తెలంగాణ సేద్యంవార్తలు

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మార్కెటింగ్ మరియు ఉద్యాన శాఖ అధికారులు

0

  • పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతున్నది.
  • కావాల్సినన్ని విత్తనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి
  • పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు
  • వేరుశనగ, పప్పుశనగ విత్తనాలు క్షేత్రస్థాయిలో తగినన్ని అందుబాటులో ఉన్నాయి
  • గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగుకు రైతుల ఆసక్తి
  • రైతువేదికలలో పంటల మార్పిడి మీదనే కాకుండా సమగ్ర వ్యవసాయ విధానం మీద చర్చలు, శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి
  • అధికారులు, శిక్షకులకు అవసరమైన వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ సమాచారం రైతు వేదికలలో అందుబాటులో ఉంచడం జరిగింది
  • రైతువేదికల ద్వారా క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు పంటల మార్పిడి కోసం 8098 శిక్షణా తరగతులతో పాటు మొత్తం వివిధ అంశాల మీద 22,123 శిక్షణా తరగతులు నిర్వహించడం అభినందనీయం
  • వ్యవసాయ అనుబంధ విషయాలు రైతులకు చేరవేయడంలో నూతన సాంకేతికతతో పాటు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి.
  • పంటల మార్పిడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయిల్ పామ్ నర్సరీలలో మొక్కల పెంపకం మీద సమీక్ష
  • వచ్చే వానాకాలం నాటికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం క్షేత్రస్థాయిలో రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు అందించడానికి ఏర్పాట్లు
  • యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయి
  • వివిధ మార్కెట్లలో పత్తి ధరలపై సమీక్ష .. మద్దతుధర రూ.6025 వేలు ఉండగా రూ.7 వేలకు పైగా ధర పలకడంపై హర్షం
  • ఈ ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది రైతులు పెద్దఎత్తున పత్తిని సాగుచేయాలి.

హైదరాబాద్ లోని మంత్రుల సముదాయంలోని తన నివాసంలో వ్యవసాయ  మార్కెటింగ్, ఉద్యాన శాఖల సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy)గారు, వ్యవసాయ శాఖా కార్యదర్శి రఘునందన్ రావు(Raghunandhan Rao)గారు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి(Lakshmi Bhai)గారు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి( Venktram Reddy)గారు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు(Kesavulu) గారు, మార్కెటింగ్ అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు(Lakshamanudu)గారు, వ్యవసాయ అదనపు సంచాలకులు విజయ్ కుమార్ (Vijaya Kumar)గారు తదితరులు

Leave Your Comments

PJTSAUలో వ్యవసాయ , ఉధ్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు NCC & స్పోర్ట్స్ కోటాలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

Previous article

యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి గారు

Next article

You may also like