Animal Husbandry: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గా ఎస్. రామచందర్ నియమితులయ్యారు. ఈమేరకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిస్తూ ఆయనకు ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్న అనితా రాజేందర్ ను రిలీవ్ చేశారు. ఈ మేరకు డాక్టర్ రామచందర్ కు బాధ్యతలను అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా నేడు ఆదివారం కావడంతో రేపు రామచందర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం, అదే గ్రామానికి చెందిన రామచందర్ 1993 లో పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ ప్రారంభించి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా వృత్తిని ప్రారంభించి 1995 వరకు తాండూరులో పనిచేశారు. అనంతరం 1995 నుంచి 1999 వరకు శంషాబాద్ విఏయస్ గా ( వెటర్నరీ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు. 1999లో ఏపీపీఎస్సీ పరీక్ష రాసి గ్రూప్ 1 అధికారిగా సెలెక్ట్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్ గా మిర్యాలగూడెంలో 2006 వరకు చేశారు. 2006 నుంచి 2008 వరకు పబ్లిసిటీ ఎక్స్ టెన్సన్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా 2008 నుంచి 2013 వరకు మహబూబ్ నగర్ కరీంనగర్ జిల్లాల్లో జాయింట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో సెర్చ్ డైరెక్టర్ గా 2013 నుంచి 2016 వరకు పనిచేసి, తెలంగాణ ఏర్పడిన అనంతరం తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మొదటి రిజిస్ట్రార్ గా 2016 నుంచి 17 వరకు విధులు నిర్వహించారు. 2017 నుంచి 2019 వరకు పశు సంవర్ధక శాఖ ఎడిషనల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూనే 2019 ఫిబ్రవరిలో షీప్ ఎండిగా నియమితులయ్యారు. అనంతరం 2021 డిసెంబర్ 4న ప్రభుత్వం రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నా పై నమ్మకంతో నన్ను నియమించినందుకు సీఎం కేసీఆర్ కు, మంత్రి తలసాని అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శాఖ అభివృద్ధికి కృషి చేస్తాను అని రామ చందర్ తెలియజేసారు.
Also Read: https://eruvaaka.com/our-agriculture/animal-husbandry/techniques-in-animal-husbandry/
Also Watch: