వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తికి గణనీయమైన సవాళ్లుగా మారాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో, వేసవి ఉష్ణోగ్రతలు తరచుగా 35°C-40°C వరకు నమోదు అయ్యే అవకాశాలు ఉంటాయి, ఇలాంటి పరిస్థుతులలో కూరగాయల పంటలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటాయి, ఇది దిగుబడి, నాణ్యత మరియు ఆర్థిక రాబడిని ప్రభావితం చేస్తుంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం
- తగ్గిన దిగుబడి మరియు పెరుగుదల: అధిక ఉష్ణోగ్రతలు కూరగాయల మొక్కలలో బాష్పీభవనం మరియు శ్వాసక్రియ రేటును వేగవంతం చేస్తాయి, దీని వల్ల నీటినష్టం పెరుగుతుంది మరియు కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది. ఇది మొత్తం మొక్క పెరుగుదలను ప్రభావితం చేస్తుంది, ఫలితంగా తక్కువ దిగుబడి వస్తుంది. ఉదాహరణకు:
- టమోటా: అధిక వేడి (35°C పైన) పువ్వు రాలడానికి కారణమవుతుంది, దీని వల్ల ఫలాల ఉత్పత్తి తగ్గుతుంది.
- మిరప: అధిక ఉష్ణోగ్రతలు పుప్పొడి యొక్క సజీవత్వాన్ని తగ్గిస్తాయి, తద్వార ఫలాల ఏర్పడటాన్ని ప్రభావితం చేస్తాయి.
- క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్: అధిక వేడితలల ఏర్పడటానికి ఆటంకం కలిగిస్తుంది, చిన్న లేదా వదులుగా ఉండే తలలకు దారి తీస్తుంది.
- తక్కువ పరాగసంపర్కం మరియు ఫలాల ఉత్పత్తి: కూరగాయలు సరైన పరాగసంపర్కం కోసం సరైన ఉష్ణోగ్రత చాల అవసరం. అధిక ఉష్ణోగ్రతలు
- పుప్పొడి యొక్క సజీవత్వాన్ని తగ్గిస్తాయి, అసంపూర్ణ ఫలదీకరణకు దారి తీస్తాయి.
- వంకాయ, మిరప మరియు కాప్సికం వంటి పంటలలో పువ్వు మరియు మొగ్గ రాలడానికి కారణమవుతాయి.
- తేనెటీగల కార్యకలాపాలను ప్రభావితం చేసి, దోసకాయ మరియు గుమ్మడికాయ వంటి పంటలలో పరాగసంపర్క సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
- తెగుళ్లు మరియు వ్యాధుల వ్యాప్తి పెరుగుదల: వెచ్చని ఉష్ణోగ్రతలు తెగుళ్లు మరియు వ్యాధులకు అనుకూలమైన పరిస్తుతులుగా ఉంటాయి.
- తెల్ల దోమలు మరియు పేనుబంక: అధిక ఉష్ణోగ్రతలలో వృద్ధి చెందుతాయి, టమోటా ఎల్లో లీఫ్ కర్ల్ వైరస్ (TYLCV) వంటి వైరల వ్యాధులు వ్యాప్తి చేస్తాయి.
- త్రిప్స్: పొడి, వేడి పరిస్థితులలో మరింత చురుకుగా ఉంటాయి, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి పంటలను దెబ్బ తీస్తాయి.
- శిలీంధ్ర వ్యాధులు: కొన్ని, బూడిద తెగులు వంటివి, వేడి, పొడి పరిస్థితులలో వేగంగా వ్యాప్తి చెందుతాయి, మరి కొన్ని, బూజుతెగులు వంటివి, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల ద్వారా సృష్టించ బడిన తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి.
- నీటి ఒత్తిడి మరియు నేల క్షీణత:
- పెరిగిన బాష్పీభవనం నేలలోని తేమను తగ్గిస్తుంది, దీని వలన వడలిపోవడం మరియు పెరుగుదల కుంటు పడుతుంది.
- వేగంగా నీరు కోల్పోవడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నేలలో లవణీయతను పెంచుతాయి.
- నత్రజని మరియు పొటాషియం వంటి కీలక మూల కాలలో లోపాలకు దారితీసే పోషకాల కారడం ఎక్కువగా ఉంటుంది.
- తక్కువ కోత అనంతర నాణ్యత మరియు నిల్వ జీవితం: వేడి ఒత్తిడి పండటం వేగవంతం చేస్తుంది, దీనికి దారి తీస్తుంది.
- శ్వాస క్రియ రేట్లు పెరగడం వల్ల కూరగాయల నిల్వ సమర్థం తగ్గుతుంది.
- పాలకూర మరియు కొత్తిమీర వంటి ఆకుకూరలలో ఆకృతి క్షీణత.
- టమోటా మరియు పుచ్చకాయ వంటి పండ్లలో సన్బర్న్ మరియు పగుళ్లు రావడం జరుగుతుంది.
నివారణ చర్యలు
- వేడిని తట్టుకునే రకాలను ఎంచుకోవడం: రైతులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే వాతావరణ-స్థితిస్థాపక రకాలను సాగు చెయ్యడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. తక్కువ పంట కాలం కలిగిన సంకర మరియు మెరుగైన రకాలు వేసవి ఒత్తిడి నినివారించడానికి సహాయ పడతాయి.
- నేల తేమను నిల్వచేయడానికి మల్చింగ్: మల్చింగ్ చెయడం వల్ల
- బాష్పీ భవన నష్టాన్ని 25-50% తగ్గించవచ్చు.
- నేల ఉష్ణోగ్రతలను తగ్గించి నేలను చల్లగా ఉంచుతుంది.
- తేమ మరియు పోషకాల కోసం పోటీ పడే కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రిస్తుంది.
సాధారణ మల్చింగ్ పదార్దాలు:
- సేంద్రియ: గడ్డి, ఎండిన ఆకులు, చెరకు పిప్పి.
- ప్లాస్టిక్: టమోటా మరియు కాప్సికం వంటి కూరగాయలకు నలుపు లేదా వెండిరంగు మల్చింగ్ షీట్ వాడుట వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి
- మెరుగైన నీటి పారుదల నిర్వహణ:
- బిందు సేద్యం: బాష్పీభవనాన్నితగ్గించి, నీటిని నేరుగా వేరు వ్యవస్థకి సరఫరా చేస్తుంది.
- నీటి పారుదల సమయం: ఉదయం లేదా సాయంత్రం నీరు పెట్టడం ఒత్తిడి తగ్గుతుంది మరియు నీటి నష్టం తగ్గుతుంది.
- హైడ్రో జెల్మరియు సూపర్ అబ్జార్బెంట్స్ ఉపయోగం: ఇవి నేల నీటి నిలుపుదల సామర్థ్యాన్ని మెరుగు పరుస్తాయి.
- వర్షపు నీటిని సేకరించడం: నీరు లేని సమయంలో నీటి పారుదల కోసం నిల్వ చేసిన నీటిని వాడుకోవచ్చు.
షేడ్ నెట్స్
- 50% షేడ్ నెట్స్ పంటలను అధిక సూర్యరశ్మి నుండి రక్షిస్తాయి.
- తక్కువ ధరపాలి హౌస్లు ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి, దిగుబడి మరియు నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
- పోషక మరియు నేల నిర్వహణ:
- సమతుల్య ఎరువులు: సమతుల్య ఎరువులు అందించడం వల్ల బలమైన వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్క సమర్దవంతంగా ఏధుగుతుంది.
- పొటాషియం ఉపయోగం బెట్ట పరిస్థితుల తట్టుకునే శక్తిని పెంచుతుంది.
- సూక్ష్మపోషకాల (Zn, Fe మరియు B) ఫోలియర్స్ప్రే ఒత్తిడిని తట్టుకునే శక్తిని మెరుగుపరుస్తుంది.
- బయో చార్ మరియు సేంద్రియ పదార్థం: నేల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
- కవర్ పంటలు: నేల కోతను నివారిస్తాయి మరియు ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను తగ్గిస్తాయి.
- తెగుళ్లు మరియు వ్యాధుల నిర్వహణ:
- తెల్లదోమలు మరియు పేనుబంక కోసం పసుపు జిగురు అట్టలు వాడుకోవాలి.
- వేడి అనుకూల తెగుళ్ళను నిర్మూలించడానికి వేపనూనె మరియు జీవసం బంద పురుగు మందులు వాడుకోవాలి.
- పంట మార్పిడి చెయ్యడం వల్ల నేల ద్వారా సంక్రమించే వ్యాధి కారకాలు వృద్ధి చెందకుండా నిరోదించవచ్చు.
- వ్యాధి నిరోధక రకాలను యెంచు కోవడం వల్ల వైరల్ మరియు శిలీంధ్ర సంక్రమణల నుండి నష్టాలను తగ్గించవచ్చు.
- పంట వేసే తేదిలను సర్దుబాటు చేయడం:
- వేసవి ఉష్ణోగ్రతలను నివారించడానికి పంట వేసే తేదిలను ముందుగా లేదా ఆలస్యంగా సర్దుబాటు చేయడం మంచి ఫలితాలనూ ఇస్తుంది.
- కోత అనంతర నిర్వహణ వ్యూహాలు:
- ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట కోయడం వల్ల కూరగాయల నాణ్యత వేగంగా తగ్గకుండా ఉంటుంది.
- బాష్పీభవన శీతలీకరణ మరియు ప్రీ-కూలింగ్ వంటి శీతలీకరణ పద్ధతుల ద్వార నిల్వ సమర్ద్యాన్ని పెంచవచ్చు.
- గాలి ప్రసరణ మరియు నీడ ఉన్న ప్రదేశాలలో సరైన నిల్వ కూరగాయలు త్వరగ చెడిపోవడాన్ని తగ్గిస్థాయి.
ముగింపు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూరగాయల ఉత్పత్తికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి, దిగుబడి, నాణ్యత మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ, వేడిని తట్టుకునే రకాలు, సమర్థవంతమైన నీటి పారుదల, నేల నిర్వహణ మరియు రక్షిత నిర్మాణాలు వంటి నివారణ చర్యలను అవలంబించడం ద్వారా, రైతులు అధిక ఉష్ణోగ్రతల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవాచ్చు.