సుబాబుల్, యూకలిప్టస్ సాగుచేసే చిన్న, సన్నకారు రైతులకు కటింగ్ ఆర్డర్ జారీ విషయంలోనూ, కనీస మద్దతు ధర కల్పించి తగు న్యాయం చేసే అంశంపై మంత్రి వర్గ సబ్ కమిటీ (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి(P.Ramchandra Reddy), కె.కన్నబాబు(K.Kanna Babu), కొడాలి నాని(K. Nani), బాలినేని శ్రీనివాస రెడ్డి(B.Srinivasa Reddy)లు పేపర్ మిల్స్ ప్రతినిధులు, ట్రేడర్స్, రైతుల ప్రతినిధులు, అధికారులతో ఈ రోజు సమావేశం అయ్యారు. సాగు చేసే ప్రతి రైతును సీఎం జగన్ ఆదుకుని అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సుబాబూలు,యూకలిఫ్టస్ సాగు చేసే రైతుల ఆర్థిక ప్రయోజనాల కోసం సంబధిత వ్యాపారులు, అధికారులతో లోతుగా చర్చిస్తున్నాం అని మంత్రులు అన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ధరలను నిరంతరం పర్యవేక్షించేందుకు రూపొందించిన ప్రత్యేక యాప్ (App) ను పవర్ పాయింట్ ప్రసంటేషన్ ద్వారా వివరించిన మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న(Pradhyumna). ట్రేడర్లను నియంత్రించేలా పలు చర్యలను తీసుకోవాలని మంత్రులు సూచించారు. రైతులకు మద్దతు ధరతో పాటు లాభదాయకమైన పరిస్థితులు కల్పించేలా చర్చిస్తున్న మంత్రులు దళారులను నియంత్రించి, ట్రేడర్లకు లైసెన్సింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నాబాబు అన్నారు. అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా పకడ్బందీగా చేయాలి యాజమాన్యాలు రైతులకు మంచి ధర ఇచ్చేలా ముందుకు రావాలని మంత్రులు అన్నారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి నివేదికను సీఎం జగన్ కు అందజేస్తాం. ఈ సమావేశంలో వ్యయసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాల కొండయ్య(P.Malakondayya), మార్కెటింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ మధుసూదన రెడ్డి(Madhushudhan Reddy)తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.