సేంద్రియ వ్యవసాయం

వర్టికల్ గార్డెన్ నిర్మాణానికి 75% సబ్సిడీ అందించనున్న కేరళ ప్రభుత్వం

0
Kerala Urban Farming

Kerala Govt Offering 75% Subsidy For Urban Farming  ఆర్కా వర్టికల్ గార్డెన్ ని ప్రోత్సహించడానికి కేరళ ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రకృతి ప్రేమికుల కోసం ఆర్కా వర్టికల్ గార్డెన్ నిర్మాణాలను కొనుగోలు చేసి పంపిణీ చేయాలని యోచిస్తోంది. ప్రారంభంలో దీనిని ప్రోత్సహించడానికి ఎర్నాకులం మరియు తిరువనంతపురం పట్టణ జనాభాను ఎంచుకున్నారు. Kerala Urban Farming బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ (IIHR) ఆర్కా వర్టికల్ గార్డెన్ నిర్మాణాన్ని రూపొందించింది. తమ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐఐహెచ్‌ఆర్‌ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యాన మిషన్ సహకార వ్యాపారాల మద్దతుతో స్థానికంగా నిర్మాణాలను రూపొందించాలనుకుంటోంది. మొదటి దశలో ఎర్నాకులం మరియు తిరువనంతపురంలోని పట్టణ గృహాలకు 330 యూనిట్లను సరఫరా చేయాలని మిషన్ ఉద్దేశించింది.

ఆర్కా వర్టికల్ గార్డెన్ ని ప్రోత్సహించడానికి కేరళ ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో

వ్యవసాయానికి స్థలం లేకపోవడం, పట్టణ ప్రాంతాల్లోని అపార్టుమెంట్లలో నివసించే వారికి గార్డెనింగ్ పై ఆసక్తి ఉన్నప్పటికీ ఎం చేయలేని పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆ రాష్ట్ర సర్కార్ ముందుకొచ్చింది. నిలువు తోట నిర్మాణానికి పూర్తిగా మద్దతు ఇస్తామని ప్రకటించింది. సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన పద్ధతిలో కూరగాయలను ఉత్పత్తి చేయడానికి ఈ నిర్మాణం అద్భుతమైనది. ఈ నిర్మాణాలను బాల్కనీ లేదా డాబా వంటి సూర్యరశ్మి పుష్కలంగా ఉండే ప్రాంతాల్లో ఉంచవచ్చు. ఈ నిర్మాణాలలో కూరగాయలు, ఔషధ మొక్కలు మరియు పూల పంటలను పెంచవచ్చు. Kerala Govt Offering Urban Farming

Kerala Urban Farming

టొమాటో, మిరపకాయలు, బఠానీలు మరియు వంకాయలు వంటి రెండు అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకునే మొక్కలను ఈ తరహా పద్దతిలో పెంచుకోవచ్చు.పై అంతస్తులలో ఆకు కూరలు మరియు బ్రాహ్మి, పుదీనా వంటి ఔషధ మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. భవనంపై భాగంలో చిన్న గొట్టాలు మరియు డ్రిప్పర్‌లతో 25-లీటర్ల ప్లాస్టిక్ కంటైనర్‌ను ఉపయోగించి మొక్కలకు నీరు పోస్తారు. ఒక సీజన్‌లో ఐదు కిలోల పంటను సేకరించవచ్చు. 75% Subsidy For Urban Farming

IIHR

కాగా పట్టణ వ్యవసాయానికి సబ్సిడీ విషయానికి వస్తే..వర్టికల్ గార్డెన్ నిర్మాణం రూ. 20,000 అయితే రాష్ట్ర ఉద్యాన మిషన్ ప్రారంభ కాలానికి 75 శాతం సబ్సిడీని ఇస్తుంది. ఒక యూనిట్‌లో 16 కుండలు ఉంటాయి అంతేకాకుండా ఒక నిర్మాణాన్ని కొనుగోలు చేసినప్పుడు వారికి ఎరువులు, విత్తనాలతో సహా అన్ని అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుంది. Urban Farming

Leave Your Comments

Precision Agriculture: కూరగాయల పంటలలో ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు

Previous article

క్షీణించిన డార్జిలింగ్ టీ ఉత్పత్తి…

Next article

You may also like