Indian Fisheries Sector: ఎగుమతులతో పాటు దేశీయ మార్కెట్ వినియోగంపై మత్స్య రంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా. దేశంలో మత్స్య రంగం సామర్థ్యాన్ని గ్రహించి 2024-2025 నాటికి చేపల ఉత్పత్తిని 22 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రూపాల చెప్పారు. ఈ నిర్ణయంతో 28 మిలియన్ల మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు మరియు సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో భారత పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలా ప్రసంగించారు. భారతదేశ ఎగుమతిలో 74% రొయ్యలు వాటాగా ఉందన్నారు. ఇక భారతదేశం విత్తన నాణ్యత మరియు లభ్యత, స్మార్ట్ వ్యవసాయం మరియు ఆహార భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు ఐటీసీ అగ్రి బిజినెస్ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజనీకాంత్ రాయ్.
Also Read: Fish farming: కుంటలలో చేపలను వదిలిపెట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
భారతీయ మత్స్య మరియు ఆక్వాకల్చర్ రంగం గత 5 సంవత్సరాలలో సగటు వార్షిక వృద్ధి 7.53% గా నమోదైంది. 2019-20లో దేశం రూ. 46,662 కోట్ల (6.68 బిలియన్ డాలర్లు) విలువైన 12.89 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసింది. సీవీడ్ ఫార్మింగ్ వంటి అధిక డిమాండ్ విభాగాల్లో పెట్టుబడికి కొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్. మత్స్య మరియు ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (FIDF) రూ. 7,522.48 కోట్ల నిధులతో సముద్ర మరియు లోతట్టు మత్స్య రంగాలలో మత్స్య మౌలిక సదుపాయాల కల్పనకు మరియు చేపల ఉత్పత్తిని పెంపొందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది.
Also Read: Fish nutrition: మంచి నీటి చేపల చెరువులో పోషక యాజమాన్యం