Centre Announces Official Statement On Paddy Procurement తెలంగాణాలో యాసంగి పంటపై గతి కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. వరి పంట కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయగా దానికి కేంద్ర ప్రభుత్వం నసేమిరా అంటుంది. రబీ సీజన్లో టార్గెట్ కి మించి ధాన్యం కొన్నామని దాటవేస్తుంది. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మాటల యుద్ధం కొనసాగుతుంది. కాగా పంట కొనుగోలుపై నేడు సభలో ప్రస్తావన రాగా.. దానికి కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. Sadhvi Niranjan Jyoti
2020 – 2021 రబీ సీజన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 55 మెట్రిక్ టన్నుల పంట టార్గెట్ పెట్టుకుంటే 61.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కేంద్రం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ మేరకు మిగులు బియ్యం కొనుగోలు చేశామని, టార్గెట్ కి మించి కొన్నామని అన్నారు. అయితే తెలంగాణలో ఈ ఖరీఫ్ లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ నుండే ఎక్కువ బియ్యం సేకరించినట్టుగా కేంద్ర ఆహార కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి జ్యోతి ప్రకటించారు. ఆగస్టు 17న జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. టీఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వర రావు, మాలోత్ కవిత, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానమిచ్చారు. Centre Statement
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు రైతులకు అస్సలు అర్ధం కానీ పరిస్థితి. కోసిన పంట కల్లాల్లోనే మొలకెత్తుతుంది. దీంతో ఆరుగాలం పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోగా.. అసలు ధాన్యం అమ్ముడవుతుందో లేదని రైతన్నలు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి పంట కొనుగోలు అంశానికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. Telangana Paddy Procurement