సేంద్రియ వ్యవసాయం

టెర్రెస్ గార్డెనింగ్ పై ఆసక్తి ఉందా..సంప్రదించగలరు!

0
Organic Terrace Gardening Training
Organic Terrace Gardening Training

Organic Terrace Gardening Training In Online  రసాయనిక అవశేషాలు లేని ఆహారంపై ద్రుష్టి పెడుతున్నారు కొందరు ప్రకృతి ప్రేమికులు. ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలన్న ఆలోచనతో నగరాల్లో పట్టణ ప్రకృతి సేద్యకారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో కొందరు సొంతంగా సేద్యం చెయ్యడం ప్రారంభించారు. ఒకప్పుడు పల్లెల్లో కనబడే ఈ సంస్కృతి ఇప్పుడు పట్టణాల్లో విస్తరిస్తుంది. ఇంటి బాల్కనీల్లో, మిద్దెల మీద ఇంటి అవసరాలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో పట్టణాల్లోని అనేక రూఫ్ లు పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నాయి. టెర్రస్ ఫార్మింగ్ పేరుతో ఇంటిమీదే అన్ని పంటల సాగు చేసేస్తున్నారు.

Organic Terrace Gardening

Organic Terrace Gardening

అయితే కొందరికి సేంద్రియ సాగుపై ఆసక్తి ఉన్నప్పటికీ దాన్ని ఎలా ఆచరణలోకి తీసుకురావాలో తెలియదు. వారికోసం మిద్దెల మీద పండ్లు మరియు కూరగాయల సాగు విధానం (టెర్రెస్ గార్డెనింగ్) పై శిక్షణ కార్యక్రమమాలు నిర్వహిస్తున్నారు సంబంధిక అధికారులు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, విస్తరణ విద్యాసంస్థ , రాజేంద్రనగర్ వారు మిద్దెల మీద పండ్లు మరియు కూరగాయల సాగు విధానంపై కొత్తగా నేర్చుకోదలచిన వారికి సర్టిఫికేట్ తో కూడిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆన్లైన్ పద్దతిలో డిసెంబర్ 16, 17, 18లలో నిర్వహిస్తున్నారు. ఔత్సాహికులైన గృహిణులకు, ఉద్యోగులకు, యువతకు ఇది ఒక చక్కని అవకాశం. ఇంటి నుండే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా శిక్షణ పొందవచ్చు. కోర్సు ఫీజు: రూ. 1,500/- మాత్రమే. అయితే ఈ అవకాశం మొదటిగా ఫీజు కట్టిన 100 మందికి మాత్రమే. ఫీజు కట్టి, రిజిస్ట్రేషన్ ఫారం పంపడానికి ఆఖరి తేది 30, నవంబర్ 2021. మరిన్ని వివరాల కోసం www.eeihyd.org (లేదా) www.pjtsau.edu.in వెబ్ సైట్లను సందర్శించగలరు. కోర్సు ఫీజు కట్టిన తరువాత వాపసు చేయబడదు. ఈ శిక్షణ డా. యం. జగన్ మోహన్ రెడ్డి, డైరెక్టర్, డా. ఆర్. వసంత, ప్రొఫెసర్ మరియు డా. పి. విజయలక్ష్మి, ప్రొఫెసర్, ఇ.ఇ.ఐ. ఆధ్వర్యంలో జరుగుతుంది. Organic Terrace Gardening

Organic Terrace Gardening

Organic Terrace Gardening Training In Online

జంట నగరాల నుంచి మిద్దె తోటల నిర్వాహకులు, ఔత్సాహిక నగర సేద్యం ప్రేమికులు ఈ శిక్షణ తరగతులకు హాజరై… విత్తనాల సేకరణ, ఎలా విత్తుకోవాలి, చీడపీడలు, తెగుళ్ళు వస్తే తీసుకోవాల్సిన చర్యలు, నీటి నిర్వహణ, కోత వంటి అంశాలపై విజ్ఞానం పొందుతున్నారు. ఇంట్లో ఉన్న వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, ఆకుకూరల వంటి వాటితో వర్మీకంపోస్ట్, జీవామృతం, ఘనామృతం తయారీల గురించి ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. డాబాలు, బహుళ అంతస్తుల భవనాలు, బాల్కనీల్లో కొద్దిపాటి స్థలాల్లో పంటలను ఎలా పెంచాలనే విషయంపై అధికారులు సలహాలిస్తున్నారు.

Leave Your Comments

కంది పూత దశలో తీసుకోవాల్సిన సస్యరక్షణ

Previous article

భగ్గుమన్న టమోటా ధరలు..!

Next article

You may also like