Coleus Cultivation: కోలియస్ దుంప ఉష్ణమండలపు పంట దీన్ని మన భారతదేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో సాగు చేస్తున్నారు. దీని శాస్త్రీయ నామం కోలియస్ రోటండి ఫోలియస్, లామియాసి కుటుంబానికి చెందినది. ఈ దుంపను చైనీస్ పొటాటో, బ్లాక్ పొటాటో, మడగాస్కార్ పొటాటో, హౌసా పొటాటో లేదా ఫ్రా ఫ్రా పొటాటో అని ప్రపంచంలో వివిధ పేర్లతో పిలుస్తారు. మళయాళంలో కూర్క, కర్ణాటకలో సాంబ్రాణి గడ్డ, తమిళనాడులో శిరికలింగు అని పిలుస్తారు.
వాతావరణం : ఉష్ణమండలపు పంట, సమృద్దిగా ఉండే సూర్య రశ్మి మరియు మధ్యస్థంగా ఉండే వర పాతంతో పాటు రాత్రులందు చల్లగా ఉండటం ఈ పంటకు బాగా అనుకూలము.
నేలలు : సారవంతమైన, మురుగు నీటి పారుదల సౌకర్యం గల ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు బాగా అనుకూలం.
రకాలు :
1. జూ -1 : టి.యన్.ఎ.యు. కోయంబత్తూరు (1991)
2. శ్రీధార : సి.టి.సి.ఆర్.ఐ. త్రివేండ్రమ్ (1993)
3. నిధి : ఆర్. ఎ. ఆర్. ఎస్. పటాంబి, కె.ఎ. యు (2000)
3. సుఫల : కె.ఎ. ము, కేరళీ
Also Read: Terrarium Plants Cultivation: టెర్రేరియం మొక్కల పెంపకం.!
పోషక విలువ :
కోలియస్ దుంపలో నీరు – 75.6%, శక్తి – 394 కి. జ., కార్బోహైడ్రేట్స్ – 21%, ప్రోటీన్స్ – 13.6 మి.గ్రా, కొవ్వు – 1.2%, ఫైబర్- 1.6%, విటమిన్ ‘‘సి’’ – 10 మి.గ్రా. ఇనుము – 8 మి.గ్రా., కాల్షియం – 17 మి.గ్రా, థయామిన్ `0.05 మి.గ్రా., రైబోఫ్లావిన్ – 0.02 మి.గ్రా., నియాసిన్- 1.0 మి. గ్రా., పోషకాలు ఉన్నవి.
కోలియస్ దుంపలను మరియు ఆకుల కషాయం కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆఫ్రికాలోని షునా, నైజీరియా ప్రాంతం వారు ఔషధంలా వాడుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. కోలియన్ దుంపలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. కోలియస్ మొక్క ఆకులను కాచి కషాయంలా సేవిస్తారు. ఈ కషాయం విరేచనాలు, అతి సారం, గొంతు మరియు నోటి ఇన్ఫెక్షన్, కొన్ని కీటకాలు కుట్టినప్పుడు వాడుతారు.
కోలియస్ దుంపను గుండె సమస్యలకు, క్యాన్సర్ నివారణకు, జీర్ణ సంబంధ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు మరియు దురదలు వంటి ఆనారోగ్యం కలుగకుండా వాడుతారు. కోలియస్ దుంపలు పచ్చి మిరియాల సుగంధ మిళిత రుచి కలిగి ఉంటాయి. ఈ దుంపలను ఉడికించి, వేయించుకొని లేదా ఇతర కూరగాయలతో కలిపి కూర తయారీకి వాడుతారు.
Also Read: HRMN-99 Apple Cultivation: తెలంగాణలో HRMN-99 ఆపిల్ సాగు.!