ఆరోగ్యం / జీవన విధానం

మెంతులతో కలిగే ప్రయోజనాలు..

0

ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపుల్లోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలున్నాయని చాలా మందికి తెలుసు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలో ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. ఒక టీ స్పూన్ మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి. పొద్దున్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి ఈ నానబెట్టిన మెంతులు కూడా వేసి పరగడుపున తాగేయండి. ఈ డ్రింక్ వెయిట్ లాస్ కి హెల్ప్ చేయడమే కాక డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల డ్రై స్కిన్, స్కిన్ డ్యామేజ్ నుండి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. లాక్సటివ్ లా పని చేసి కాన్స్టిపేషన్ ని తగ్గిస్తుంది. చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ ని బాడీలో నుండి బయటకు పంపిస్తుంది. ఇందువల్ల కిడ్నీ స్టోన్స్ డెవలప్ అయ్యే రిస్క్ రెడ్యూస్ అవుతుంది. మెంతులకి యాంటీ బాక్టీరియల్, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ని రెడ్యూస్ చేస్తాయి. నాచురల్ గా వెయిట్ లాస్ అవ్వడంలో ఈ డీటాక్స్ డ్రింక్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇవి మెటబాలిజంని బూస్ట్ చేస్తాయి. యాపిల్ సిడార్ వెనిగర్, లెమన్ వాటర్ డీటాక్స్ వంటివి ఇందుకు బాగా పనిచేస్తాయి. డీటాక్స్ డ్రింక్స్ డైజెస్టివ్ సిస్టం కి అవసరమైన హెల్దీ న్యూట్రియంట్స్ ని అందిస్తాయి. లివర్ యొక్క పని తీరుని మెరుగు పరుస్తాయి. మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లో చాలా వరకూ ఆల్కహాల్, నికోటిన్, కెఫీన్, కార్బోనేటెడ్ బేవరేజెస్, ఫ్యాటీ ఫుడ్స్ లివర్ ఫంక్షనింగ్ న ని దెబ్బ తీసేవే. రెగ్యులర్ గా డీటాక్స్ డ్రింక్స్ కన్స్యూమ్ చేయడం వల్ల లివర్ పనితీరు కూడా మెరుగు పడుతుంది. మీరు తాగే నీటిలో తాజా కీరా ముక్కలు వేసుకుని ఆ నీటిని రోజంతా సిప్ చేయడం బాడీ లో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతుల నీటిని రెగ్యులర్ గా తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.

Leave Your Comments

ప్రపంచంలోని అతిపెద్ద మామిడి పండు..

Previous article

పీపర్ పంట సాగు..లక్షల్లో ఆదాయం

Next article

You may also like