మత్స్య పరిశ్రమ

అరేబియా సముద్రంలో మ‌త్య్స‌కారులు గల్లంతు

0
Gir Somnath

15 fishing boats capsize in Gir Somnath చేపల వేటకు వెళ్లిన మ‌త్య్స‌కారులు అరేబియా సముద్రంలో గల్లంతయ్యారు. గుజరాత్ లోని గిర్ సోమనాథ్ తీరంలో 15 మంది పడవలతో వేటకు వెళ్లిన సమయంలో భారీ ఈదురు గాలులు, సంభవించాయి. దీంతో ఆ 15 పడవలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 11 మంది గల్లంతైనట్లు , న‌లుగురిని కాపాడామని స్థానికులు చెప్తున్నారు.

Gir Somnath

అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారత నావికాదళం హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో సముద్రంలో అలలు, గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అందువ‌ల్లే ఈ ప్రమాదం ఏర్పడింది. ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని సూచించింది. కానీ మ‌త్య్స‌కారులు వేటకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నారు. Fishermens Missing

Leave Your Comments

వెదురు పిలకల కూర అద్భుతం

Previous article

ఆరుతడి పంటలే వేయాలి: సీఎం కేసీఆర్

Next article

You may also like