Bharathi Completed Phd in Chemistry: రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో కూలి పనులు చేసుకుంటూ తన గమ్యాన్ని చేరుకుంది ఓ పేద కుటుంబానికి చెందిన సాకే భారతి. ఇప్పుడు ఆమెను ప్రతి ఒక్కరు డాక్టర్ భారతీగా సంబోధిస్తూ ఆమె పడిన కష్టాల కడలిని దాటి తన లక్ష్యాన్ని చేరుకున్న వైనాన్ని గుర్తించి అభినందనలతో ముంచెత్తుతున్నారు. చిన్నతనం నుండే పేదరికాన్ని అనుభవిస్తూ ఎక్కడా కూడా కుంగుబాటుకు గురికాకుండా తను అనుకున్నది సాధించింది భారతి. అనంతపురం జిల్లా, సింగమనల నాగులగొడ్డం గూడానికి చెందిన భారతి కూలీరాలుగానే అందరూ గుర్తించారు. తాను కూలి పనులు చేసుకుంటేనే తన భర్త ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్, డిగ్రీని పూర్తి చేసింది. ఆపై ఉన్నత లక్ష్యాలు సాధించే క్రమంలో పీజీ పూర్తి చేసింది. పదవ తరగతి వరకు సింగనమల ప్రభుత్వ పాఠశాలలో, పామిడి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంది. పీజీ పూర్తి చేసుకున్న తరువాత భారతి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ పీహెచ్ డి చేసింది.
ఆది నుంచి కష్టాలే
భారతి పరిస్థితులు ఎలా ఉన్నా ఉన్నత లక్ష్యం వైపే అడుగులు వేసింది. తన కష్టాలతో ఎక్కడా కూడా తన విద్యకు ఆటంకాలు కలిగించకుండా ప్రత్యేకంగా దృష్టిని సారించి అనుకున్నది సాధించింది. తన ఎదుగుదలకు భర్త ప్రోత్సాహం మరువలేనిదిగా భారతి పేర్కొంటుంది .ఈరోజుల్లో పీహెచ్ డి చదువుకోవాలంటే ప్రోత్సహించేవారు చాలా అరుదుగా ఉంటారు. అందులోనూ ఆర్థికపరమైన అవగాహన కోసం ఎన్నో రకాల ఆవా0తరాలను ఎదుర్కొంటారు. అయితే భారత విషయంలో ఆమె భర్త చేసింది ప్రశంసించ వలసిన విషయం.
Also Read: Fish Distribution Scheme: ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ద్వారానే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి.!
ఒక్కసారిగా వెలుగులోకి
సాకే భారతి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్ డి చదువుకుంటున్న సమయంలో దాదాపు గుర్తింపుకు నోచుకోలేదు. అయితే యూనివర్సిటీలో మాత్రం పేద విద్యార్థినిగా గుర్తించినట్లు తెలిసింది. ఎప్పుడైతే గవర్నర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కి వచ్చి పీహెచ్ డిలు పూర్తి చేసిన వారికి డాక్టరేట్ పట్టాలు అందించారు. అప్పటినుంచి సాకే భారతి పై సమాజం దృష్టిసారించింది. ఆమె డాక్టర్ పట్టా పొందేందుకు వచ్చిన తీరు చూసి ఆమెను పలువురు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె పడిన కష్టాలని సాధించిన విజయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈవిషయం మీడియాలో వైరల్ గా మారటంతో ప్రతి ఒక్కరు సాకే భారతిని అభినందించారు. అలాగే ఆమె భర్తను కూడా అభినందించడం జరిగింది.
ఉన్నత శిఖరముల వైపు నడిపించే విధంగా
కూలి నాలి చేసుకుంటూనే పీహెచ్డీ చేసిందని ఇప్పటివరకు తన పడ్డ కష్టాలు చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తనకు రెండు ఎకరాల భూమిని అందజేసింది. అలాగే ఎస్కేయూ యూనివర్సిటీ పరిధిలో ఉన్న రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉండటంతో సాకే భారతి అంగీకరిస్తే ఆపోస్టుకు ప్రతిపాదనలో పంపించేందుకు అనంతపురం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు సింగనమల మండలంలోని సోదనపల్లి గ్రామం పొలం సర్వే నెంబర్ 9- 12 లో వ్యవసాయ యోగ్యంగా ఉన్న రెండు ఎకరాల భూమి పత్రాలను భారతికి ఆ జిల్లా కలెక్టర్ గౌతమి అందజేయడం జరిగింది. కష్టాల కడలి దాటి ఉద్యోగం వైపు పరుగులిడి ఉన్నత లక్ష్యాలను నెరవేర్చే క్రమంలో తన కింద ఎంతోమంది విద్యార్థులను నిష్ణాతులను చేసి ఉన్నత శిఖరాల వైపు నడిపించే విధంగా తన మార్గదర్శకత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇటువంటి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, సమాజంపై ఉందని పలువురు పేర్కొనటం గమనార్హం.
Also Read: Kisan Mulberry Cultivation: నర్సరీ సాగుకు కిసాన్ మల్బరీ సాగు ప్రోత్సాహాం.!