమైన పిలకలను నిలబెట్టుకోవాలి. నీటి యాజమాన్యం విషయానికొస్తే, నీటి తడులు అవసరం చాలా తక్కువ కలక దశలో పొలం చెప్పకు గురికాకుండా చూసుకోవాలి. ఈ విధానంలో నీటిని 40-50.శాంత మేర ఆదా చేసుకోవచ్చు.
- నేరుగా విత్తన పద్ధతుల వలన కలిగే ప్రయోజనాలు;
- విత్తనం ఎకరానికి 15-20 కిలోలు ఆదా అవుతుంది.
- పంట 7-10 రోజులు ముందుగా కోతల వస్తుంది.
- నారు పెంపకం, గాలు కోకడం, నాట్లు దేనీ పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు తగ్గుతుంది.
- దిగు బడి శాతం పెరుగుతుంది.
- తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకోవచ్చు.
- కూలీల కొరతను అధిగమించవచ్చు కూతల పై ఆధార పడడం తగ్గుతుంది.
- ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంది. ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయుట వలన లాభాలు
తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చా. - నారుమడి, పెంపకం, వాట్లకు అత్యు ఖర్చు తగ్గుతుంది.
- పంట త్వరగా కోతకు వస్తుంది.
- పంట పడిపోదు.
- చీడపీడల, తెగుళ్ళ సమస్య తక్కువ.
- నీటిని ఆదా చేసుకోవచ్చు.
- కోత యంత్రాలతో సులువుగా పంట కోత చేసుకోవచ్చు .
- ప్రయోజనాలతో బాటుగా కలుపు సమస్య. వుంటుంది. వర్షా భావ పరిస్థితులు వుంటే పంట దెబ్బతినే అవకాశం వుంటుంది.
ఈ విధంగా వరి సాగులో వివిధ పద్ధతులను రైతు సోదరులు. అవలంబించి సాగు చేసినట్లితే స్థిరత్వపు దిగుబడులను సాధించి నికర ఆదాయాన్ని పొందవచ్చు.
డా|| యస్. మధుసూధన్ రెడ్డి, డా.కె.గోపాల కృష్ణమూర్తి, డా|| వి.వెంకన్న,డా॥ యం.రా. ప్రసాద్ మరియు యం. మాధవి అసోసియేట్ వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట.