Bengal Gram Cultivation: పాకిస్తాస్, టర్కీ, మెక్సికో, బర్మా, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలో బీహార్, హర్యానా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా శెనగ పంట పండిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శెనగ పంట 65% విస్తీర్ణం, 70% ఉత్పత్తి భారత దేశంలోనే ఉంది. భారత దేశంలో మధ్య ప్రదేశ్ శెనగ పంట పండించడంలో మొదటి స్థానంలో, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో శెనగ పంటని రబీ పంటగా నల్ల రేగడి భూముల్లో సాగు చేస్తారు. మనదేశంలో అని రాష్ట్రంలో శెనగ పంట విస్తీర్ణం సుమారు 11 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 3.98 లక్షల టన్నుల దిగుబడి, ఎకరానికి 362 కిలోలు వరకు పండిస్తున్నారు.
వాతావరణం:
1. శెనగ పంట చల్లని వాతావరణంలో పెరుగుతుంది.
2. శెనగ పంట తక్కువ వర్షపాతం 600-1000 ఎం. ఎం ఉన్న ప్రాంతాలలో పండిస్తే మంచి దిగుబడి వస్తుంది.
3.ఈ పంటకి లోతైన వేర్లు ఉండటం వలన శెనగ పంట భూమిలోపలి పొరల నుండి తేమను కూడా వాడుకుంటుంది.
4. ఈ పంట నీటి నిల్వను ఏ దశలో అయిన తట్టుకోలేదు. కాని తేలిక పాటి తడులు పూత, గింజలు నిండే సమయంలో ఇవ్వడం మంచిది.
5. ఈ పంటకు అనుకూలమైన ఉష్ణోగ్రత 24-30 సెంటీగ్రేడ్స్
నేలలు:
1. నల్ల రేగడి నేలలు శెనగ పంటకు అనుకూలం. నల్ల రేగడి నేలలో నిల్వ ఉండే తేమను పంట ఎక్కువగా వాడకుండా, శీతాకాలంలోని మంచును వాడుకుంటూ మొక్కలు పెరుగుతాయి.
2. చౌడు భూములు శెనగ పంటకి పనికిరావు.
నేల తయారీ: తొలకరిలో వేసినప్పుడు పైరు కోసిన తరువాత భూమిని నాగలితో ఒక సారి గొర్రుతో రెండు సార్లు మెత్తగా దున్ని నేలని సమానంగా చేయాలి.
విత్తే సమయం: అక్టోబర్- నవంబర్ నెలలో విత్తుకోవాలి.
విత్తన మోతాదు: ఎకరాకు 20-26 కిలోలు. ఆలస్యంగా వేసినప్పుడు విత్తన మోతాదు 20% పెంచాలి.
Also Read: SRI Method of Paddy Cultivation: శ్రీ పద్ధతిలో వరి సాగు చేయడం ఎలా.?
విత్తన శుద్ధి: ఎండు తెగులు ఉంటే కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా వాడితే మంచి ఫలితం ఉంటుంది. రైజోబియం కల్చరును విత్తనానికి పట్టించి విత్తితే రైజోబియం లేని భూముల్లో 20-30% అధిక దిగుబడిని పొందవచ్చు. శీతల విత్తనానికి రైజోబియం 250 గ్రాములు వాడాలి.
విత్తడం: నాగలి వెంబడి కాని, గొర్రుతో కాని విత్తుకోవచ్చు.
విత్తన దూరం: 30 x 10 సెంటి మీటర్లు.
ఎరువులు: చివరి దుక్కిలో ఎకరాకు రెండు టన్నులు పశువుల ఎరువు వేసి బాగా కలియ దున్నాలి. భాస్వరం 20 కిలోలు, గంధకం 16 కిలోలు వేయాలి.
రకాలు:
శెనగ లో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి.
1. దేశవాళి రకాలు
2. కాబూలీ రకం
నీటి యాజమాన్యం:
1. శెనగ పంట వర్షాధార పంట, తేలిక పాటి నీటి తడులు ఇచ్చి అధిక దిగుబడి ని పొందవచ్చు. నీటి తడులు ఇచ్చినపుడు నీరు నిలువ ఉండకూడదు.
2. పూత దశకు ముందు ఒక సారి, కాయ దశలో మరొక సారి నీటి తడి ఇవ్వాలి.
కలుపు నివారణ: విత్తే ముందు ఫూక్షురాలిస్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి. విత్తిన తరువాత పెండిమిథాలిన్ ఎకరాకు 1.3 – 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర పంటలు కూడా వేసుకోవచ్చు.
నిప్పింగ్ : శెనగలో కొమ్మలను కత్తరించాలి : 30-40 రోజుల తర్వాత ప్రతి కొమ్మలోని కోణాలను కత్తరించాలి అప్పుడు ఎక్కువ కొమ్మలు వచ్చి మంచి చెట్టు పెరుగుతుంది. ఎక్కువ పూత వచ్చి దిగుబడి పెరుగుతుంది.
పంట కోత: కోతకు వచ్చిన మొక్కలను పీకి వారం రోజుల వరకు కుప్ప కట్టి ఉంచాలి. ఎండిన తరువాత కట్టెల సహాయంతో గింజలని వేరు చేయాలి. వేరు చేసిన గింజలను శుభ్రపరచి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా సాగు చేయడం ద్వారా ఒక ఎకరంలో 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. రైతులు మంచి లాభాలు కూడా పొందవచ్చు.
Also Read: Soybean Cultivation: ఈ పంటని ఇలా సాగు చేయడం వల్ల రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి..