Black gram Varieties – ఎల్. బి. జి 17: పాలిష్ రకము. గింజలు లావుగా ఉంటాయి. బూడిద తెగులును తట్టుకుంటుంది. కాయలపై నూగు ఎక్కువగా ఉంటుంది. కొమ్మలు విస్తరించి పెరుగుతాయి. పంట కాలము 80-85 రోజులకు వస్తుంది. దిగుబడి 6-7 క్వి / ఎ. ఇస్తుంది.
ఎల్. బి. జి 645: లావు పాటి పాలిష్ రకము. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయలు నూగు లేకుండా పొడవుగా ఉండును. పంట కాలము 85-90 రోజుల వరకు ఉంటుంది.8-10 క్వి / ఎ దిగుబడి వస్తుంది.
ఎల్. బి. జి 648: పాలిష్ రకము. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయలపై నూగు కలిగి ఉంటుంది. బూడిద, ఆకు మచ్చ , మరియు త్రుప్పు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలము 90-95 రోజులకు వస్తుంది. దిగుబడి అనేది 8-9 క్వి / ఎ.
ఎల్. బి. జి 685:
పాలిష్ రకము. కాయలపై నూగు తక్కువగా ఉంటుంది. కాయలు కణుపులు వద్ద కూడా కాస్తాయి. ఎండు తెగులును తట్టుకుంటుంది. పంట కాలము 85-90 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి 8-9 క్వి / ఎ.
Also Read: Black gram Health Benefits: మినుములతో ఎన్నో ఉపయోగాలు.!
ఎల్. బి. జి 709: పాలిష్ రకము. కాయలపై నూగు ఉంటుంది. మాగాణి భూముల్లో ఆలస్యంగా విత్తుకొనుటకు అనువైనది. పంట కాలము 80-80 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి 6-7 క్వి / ఎ.
ఎల్. బి. జి.752: వరి మాగాణుల్లో ఆలస్యం గా విత్తుటకు అనువైన రకము. పల్లాకు తెగులును చాలా వరకు తట్టుకును పాలిష్ రకము. పంట కాలం 75-80 రోజులకు వస్తుంది. దిగుబడి 6-7క్వి./ ఎ.
ఎల్. బి. జి 787: పాలిష్ మధ్యస్థ గింజ రకము. కాయలు ప్రధాన కాండం మీద కణుపులు వద్ద కూడా వస్తాయి. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. పంట కాలము 75-80 రోజుల వరకు వస్తుంది. దిగుబడి 8-9 క్వి / ఎ.
పి. యు 31: సాధా రకము. కాయల మీద నూగు ఉంటుంది. పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. పంట కాలము 70-75 రోజులకు వస్తుంది.
టి. బి. జి 104: పాలిష్ రకము . పల్లాకు తెగులును తట్టుకుంటుంది. అన్ని కాలాలకు అనువైన రకం. పంట కాలం 70-75 రోజుల వరకు ఉంటుంది.
Also Read: Black gram Cultivation: మాగాణి మినుములో కలుపు యాజమాన్యం అవసరమా.!