Telangana Rythu Nestham video conference: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కొరకు రైతు వేదికల నందు వీడియో కాన్ఫరెన్స్ విధానం ఏర్పాటు చేసి రైతు నేస్తం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అభివృద్ధి కోసం వివిధ అంశాలపై సంబంధిత శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కార్యక్రమం చేపడుతుంది అందులో భాగంగా ఈరోజు కన్నలా, భీమిని రైతు వేదికల నందు బెల్లంపల్లి, బీమిని వ్యవసాయ డివిజన్ పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన రైతులు డీలర్లు మరియు వ్యవసాయ విస్తరణ మరియు మండల వ్యవసాయ అధికారులు లతో సమావేశం నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ సుచరిత పండ్ల పరిశోధన స్థానం సంగారెడ్డి గారు మాట్లాడుతూ వేసవికాలంలో మామిడిలో పిందెరాలడం అందుగల కారణాలు వీటి నివారణ చర్యలు గూర్చి అదేవిధంగా మామిడి సాగులో వివిధ రకాల చీడపీడల గూర్చి రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా మామిడి సాగులో రాష్ట్రవ్యాప్తంగా రైతులు అడిగిన సందేహాలకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది డాక్టర్ శ్రీనివాస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జగిత్యాల గారు మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వివిధ పంటల్లో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గూర్చి అదేవిధంగా వరి సాగులో వచ్చే రెండు నెలలపాటు తీసుకోవలసిన నీటి యాజమాన్య పద్ధతుల గూర్చి రైతులకు వివరించడం జరిగింది అదేవిధంగా వివిధ ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వివిధ పంటల్లో జరిగే ఎటువంటి నష్ట ప్రభావాలను తగ్గించే విధంగా పలు సూచనలను చేస్తూ రైతుల సందేహాలను తీర్చడం జరిగింది సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ఆవశ్యకత గూర్చి డాక్టర్ ప్రగతి కుమారి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో సేంద్రీయ సాగు ఆవశ్యకత అదేవిధంగా సేంద్రియ సాగు పద్ధతిలో చేపట్టవలసిన వివిధ యాజమాన్య పద్ధతుల గూర్చి రైతులకు వివరించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు పాల్గొని శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కోసమే ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం అని ఈ పద్ధతిని అందరు రైతులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం రైతు వేదికలందు నిర్వహించబడునని రైతులకు సూచించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయ శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీడియోకాన్ఫరెన్స్ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ పద్ధతి విధానంలో రైతులు నేరుగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రధాన శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఇట్లాంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని రైతులకు సూచించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గోపి ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మాట్లాడుతూ రాబోవు సీజన్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించిన వివిధ సమస్యలను వివిధ పంటల సాగులో మెలుకులకు సంబంధించిన వివిధ అంశాల గూర్చి ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు చర్చించబడుతుందని కావున రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని,రైతాంగానికి ఉపయోగపడే విధంగా వివిధ విభాగాలకు చెందిన శాస్త్రవేత్తల ద్వారా ప్రముఖుల ద్వారా రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తామని కావున రైతులు ఎక్కువ సంఖ్యల్లో ఆయా క్లస్టర్ పరిధిలో గల వీడియో కాన్ఫరెన్స్ కలిగిన రైతు వేదికల నందు అధిక సంఖ్యలో పాల్గొనాలని రైతులను కోరారు.
Telangana Rythu Nestham video conference: తెలంగాణ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం.
Leave Your Comments