Crop Rotation System: మనదేశంలో చాలా మంది రైతులు ఒకే రకమైన వ్యవసాయం చేస్తూ లాభాలు రాక ఆర్ధికంగా చితికిపోతున్నారు. పంట మార్పిడి లేకపోవడం వల్లన తెగుళ్ళు వ్యాపించి భూసారాన్ని తగ్గిస్తున్నాయి. దానికి తోడు పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. దీంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఈనేపద్యంలో రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి విధానం అనుసరించాలి. పంట మార్పిడి ద్వారా నాణ్యత పెరిగి దిగుబడులు పెరుగుతాయి. అంతేకాకుండా ఈవిధానంతో పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా భూసార సంరక్షణ, పోషక లోపాల నివారణ జరిగి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకే పంట పండించడం ద్వారా నేలలో ఉన్న పోషకాలను గ్రహించడంతో విఫలమవుతాయి. దీంతో పంటల దిగుబడులు తగ్గిపోతాయి. అందువల్ల పత్తి, కంది వరి, వేరుశనగ వంటి పంటలతో పంట మార్పిడి చేయాలి.
శాస్త్రవేత్తల సూచనలు తప్పనిసరి
నీటి వసతి లేని ప్రాంతాల్లో ఒక పంటను పూర్తి నీటి వసతితో పండించి, రెండో పంటను వర్షాధారంగా వేసుకుంటే నీటి వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది. మిరప, టమాట, వేరుశనగ పంటలను ఆశించే లద్దెపురుగు నివారించాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి పంటలతో మార్పిడి చేయాలి. దీని ద్వారా మట్టి సారవంతమవుతుంది. ఉత్పాదకతను స్థిరంగా కాపాడుకోవచ్చు. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులను మనం పొందవచ్చు. ఇందులో పంట మార్పిడి చేసేటప్పుడు ఏ పంట వేయాలి అనేది ఎంచుకోవడం ముఖ్యం. శాస్త్రవేత్తలు వ్యవసాయాధికారులు సూచనలు తీసుకుంటే ఇంకా మంచిది.
Also Read: Weed Management in Paddy: వరిలో ప్రధాన సమస్యగా మారిన కలుపు.!
బెర్న్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారణ
పంట మార్పిడి విధానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన బెర్న్ యూనివర్సిటీ పరిశోధకులు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఏమిటంటే మొక్కజొన్న పంట వేసిన తర్వాత దాని స్ధానంలో గోధుమను వేస్తే దిగుబడి రెట్టింపు వస్తుందని గుర్తించారు. ముందుగా మొక్కజొన్న వేయడం వల్ల అది నేలలోని మైక్రోబయోమ్‌ను మారుస్తుందని గుర్తించారు. ఆపంట తీసేసిన తరువాత కూడా ఆసూక్ష్మజీవులు నేలలో ఉండటంతో తర్వాత వేసిన గోధుమ బాగా పండుతుందని శాస్ర్తవేత్తలు తెలుసుకున్నారు. పైగా నేలలో బెంజాక్సాజినాయిడ్లు ఉండటం వల్ల మొక్కలకు తెగుళ్లు కూడా తక్కువగా వస్తున్నాయట. మొత్తమ్మీద దీనివల్ల ఎరువులు క్రిమికీటకసంహారిణుల అవసరం కూడా బాగా తగ్గింది. ఒకే నేలలో ఒకే పంట వేయకూడదు. పంట మార్పిడి చేస్తే తెగుళ్లు బెడద ఉండదు. ముఖ్యంగా రైతులు ఏపంటకు ఏనేల సరిపోతుందో ముందు చూసుకోవాలి. అప్పుడే నిస్సారమైన దిగుబడులను సాధిస్తాము.
పంట స్థానంలో పంట
పంట మార్పిడి విధానంలో నేల ఉపరితాలన్ని కప్పే విధంగా చూసుకోవాలి. శనగ, బొబ్బర, ఉలవలు, మినుములు, పెసర వేయడం వల్లన నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని ద్వారా కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. పత్తి వేసిన తరువాత దాని స్ధానంలో మినుము, పెసర లాంటి పంటలు వేయడం ద్వారా తెల్లదోమ ఉదృత్తిని తగ్గించుకోవచ్చు. వేరుశనగ తరువాత జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను వేసుకోవాలి. దీని ద్వారా వేరుశనగ లో వచ్చే ఆకు ముడత తెగుళ్లను నివారించవచ్చు. పసుపు తరువాత దాని స్ధానంలో వరి, జొన్న వంటి పంటలను సాగు చేస్తే నేలలో ఉండే నెమటోడ్ల సంఖ్యను తగ్గించుకోవచ్చు. వరి తరువాత పప్పుధాన్యాలు కానీ, నూనె గింజలు గాని పండించడం ద్వారా వరి పంటను ఆశించే టంగ్రో వైరస్ దోమపోటు ను సమర్థవంతంగా నివారించవచ్చు. పెసర, పశుగ్రాసం గాని వేస్తే దాని స్థానంలో వేరుశనగను సాగు చేయాలి.
Also Read: Uppalapadu Bird Sanctuary: ఉప్పలపాడు కేంద్రంగా పక్షుల సంరక్షణ కేంద్రం.!