Coriander Farming Profit: కొందరు రైతులు అధునాతన పద్ధతులను ఉపయోగించుకుంటూ కాలానికి అనుగుణంగా పంటలు పండిస్తూ లాభాలు పొందుతారు. వ్యవసాయ పంటలతో విసిగిపోయిన రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నిత్యం పండించే కూరగాయలు, ఆకుకూరలు వేసి అధిక లాభాలను పొందుతున్నారు. గిట్టుబాటు ధర కోసం ఎదురుచూసే రైతులకు అప్పుడప్పుడు కూరగాయల సాగు కూడా లాభాల వర్షం కురుస్తుంటుంది.
ఉదాహరణకు ఇప్పుడు టమోటా కు ఉన్న డిమాండ్. బాగా డిమాండ్ ఉన్నప్పుడు ధరలు కూడా విపరీతంగా పెరిగి, దిగుబడి ఊహించిన దాని కంటే ఎక్కువగా వచ్చినప్పుడు రైతుల పంట పండుతుంది. రైతుల ఇళ్లు సంక్రాంతిని తలపిస్తాయి. అయితే రైతులు అధునాతన పద్ధతులను ఉపయోగించుకుంటూ, కాలానికి తగిన పంటలు వేస్తూ లాభాలను పొందుతున్నారు. ఈకోవలోకే వస్తారు మహారాష్ట్ర రైతు రమేశ్ విఠల్రావు. అధునాతన సాంకేతిక పద్ధతులతో కొత్తిమీర సాగు చేసి, ఐదేళ్లలో దాదాపు రూ.కోటి రూపాయలు సంపాదించారు.
Also Read: Solar Dryer: పంట నిల్వ కోసం సోలార్ డ్రైయర్ కనుగొన్న మెకానికల్ ఇంజనీర్.!
ఇతర రైతులకు స్ఫూర్తి
ఈఏడాది కొత్తిమీర సాగుతో సుమారు రూ.16 లక్షలకు పైగా ఆదాయం పొందాడు. చీడపీడలు ఆశించకుండా సేంద్రియ వ్యవసాయం చేశారు. తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులను తీసాడు. రమేష్ కొత్తిమీర పండించకముందు ద్రాక్షను పండించారు. దీంతో లాభాలను అందుకున్నాడు. తర్వాత ఆ పంటను వదిలివేసి కొత్తిమీరను పెంచడం ప్రారంభించారు. మొదటి సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడి తో రూ.25 లక్షలు దాకా లాభాన్ని పొందారు. 2020లో రూ.16 లక్షలు, 2021లో రూ.14 లక్షలు, 2022లో రూ.16 లక్షలతో అతని సంపాదన వృద్ధి చెందుతూ ఉన్నాడు. కొత్తిమీర సాగు అతనికి బాగా కలిసి వచ్చింది. ఇప్పటి వరకు రూ.కోటి వరకు సంపాదించారు. రమేష్ కొత్తిమీర సాగు ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలిచింది. చాలా మంది రైతులు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో లాభాలు పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు. తరచూ నష్టాలను మూటగట్టుకుంటూ అప్పుల పాలవుతున్నారు.
అధిక ఆదాయం కోసం ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుంటున్నారు ఆ కోవలోనిదే ఈ సాగు. అంతేకాకుండా ఈ సాగు విధానం గురించి అందరికి సలహాలు ఇస్తున్నారు. రైతులు సంప్రదాయ వ్యవసాయానికి మించి వినూత్నమైన, లాభదాయకమైన మార్గాలను అన్వేషించాలని మార్కెట్ వర్గాలు సూచిస్తాయి. మార్కెట్ పోకడ, ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంకల్పం, సరికొత్త ఆలోచనలతో రైతులు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవచ్చని నిరూపిస్తాయి.
Also Read: Oil Palm Farmers: టన్ను 23 వేల ఉన్న ధర 13 వేలు అయ్యింది రైతుల ఆవేదన.!