Niranjan Reddy Fires On Centre ఉప్పుడు విధానం ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వమేనని, రా రైస్, పార్ బాయిల్డ్ రైస్ కు తేడా తెల్వని వాళ్లు బీజేపీ ఎంపీలు కావడం మన దురదృష్టం అన్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…
రైతుల కోసం నిలబడేది టీఆర్ఎస్ మాత్రమేనని, కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) పచ్చి అవాస్తవాలు మాట్లాడారన్న అయన, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం కేంద్రానికి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్ సీఐ బాధ్యతే. తెలంగాణ నుండి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, సివిల్ సప్లైస్ శాఖ కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదని మంత్రి చెప్పారు. వాళ్ల బియ్యం వాళ్లు తీసుకుపోకుండా పంపలేదని రాష్ట్రాన్ని బద్ నాం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ అధికారులు. ఇక తెలంగాణ ఎంపీలు ఉండటం మన దురదృష్టకరం, రా రైస్, పార్ బాయిల్డ్ రైస్ కు తేడా తెల్వని వాళ్లు బీజేపీ ఎంపీలు కావడం మన దురదృష్టం అని మండిపడ్డారు నిరంజన్ రెడ్డి. Niranjan Reddy Fires On Congress
Boild Rice నిజానికి పార్ బాయిల్డ్ (ఉప్పుడు బియ్యం) విధానం పెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలో ఉన్న ఎఫ్సీఐ .. కేసీఆర్ ప్రభుత్వం ఈ విధానం ప్రవేశపెట్ట లేదని గుర్తు చేశారు. ఏడేండ్ల కాలంలో అత్యధిక శాతం కేంద్రం కొనుగోలు చేసింది పార్ బాయిల్డ్ బియ్యమే. ఇప్పుడు వంద శాతం బియ్యం సేకరించమనడం దుర్మార్గం. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఏమార్చే విధానం మంచిది కాదు. దేశంలో ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్ రైతుల పక్షాణ కొట్లాడకుండా చేతులెత్తేయడం గమనార్హం . వ్యవసాయ చట్టాల మీద రైతులే స్వయంగా పోరాటం చేశారు. తెలంగాణ రైతుల కోసం పార్లమెంటులో, బయటా పోరాడుతున్నది టీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్, బీజేపీలు ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాలు కోసం పట్టుబట్టవు. కేంద్రం విధానాలు గమనించే పంటల మార్పిడి వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. BJP MPs
CM KCR ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 10 లక్షల ఎకరాలలో కంది సాగు చేశారు రైతులు. అయితే దీనిని భవిష్యత్ లో 20 లక్షల ఎకరాలకు, పత్తి కోటి ఎకరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు నిరంజన్ రెడ్డి. ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాలు ఉండాలి .. కానీ కేంద్రం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం ఉజ్వలంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలని మా ప్రభుత్వం పనిచేస్తుంది. రైతు పంట కోసం కష్టపడినట్లే.. రైతుల బాగు కోసం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. ఇకపోతే యాసంగిలో వరి సాగు చేయవద్దని.. ఎలాంటి కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదు అని స్పష్టం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి.
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలేరు వెంకటేష్ , ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి , మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. Niranjan Reddy Fires On Centre