ఉద్యానశోభ

నేలకు సారాన్నిచ్చే జీలుగ..

0

నిస్సారవంతమైన భూములకు సత్తువ కల్పించే సత్తా పచ్చిరొట్ట ఎరువులకు ఉందని ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. అందులో నేల స్వభావం ఆధారంగా జీలుగ సాగు చక్కటి ఫలితాలనిస్తోంది. తొలకరి వర్షాలు కురవగానే దుక్కి చేయించి ముందుగా 20 నుంచి 30 కిలోల యూరియాతో పాటు ఎకరానికి 10 నుంచి 12 కిలోల జీలుగ విత్తనాలు విత్తాలి. ఇది అన్ని నేలలకు అనుకూలమైంది. 25 నుంచి 30 రోజుల్లో ఏపుగా పెరిగి పూతకు వస్తుంది. ఆ సమయంలో రోటోవేటర్ లేదా కేజ్ వేల్స్ సాయంతో కలియదున్నాలి. అనంతరం ఎకరానికి 100 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫెట్ వేయాలి. దీంతో మొక్కల అవశేషాలు బాగా కుళ్ళి పచ్చిరొట్ట ఎరువులు తయారవుతాయి. కుళ్ళేదశలో సక్రమంగా నీటి తడులివ్వాలి. జీలుగను నీటిలో కలియదున్నిన తర్వాత కనీసం పది రోజుల వరకు ఇతర పంటలు సాగు చేయకూడదు. ఈ సమయంలో విడుదలయ్యే మిథేన్ వాయువు పంటలకు హాని కలుగజేస్తోంది.
లాభాలు:
ఎకరానికి మూడు టన్నుల పచ్చిరొట్ట ఎరువు లభిస్తుంది.
వేర్లలో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉండి రెండు శాతం నత్రజని, సూపర్ ఫాస్ఫెట్ అదనంగా అందిస్తుంది.
జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మ ధాతువులు పంటకు అందుతాయి.
నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మార్చుతుంది.
నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతోంది.
నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.
తుంగ, గరిక వంటి కలుపు మొక్కలను అడ్డుకొని పంటకు మేలు కలిగిస్తుంది.

Leave Your Comments

మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

Previous article

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Next article

You may also like