మన దేశంలో 2019 – 20 ఆర్థిక సంవత్సరంలో కరోన మహమ్మారి ప్రభావం వేలాది మంది అస్తవ్వ్యస్థకు గురి అయ్యి మరణించడం, వేల మందికి అనారోగ్యాలతో తల్లడిల్లిపోయారు అని తెలిసిందే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని రంగాలు ఎన్నో వేల పరిశ్రమలు మూతపడి బతుకుతెరువు లేక వేలాది మంది మళ్లీ పల్లెలకు తరలిరాగా మన సేద్య రంగమే వారిని అక్కున జేర్చుకుని పని కల్పించి అన్నం పెట్టింది. కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ వల్ల రవాణా సౌకర్యాలు లేక పండ్లు, కూరగాయలు పండించే రైతులు పాల ఉత్పత్తిదారులు కొనేవారు లేక బయట మార్కెట్లకు సరకు తరలించలేక ఎక్కడికక్కడ పారబోసి తీవ్ర నష్టాలకు గురయ్యారు. అలాంటి విపత్తు సమయంలో సైతం మన వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధించింది. గతంలో 17.8 శాతంగా వున్న మన సేద్యపు రంగం దేశీయ ఉత్పత్తి ( జిడిపి ) వాటా 2019 నుండి 20 లో 19.9 శాతానికి పెరిగినట్లు 2020 – 2021 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే నిర్ధారించడం ముదావహం. మన వ్యవసాయ రంగం 2003 – 04 లో మాత్రమే అలా జి.డి.పి వృద్ధి సాధించింది. మన వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. 3 సేద్యపు బిల్లులు మార్కెట్ల విస్తరణ కనీస మద్దతు ధరలపై రైతాంగం గత నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో పట్టువీడని ప్రదర్శనలు చేస్తున్న సంగతి విదితమే. సేద్యపు రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేయ సంకల్పించిన కృషి సించాయ్ యోజన” ఫలితాలనిస్తుంది.
సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించటం ద్వారా ప్రతి నీటి బొట్టు ద్వారా అధిక సాగు కేంద్రం గత ఏడాది ఈ పథకానికి నాలుగు వేల కోట్లు కేటాయించింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి పథకాలు అమలు చేస్తోంది. ప్రస్తుతం 138 కోట్లుగా ఉన్న దేశ జనాభా 2050 నాటికి 160 కోట్లకు పెరగలన్నది అంచనా. అంతటి భారీ జనాభా ఆహార అవసరాలు తీరాలంటే ఉత్పత్తిని 60 – 100 శాతం వరకు పెంచాలి. మారుతున్న వాతావరణ పరిస్థితులను సహజ వనరులు తగ్గిపోవడాన్ని, భూమికోత, నేల సారం తగ్గడం దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా అధికోత్పత్తి సాధనకు సుస్థిర సేద్యపు పద్దతులను రూపొందించుకోవాలి.
వ్యవసాయరంగం అభివృద్ధికి కృత్రిమ మేధస్సు (AI) ను డ్రోన్ లు , ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వెబ్- GIS మరియు మెషిన్ లర్నింగ్, బయోడేటా వంటి అత్యాధునిక సాంకేతిక ప్రక్రియలను సమర్ధవంతంగా వాడుకోవడం ద్వారా పంట తెగుళ్లు ఎప్పటికప్పుడు అరికడుతూ ప్రపంచ పంటలను ఉత్పాదకతను పెంచడం ద్వారా అధికోత్పత్తి సాధించి జనాభా అవసరాలు తీర్చవచ్చు . అంతేగాక ఎలాంటి జీవానావరణ సామాజిక ఒడుదుడుకులు లేకుండా సరైన మెరుగైన ఫలితాలు సాధించాలంటే వీటికి సంబంధించిన గణాంక సమాచారాన్ని సంకలనం వుంచాలి. వర్ధమాన దేశాల సేద్యపు రంగంలో సాంకేతిక జోక్యాలు ద్వారా మంచి ఫలితలిస్తున్నాయి.మన దేశానికి సంబంధించి పర్యావరణ గణాంకాలు సరిగా అందుబాటులో ఉంటే సేద్యపు రంగంలో ఎన్నో సానుకూల మార్పులు సాధించవచ్చు. సెన్సార్లు, విశ్లేషణ పరికరాలు పంటల దిగుబడులు పెంచడానికి తోడ్పడతాయి.
Also Read : దుర్భి ప్రాంతాలలో సాగు నీటి విస్తరణ
ఆ ప్రాంతాల్లో క్షేత్రాల వాతావరణ నేలలో తేమ, ఉష్ణోగ్రత, ఎరువులు, నీరు, అగ్రో రసాయనాలు, వానల తీరును ఆధునిక పరికరాల ఆధారంగా ఎప్పటికప్పుడు అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకుంటే సత్ఫలితాలోస్తాయి. సూక్ష్మ సాగులో జియోగ్రాఫిక్ సమాచార వ్యవస్థలు మరియు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలను రిమోట్ సెన్సింగ్ ద్వారా మెరుగైన రీతిలో వాడటం ద్వారా మెరుగైన పంట దిగుబడులు సాధ్యం. మనదేశంలో టాటా కిసాన్ కేంద్రం సంస్థలు FASAL సంస్థలు ఈ సాంకేతిక ప్రక్రియలను వాడుతున్నాయి. సూక్ష్మ పరిరక్షణ అనేది సూక్ష్మ సాగులో నేల మరియు నీటి సంరక్షణ – ఆదా – సహజ జీవానవరణ వ్యవస్థలో పరిరక్షణకు పరిమితమైంది. ఆ ప్రాంతాలకు అనువైన స్థానిక సాంకేతిక ప్రక్రియలు ప్రకృతి సహజ మరియు వ్యవసాయ వ్యవస్థలకు అనువైన యాజమాన్య పద్ధతులు రూపకల్పనకు నీటి వనరుల సమర్థవాడకానికి రిమోట్ సెన్సింగ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, భౌగోళిక సమాచార (GIS) వ్యవస్థలు ఉపకరిస్తాయి. గంగా మైదాన ప్రాంతంలో భారత మొక్కజొన్న పరిశోధనా సంస్థ సూక్ష్మ సాగు పద్ధతులను అభివృద్ధి చేసి 2018 నుండి అమలు చేయగా రెండేళ్ల తర్వాత మంచి ఫలితాలు సాధించారు. వరి గోధుమ పంట వ్యవస్థల కంటే మొక్కజొన్న గోధుమలు సూక్ష్మ సాగు ద్వారా 82 శాతం నీటిని ఆదా చేయగలిగారు. భూసార పరీక్షల ఆధారంగా అవసరమైన సూక్ష్మ పోషకాలు అందించటం ద్వారా ఆహార పంటల ఉత్పాదకతను పెంచగలుగుతున్నాం. అయితే ఈ పోషకాల వాడకంలో ఎన్ని అవరోధాలు ఎదురైనందున పంట పెరుగుదల పై దృష్టి సారించారు శాస్త్రజ్ఞులు. నత్రజని వాడకం వల్ల నైట్రస్ ఆక్సైడ్, అమ్మోనియా కార్బన్ ఉద్గారాలు పర్యావరణంపై ప్రభావం కల్పిస్తున్నాయి. అయితే పంజాబ్ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రీన్ సీకర్ ఆప్టికల్ సెన్సార్ వాడకం ద్వారా అవసరమైన మోతాదులో ఎరువులు వాడకం ద్వారా అధిక దిగుబడులు సాధించారు. కృత్రిమ మేదస్సు , అనలిటిక్స్ తో పాటు పర్యావరణ గణాంకాలను పరిజ్ఞానాన్ని వాడటం ద్వారా నేలల డేటా యాజమాన్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. రియల్ టైం డాష్ బోర్డు ద్వారా పంటలు వాటికి నీటి అవసరాలను , ఎరువులను సమర్ధవంతంగా అవసరమైన మోతాదులో వాడటం, మార్కెట్లు ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా పర్యావరణ గణాంక సమాచారం సేద్యపు రంగం లో డిజిటల్ ఆధారిత రూపంలో ఎన్నో మార్పులకు దోహదం చేస్తుంది.
యాసంగి పంటలకు రూ. 2865 కోట్లు ఎరువుల సబ్సిడీ
కాగా యాసంగి పంటలకు అదనంగా 28 వేల 655 కోట్ల మేర సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు పరిశ్రమకు మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమోనియా,ఫాస్పారిక్ ఆమ్లం ధరల పెరుగుదల వల్ల అంతర్జాతీయంగా ఫాస్ఫేట్ ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. ఎన్ .పి.కె ఎరువుల విక్రయం ద్వారా మంచి లాభాలు వస్తాయని వల్ల లాభాలు వస్తాయని, డి. ఏ .పి ఎరువుల విక్రయం వల్ల అదనపు సబ్సిడీల వల్ల కొద్ది లాభాలు వస్తాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read : పురుగు మందుల కొనుగోలు, నిల్వ మరియు విష తీవ్రత