ఆరోగ్యం / జీవన విధానం

వరల్డ్‌ వేగన్ డే… వేగన్ డైట్ అంటే ?

0
world vegans day
world vegans day

మారుతున్న కాలానికి అనుగుణంగా మాంసం, పాల పదార్థాలు, జంతు ఉత్పత్తుల విక్రయాన్ని తగ్గించుకుంటూ వేగన్స్’గా మారుతున్నారు చాలామంది. వేగన్ అనేది ఒక రకమైన డైట్. ఇది నవంబర్ 1, 1940 లో ఇంగ్లాండ్ లో మొదలైంది. జంతువుల హక్కులను మనుషులు కాలరాస్తున్నారంటూ కొందరు ఒక గ్రూప్ గా తయారై వేగన్ అనే స్లోగన్ అందుకున్నారు. వేగన్స్ అంటే శాకాహారులు కాదు. శాకాహారులు జంతువుల నుంచి వచ్చే పాలు గ్రుడ్లు ఆహారంలో తీసుకుంటారు. కానీ వేగన్స్ పాలు గ్రుడ్లని కూడా తీసుకోరు. వేగన్‌ డైట్‌ అంటే సింపుల్‌గా చెప్పాలంటే పూర్తిగా శాఖాహార పదార్థాలనే తీసుకోవడం. జంతు సంబంధిత ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, కేవలం వృక్ష సంబంధిత ఆహారాలను తీసుకోవడం ఈ డైట్‌ ముఖ్య ఉద్దేశం. నిజానికి వేగన్ డైట్ వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయ్ అంటున్నారు వేగన్స్. వేగన్‌ డైట్‌వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెల్లడైంది. భవిష్యత్తులో డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉండవు.శరీరంలో కొలెస్ట్రాల్‌ , హైబీపీ రాకుండా చేయడంలో వేగన్ డైట్ కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే శరీరానికి పోషకాలు ఎలా వస్తాయి అని సందేహం రావొచ్చు. పోషకాల కోసం అనేక మార్గాలున్నాయి. అందులో శాకాహార పాలు. ఈ పాలను ప్రాథమికంగా మొక్కల నుంచి సేకరిస్తారు.సోయా మొక్కల నుంచి సేకరించిన అత్యుత్తమ పాల ఉత్పత్తులు సోయా పాలు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఈ పాలలో ప్రోటీన్, పొటాషియం, ఐసోఫ్లేవోన్‌లు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్​లో లభించే మరో శాకాహార పాలు బాదం పాలు. ఇవి సోయా పాలతో పోలిస్తే చాల మృదువుగా, సున్నితంగా ఉంటాయి. వీటిలో విటమిన్స్ డి, ఈ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.. కొబ్బరి నుంచి తీసే పాలను కొబ్బరి పాలు అంటారు. ఈ పాలను వంట, బేకింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. జీడి పాలు… అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తమ కొవ్వు తగ్గించుకోవడానికి ఈ పాలు బాగా పనిచేస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనూ చాలామంది సెలబ్రిటీస్‌ ఇప్పుడు వేగన్స్‌గా మారిపోయారు. బాలీవుడ్‌ స్టార్స్‌ ఆమిర్‌ఖాన్, జెనీలియా, రితేష్‌ దేశ్‌ముఖ్, సోనమ్‌ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్, కంగనా రనౌత్, వంటి మాంసాహారం ముట్టబోమని ఒట్టు పెట్టుకున్నారు. వేగన్స్‌గా మారడం వల్ల జంతువులను రక్షించినవాళ్లమే కాక… పర్యావరణాన్ని పరిరక్షించినవాళ్ల మవుతామంటున్నారు. వేగన్‌గా మారడం వల్ల 15 రకాల ప్రాణహాని కారక వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. నో మీట్‌ పాలసీలో భాగంగా 2012 నుంచి లాస్‌ ఏంజిల్స్‌లో ప్రతి సోమవారం మాంసాహారం విక్రయించరు. 2020లో కేఎఫ్‌సీ మొట్టమొదటి వేగన్‌ బర్గర్‌ను తయారు చేసింది.1994 నుంచి ప్రతి ఏటా నవంబర్‌ 1న వరల్డ్‌ వేగన్‌ డే నిర్వహిస్తున్నారు. నవంబర్‌ నెలను వేగన్‌ మంత్‌గా సెలబ్రేట్‌ చేస్తున్నారు.

#VeganDiet #worldveganday #vegandietbenefits #nonveg #eruvaaka

Leave Your Comments

నల్ల బియ్యం ఆరోగ్యానికి అమృతం

Previous article

అగ్రికల్చర్ కోర్సులో మార్పులు అవసరం…

Next article

You may also like