ఆరోగ్యం / జీవన విధానం

విటమిన్ C తో ఆరోగ్యం మీ వెంట !

0
C Vitamin Fruits

Health Benefits of Vitamin C మానవ శరీరంలో వ్యాధినిరోధక శక్తి ఎంతో అవసరం. రోగనిరోధక వ్యవస్థ మన శరీరంలో వచ్చే వ్యాధులను తట్టుకునే శక్తినిస్తుంది. ఒకవేళ వ్యాధులు వచ్చినా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. కరోనా పుణ్యమా అని అందరూ రోగనిరోధక శక్తిపై ద్రుష్టి పెట్టారు. రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాన్ని సమపాళ్లలో తీసుకుంటున్నారు. సాధారణంగా చూస్తే పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువ రోగనిరోధక శక్తి ఉంటుంది. అయితే మనచుట్టూ బోలెడన్ని హానికారక సూక్ష్మక్రీములు ఉంటాయి. మనశరీరం ఎప్పుడైనా వాటి భారీన పడే అవకాశం ఉంది. దీంతో అనేక రకాల జబ్బులు దాడి చేస్తాయి. అయితే మనలో నిరోధక వ్యవస్థ మెరుగుపడాలంటే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా రోగనిరోధకశక్తిని పెంచే సి విటమిన్ తీసుకోవాలి. Vitamin C Benefits

సిట్ర‌స్ జాతి పండ్ల‌లో అనేక ఇమ్యూనిటీ పోషకాలు ఉంటాయి.ఈ పండు మన శరీరంలో నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. నిత్యం వీటిని స‌రైన మోతాదులో తీసుకోవ‌డం ద్వారా ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉండే విటమిన్ మనలో ఉండే నొప్పుల‌ను న‌యం చేస్తుంది. అలాగే, ఎముల‌క‌ను కూడా బ‌లంగా త‌యారుచేసుకోవ‌చ్చు.

Amla

ఇక డాక్టర్లు ఎక్కువగా సూచించేది ఉసిరి ( Amla ). ఉసిరిలో అనేక ప్రయోజాలున్నాయి. వందల సంవత్సరాల క్రితం నుంచి ఉసిరిని ఆరోగ్య వ్యాధుల చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. ఇందులో సి విటమిన్ అధికంగా ఉండటంతో నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, చర్మానికి మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఉసిరి జుట్టుకు మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా, ఉన్న జుట్టుని మరింత బలంగా తయయరయ్యేలా చేస్తుంది.

Orange

అందరికి అందుబాటు ధరలో ఉండే పండు నారింజ (Orange) . ఈ పండు ఎన్నో విధాలుగా శరీరానికి దోహదపడుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. జలుబు, ఇతర అలెర్జీలతో బాధపడుతున్న వారికి నారింజ ఎంతో మంచిది. ఈ పండు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి.. ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది.

Bell Pepper

బెల్ పెప్ప‌ర్ ఎంతో ఉప‌యోగ‌క‌రం అంటున్నారు డాక్టర్లు. బాడీలో వ్యాధిరిరోధక శక్తి పెంచడంలో పండ్లు మాత్రమే తినాలి అనుకుంటారు. కానీ కూరగాయలు కూడా రోగనిరోధక వ్యవస్థ పెంచే విధంగా దోహదపడతాయి. బెల్ పెప్ప‌ర్ ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీన్ని క్యాప్సికం అని కూడా అంటారు. బెల్ పెప్పర్‌లో సిట్రిక్ పండ్లతో స‌మానంగా విటమిన్ సీ ఉంటుంది. ఈ కూరగాయల్లో బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. బెల్ పెప్పర్‌లో ఉండే ఖనిజాలు, విటమిన్లు శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థను నిర్మించడానికి.. చర్మ నాణ్యతను మెరుగుపరచడానికి, కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని తరచుగా బలహీనపరిచే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇవి సహాయపడుతాయి.

Lemon

నిమ్మపండు ( Lemon )లో సి విటమిన్ అధిక మోతాదులో ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. నిమ్మపండు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరానికి కణాలను దెబ్బతీసే, దీర్ఘకాలిక ఇన్‌ఫెక్ష‌న్‌ కలిగించే ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి సహాయపడతాయి. వీటిలో గణనీయమైన మొత్తంలో థయామిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ బీ -6, పాంతోతేనిక్ ఆమ్లం, రాగి, మాంగనీస్ ఉన్నాయి.అయితే నిమ్మని మనం తినడం కుంచెం కష్టమే

pineapple

జీర్ణక్రియ, మంట సమస్యలకు చికిత్స చేయడానికి పైనాపిల్ శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ పండ్లలో విటమిన్ సీ, మాంగనీస్ అధికంగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండి.. ఫైబర్, బ్రోమెలైన్ అధికంగా ఉంటుంది. రోజూ పైనాపిల్ తిన‌డం వల‌న‌ వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ ప్రమాదం తగ్గుతుంది.

Leave Your Comments

 ప్రపంచ నూనెగింజల విస్తీర్ణం 20 % భారత్ లోనే

Previous article

కందిలో తెగుళ్ళు – యాజమాన్యం

Next article

You may also like