Organic Honey Farming: తేనెటీగలు అనేక ఔషధ మొక్కల నుంచి పదార్థాలు సేకరించి తేనెను నిల్వ చేయడం వల్ల ఈ రకమైన తేనెలో అత్యధిక ఔషధ విలువలు ఉంటాయని జిఎస్ఆర్ నేచురల్ హనీ నిర్వాహకులు గంధం సురేంద్ర తెలిపారు. తాము పాన్నూరు కేంద్రంగా ఈ పరిశ్రమలో 30 సంవత్సరాల నుండి కొనసాగుతున్నామన్నారు. తమ సంస్థ నుండి 30 రోజులకు ఒకసారి 500 కేజీల తేనెను ఈగల ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుందని చెప్పారు.
బ్రాండెడ్ కంపెనీల్లా కాకుండా తము వద్ద దొరికే తేనె బాయిలింగ్ చేయకపోవడం కారణంగా దాని సహజ లక్షణాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. తమ సిబ్బంది రోజుకు 18 గంటలు శ్రమించడం ద్వారా మంచి తేనెను తమ ఖాతాదా రులకు అందివ్వటం జరుగుతుందన్నారు. బాక్సుల ద్వారా తేనె సేకరించేందుకు తాము చిత్తూరు, రాజమండ్రి, దోర్నాల వంటి ఎన్నో ప్రాంతాలకు తరచూ ప్రయాణం చేస్తామన్నారు. కొంతమంది. సొంటితేనె, వేపతేనె అని విక్రయిస్తారు. అలాంటి రుచులు తేనెకు ఉందంటే అందులో ఖచ్చితంగా కెమికల్స్ కలిసినట్టే. ఫ్లవరింగ్ ద్వారా అంటే ఆయా పూలు ఉండే ప్రదేశాలలో సేకరించే తేనె ఆ లక్షణాలకు అవకాశముంటుంది. గిరిజన్ వంటి ప్రభుత్వ సంస్థలకు సైతం టెండర్ల ప్రక్రియ ద్వారా తాము తేనెను తరచూ పంపిణీ చేస్తుంటామన్నారు. ఇలా భారీ స్థాయిలో ఒక పరిశ్రమగా తమ జిఎస్ఆర్ నేచురల్ హనీ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానాన్ని చూరగొని స్వచ్ఛతకు స్వస్థలంగా మారిందని చెప్పుకోవడంలో సగర్వంగా ఉందని గంధం సురేంద్ర (G. Surendra) అభిప్రాయ పడ్డారు.
Also Read: ఆకుకూరల సాగుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న గ్రామం
కాగా.. తేనె వాడకం వల్ల పిల్లలు హాయిగా నిద్ర నిద్రపోతారని అనేక అధ్యయనాల నుంచి తీసుకున్న ప్రాథమిక ఫలితాలు సూచిస్తున్నట్టు తల్లిదండ్రుల అభిప్రాయాల ప్రకారం, తేనె వాడకం వల్ల పిల్లలు దగ్గు, కఫం / గళ్ళ నుంచి బాగా ఉపశమనం పొంది రాత్రి పూట బాగా నిద్ర పోతున్నారని అధ్యయనాలు తేల్చాయి. మందులు తేనెతో కలిసి తీసుకున్నపుడు శరీరంలో త్వరగా వెళ్లి రక్త ప్రసరణ ద్వారా శరీరం అంతటా మందు వ్యాపిస్తుంది.
మందు యొక్క సామర్థ్యాన్ని తేనె ప్రభావితంగా వుంచడమే కాక దాని ప్రభావం శరీరంలో ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది. నల్లగా ఉన్న తేనెలో అనామజనకాలు (యాంటీ ఆక్సిడెంట్స్) ఎక్కువగా ఉంటాయి. తేనెను సరైన క్రమంలో మూసిపెట్టి భద్రపరిస్తే ఎంత కాలమైనా చెడకుండా ఉంటుంది.
Also Read: కరివేపాకు సాగు లో యాజమాన్య పద్ధతులు