Agriculture Varieties: వ్యవసాయ రంగంలో చాట్ జీపీటీ ఆధారిత సాఫ్ట్ వేర్లు, పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. డ్రోన్లతో ఎరువులు, పురుగు మందులు చల్లడం దగ్గర నుంచి తెగుళ్లను గుర్తించడం దాకా ఈ టెక్నాలజీని వాడుతున్నారు. పంటలో తేమ శాతం నుంచి నాణ్యత, గ్రేడింగ్ దాకా మరియు ఉత్తమ సాగు పద్ధతులు, మంచి మార్కెటింగ్ అవకాశాలు, అత్యుత్తమ వంగడాలను సృష్టించేందుకూ తోడ్పాటును కల్పిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మిర్చి, పసుపు పంట నాణ్యత పరిశీలనకు ఏఐ యంత్రాల వినియోగం ఆమల్లోకి వచ్చింది.
ఆధునిక యంత్ర పరికరాల రావడంతో వ్యవసాయం కొంత పుంజుకుంది. అయితే తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అనే పరిస్దితికి వచ్చింది. వ్యవసాయం చేస్తున్న వారికి పెళ్లి కూడా అవడం లేదని వ్యవసాయానికి జంకుతున్నారు. ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు అనేవి తెరమీదకు వచ్చాయి. అంతేకాకుండా వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.
వాట్సాప్ ద్వారా సమాచారం
ప్రపంచంలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 70 శాతం పైనే ఉంది. ఇది కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఏకైక రంగం ఇదే. అయితే వాతావరణ పరిస్ధితులు, మార్కెట్ ధరలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికే రైతులకు జూదంలో మారింది. ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతున్న కూడా వ్యవసాయంలో ఎటువంటి మార్పులు రావడం లేదు. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆధునిక టెక్నాలజీ వాడకం మొదలైంది. ఈనేపధ్యంలో చాట్ జీపీటీ ఈప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్ కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సరీవస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘ జుగల్‌బందీ’చాట్‌బోట్ వీటిలో ఒకటి. దీని ద్వారా సంక్షేమ, సహాయ పథకాల వివరాలను సాఫ్ట్ వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందిస్తోంది.
Also Read: SilK Production: పట్టు ఉత్పత్తిలో స్వావలంబనకు అవకాశాలు.!
కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ
చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలా మందికి సందేహం కలగవచ్చు. దీని ద్వారా సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందని నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దాన్ని విశ్లేషించి రైతులకు వివరిస్తున్నారు. అంతేకాకుండా వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి నమూనా, పంటకు ఆశించే చీడపీడలు, వేసిన పంట ఎంత పండేది ఖచ్చితంగా చెప్పగలరు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంది తగ్గించుకునే సూచనలు కూడా అందిస్తోంది. జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదలు వంటివి జరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకునే కొత్త వంగడాల అవసరం పెరిగింది. భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది.
కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్‌బోట్ సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు ప్రతీక్ దేశాయ్ తెలిపారు. మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏదైనా తెగుళ్లకు గురయ్యాయా? రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు.
Also Read: Organic Cultivation: సేంద్రియ సాగుతో ఏడాదికి రూ.21 కోట్ల ఆదాయం.!