Minister Indrakaran Reddy Fires On Bjp యాసంగి పంట కొనుగోలులో తెరాస బీజేపీ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. వరి సేకరణ చేపట్టమని కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేసింది. కాగా పార్లమెంట్లో వరి కొనుగోలుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెరాస ఎంపీలు లోకసభలో వరి కొనుగోలు చెయ్యాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. కాగా బీజేపీ నాయకుల మాటలు విని మోసపోవద్దంటూ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ వాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులను కోరారు. మీడియా సమావేశంలో వడ్ల కొనుగోలుపై మంత్రి రైతులకు సూచనలు ఇచ్చారు. కేంద్రం వడ్లు కొనలేమని చెప్పింది. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు.
Paddy Procurement Issue ఓ వైపున యాసంగిలో వరి ధాన్యం కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పుతుంటే… రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం వరి ధాన్యం కోనుగోలు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి. తెరాస ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తెలంగాణ వ్యవసాయ రంగానికి అనేక బృహత్తర పథకాలు ప్రవేశపెట్టిందన్నారు మంత్రి. తెలంగాణ రైతాంగానికి కేంద్రం చేసిందేమి లేదని స్పష్టం చేశారు. బీజేపీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే సాగు చట్టాలను రద్దు చేసింది. కేవలం రాజకీయ ప్రయోజనాలు పొందడానికే మోడీ ఆ నిర్ణయం తీసుకున్నారు. రైతు వ్యతిరేక సాగు చట్టాలను తీసుకొచ్చి 750 మంది అమాయక రైతుల్ని పొట్టనపెట్టుకుంది ధ్వజమెత్తారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సాగు చట్టాల రద్దుపై పార్లమెంట్ లో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేసినా… చర్చ జరపకుండానే నిమిషాల వ్యవధిలో బిల్లుకు ఆమోదం తెలిపారని బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సాగు చట్టాలను నిరసిస్తూ పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు సీయం కేసీఆర్ మానవతా దృక్పథంతో ప్రతి కుటుంబానికి రూ.మూడు లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారన్నారు. 750 మంది రైతు కుటుంబాలకు రూ.22.50 కోట్లు అందజేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. TRS vs BJP