అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణమన వ్యవసాయంయంత్రపరికరాలురైతులువార్తలువ్యవసాయ వాణిజ్యం

Artificial Intelligence in Agriculture: వ్యవసాయరంగంలో కృతిమ మేథాశక్తి వినియోగం

0
Artificial Intelligence in Agriculture
Artificial Intelligence in Agriculture

Artificial Intelligence in Agriculture: 2050 నాటికి ప్రపంచ జనాభా పెరుగుదల 10 బిలియన్లకు చేరుతుందని అందరి అంచనా. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఖీAూ) ప్రకారం, 2050 నాటికి ఆహారం కోసం వచ్చే డిమాండ్‌ను తీర్చడానికి పంట దిగుబడి 60% పెరగాలి. అయితే పెరుగుతున్న జనాభాకి సరిపడా పంట ఉత్పత్తిని పెంచడానికి మరియు దిగుబడిని పెంచడానికి వ్యవసాయ రంగంపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తోంది. రానున్న రొజుల్లో పొంచి ఉన్న ఆహార కొరతను పరిష్కరించడానికి, రెండు విధానాలే కనిపిస్తున్నాయి. అందులో ఒకటి భూ వినియోగాన్ని విస్తరించడం మరియు పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని చేసేలా ప్రొత్సహించడం ఇక రెండోది వినూత్న పద్ధతులను స్వీకరించడం మరియు ఇప్పటికే ఉన్న వ్యవసాయ భూములలో ఉత్పాదకతను పెంచడానికి సాంకేతిక పురోగతిని పెంచి, ఉపయోగించేలా చేయడం. ఈ రెండు కార్యక్రమాలు క్షేత్రస్థాయి రైతాంగానికి చేరితేనే రానున్న రొజుల్లో ప్రజానికానికి ఆహార కొరతను అందించగలం.

Artificial Intelligence in Agriculture

Artificial Intelligence in Agriculture

ప్రతి సీజన్‌లో పంట సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పంటపై పెట్టుబడి పెట్టడానికి రూపొందించిన కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదేకాక వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు శక్తిని ఉపయోగించి, సాగు పద్ధతులు, విన్నూత యంత్రాలు, సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి కృతిమ మేథాశక్తి కూడా సన్న, చిన్నకారు రైతులకు చేరాలి. అప్పుడే సాగు బాగుగా, అందరికి కడుపునిండా ఆహారం అందుతుంది.
వ్యవసాయంలో ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ (Aత్‌ీఱటఱషఱaశ్రీ Iఅ్‌వశ్రీశ్రీఱస్త్రవఅషవ) యొక్క ప్రయోజనాలు…

రోజు రోజుకు సాగురంగం కొత్తపుంతలు తొక్కుతుంది. ప్రతి పరిశ్రమలో వినూత్న ఆలోచనలకు అవకాశాలున్నాయి. ప్రపంచంలో వ్యవసాయ సాంకేతికతలో వేగవంతమైన పురోగతిని సాధిస్తున్నాయి. దీనికి తోడు కృతిమ మేథాశక్తి కూడా సాగుకు దగ్గరవుతుడటంతో సాగులో విప్లవాత్మకంగా మార్పులు కనబడుతున్నాయి.ఈ ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ని పరిచయంతో అనేక సాగు సవాళ్లను పరిష్కరిస్తుందని, అలాగే సాంప్రదాయ వ్యవసాయం యొక్క అనేక ప్రతికూలతలను తగ్గించడంలో సహాయపడుతుందని విశ్లేషకుల అంచనా.

ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ డేటా ఆధారంతో వ్యవసాయంలో ప్రణాళికలు:

ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారిత ప్రిడిక్టివ్‌ అనలిటిక్స్‌ ఇప్పటికే వ్యవసాయ ఆధారిత వ్యాపారులకు మార్గాలను సుగమం చేస్తోంది. కృతిమమేథా శక్తితో తక్కువ సమయంలో ఎక్కువ డేటాను ప్రాసెస్‌ చేయడంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ధరలను అంచనా వేస్తుంది. ఖచ్చితమైన వ్యవసాయ ఉత్పత్తులు రైతులకు అందేలా చేస్తుంది. విత్తనం విత్తిన దగ్గర నుండి కోతకు వచ్చే సరైన సమయాలను నిర్ణయించి సలహాలు అందిస్తూ ఎప్పటికప్పుడు రైతులను హెచ్చరిస్తుంది. ఇవేకాక వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి మరియు ఎరువులు మరియు పురుగు మందుల మోతాదులను సిఫార్సు చేయడంలో సహాయపడుతుంది. నీటిపారుదల, పంటకోత సమయం, పురుగు మందులు, పంటలో చికిత్స అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడుతుంది. వనరుల వినియోగాన్ని కనిష్టంగా తగ్గించడంతోపాటు వినూత్న వ్యవసాయ పద్ధతులు, హెర్బిసైడ్ల వాడకం తగ్గడం, మెరుగైన పంట నాణ్యతో గణనీయమైన ఖర్చు ఆదా చేస్తూ అధిక లాభాలకై కృషి చేస్తుంది.

Artificial Intelligence in Agriculture

Artificial Intelligence in Agriculture

ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఖర్చు ఆదా ..

ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా వ్యవసాయ దిగుబడిని మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. AI తో కలిపి, ఖచ్చితమైన వ్యవసాయం రైతులకు తక్కువ వనరులతో ఎక్కువ పంటలు పండిరచడంలో సహాయపడుతుంది. వ్యవసాయంలో AI ఉత్తమ నేల నిర్వహణ పద్ధతులు, సాంకేతికత మరియు అత్యంత ప్రభావవంతమైన డేటా నిర్వహణ పద్ధతులను అవలంభిస్తూ దిగుబడిని పెంచడంతోపాటు ఖర్చును తగ్గిస్తుంది.
సాగురంగంలో ఆటోమేషన్‌ ప్రభావం

వ్యవసాయ పనులు కష్టతరమైనవి కాబట్టి కూలీల కొరత కొత్తేమీ కాదు. ఆటోమేషన్‌ ఎక్కువ మంది వ్యక్తులను నియమించాల్సిన అవసరం లేకుండా ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. డిజిటల్‌ ఆటోమేషన్‌ యొక్క కొత్త తరంగం మరోసారి ఈ రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది.

సాగు నుండి కోత వరకు ఉపయోగిస్తున్న AI విధానాలు:

ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ప్రణాళిలకను అమలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలను ఉన్నాయి. ఇప్పటికే డెవలప్‌ చేసిన పోగ్రామ్‌ లను అమలు చేయడం వల్ల వ్యవసాయ రంగంలో అనేక పనులను సులభతరం చేస్తుంది. సాగులో AI ద్వారా చేసేసాగులో ఉత్తమ విధానాలను నిర్ణయించడం అలాగే ప్రారంభించడం ద్వారా పెద్ద డేటాను సేకరించి, ప్రాసెస్‌ చేయగలదు. ఉదాహరణకు వ్యవసాయంలో AI కోసం కొన్ని సాధారణ ఉపయోగ సందర్భాలు చూద్దాం.
ఆటోమేటెడ్‌ నీటిపారుదల వ్యవస్థలను ఆప్టిమైజ్‌ చేయడం

నేల తేమ స్థాయిలు మరియు వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించే AI (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సెన్సార్‌లతో కలిపితే, పంటలకు ఎంత సమయంలో ఎంత స్థాయిలో నీటిని అందించాలో నిర్ణయించగలవు. ఒక స్వయంప్రతిపత్త పంట నీటిపారుదల వ్యవస్థ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ నీటిని సంరక్షించడానికి రూపొందించబడిరది. AI అల్గోరిథం ద్వారా డేటాను విశ్లేషించి, లీక్‌లను త్వరితగతిన గుర్తించడంతో చాలా వరకు నీటి నష్టాలను తగ్గించేలా చేస్తుంది. నీటి ప్రవాహం లేదా పీడనంలో మార్పులు వంటి లీక్‌ల యొక్క నిర్దిష్ట సంతకాలను గుర్తించడానికి మెషిన్‌ లెర్నింగ్‌ నమూనాలు అందిస్తుంది. AI అధిక నీటి వినియోగం ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి పంట నీటి అవసరాలతో పాటు వాతావరణ డేటాను కూడా పొందుపరుస్తుంది. లీక్‌ డిటెక్షన్‌ను ఆటోమేట్‌ చేయడం ద్వారా మరియు హెచ్చరికలను అందించడం ద్వారా, AI సాంకేతికత నీటి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైతులకు వనరులను సంరక్షించడంలో సహాయపడుతుంది.

పంట మరియు నేల పర్యవేక్షణలో ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ పాత్ర:

మితిమిరినా ఎరువుల వినియోగం నేల, పంటకే కాదు తినే ప్రజలకు హాని. నేల మరియు సాగుచేసే పంటలకు ఇలాంటి అసమాతలను AI పరిజ్జానంతో పోషకాలను గుర్తించి దిగుబడుపై వాటి ప్రభావాలను నిర్ణయించి,తద్వారా రైతులు అవసరమైన సర్దుబాట్లను సులభంగా చేయడానికి అనుమతిస్తుంది. ఆర్టిఫిషియల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌లు (Aచీచీ) మరియు సపోర్ట్‌ వెక్టర్‌ మెషీన్స్‌ (%ూపవీ%) మోడల్‌లు మట్టి నాణ్యతను అంచనా వేస్తాయి. మానవ పరిశీలన దాని ఖచ్చితత్వంలో పరిమితం అయినప్పటికీ, కంప్యూటర్‌ విజన్‌ మోడల్స్‌ ఖచ్చితమైన డేటాను సేకరించడానికి నేల పరిస్థితులను పర్యవేక్షించగలవు. ఇటివల AI ద్వారా గోధుమ పెరుగుదల యొక్క దశలను మరియు టొమాటోల పక్వత స్థాయిని వేగం మరియు ఖచ్చితత్వంతో మానవులెవరూ సరిపోలని విధంగా ఖచ్చితంగా ట్రాక్‌ చేయగలిగింది.

AI ద్వారా సాగులో వ్యాధులు మరియు తెగుళ్ళను గుర్తించడం:

నేల నాణ్యత మరియు పంట పెరుగుదలను కంప్యూటర్‌ దృష్టితో తెగుళ్లు లేదా వ్యాధుల ఉనికిని గుర్తించగలదు. తెగుళ్లు, వ్యాధులు, వైరస్‌ లు వంటి పంట ఆరోగ్యానికి ముప్పు కల్గించే వాటిని కనుగొనడానికి చిత్రాలను స్కాన్‌ చేయడానికి AI ని ఉపయోగిస్తాము. గర్తించడమే కాక వాటి నిర్మూలించడానికి లేదా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి రైతులకు సహాయపడుతుంది. అయితే ఇది పనిచేయాలంటే మొదటగా కావాల్సిన అన్నిరకాల కీటకాలు, వ్యాధులు, తెగుళ్ల వివరాల చిత్రాలు అవసరం పడుతాయి.

కృతిమ మేథా శక్తితో పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం:

పంటల కంటే పశువులలో ఆరోగ్య సమస్యలను గుర్తించడమే సులువు. అవును AI ద్వారా ఇది సాధ్యమే. ఉదాహరణకు, జa్‌్‌శ్రీవజువవ అనే సంస్థ పశువుల ఆరోగ్యాన్ని రిమోట్‌గా పర్యవేక్షించడానికి డ్రోన్‌లు, కెమెరాలతో పాటు కంప్యూటర్‌ విజన్‌ను ఉపయోగించే ఒక పరిష్కారాన్ని అభివృద్ధి చేసింది. ఇది విలక్షణమైన పశువుల ప్రవర్తనను, ప్రసవం,పశువులపై పర్యావరణ పరిస్థితులతో పాటు ఆహారం యొక్క ప్రభావాన్ని గుర్తించడానికి మరియు విలువైన అంతర్దృష్టులను అందించడానికి జa్‌్‌శ్రీవజువవ AI మరియు వీూ పరిష్కారాలను ఉపయోగిస్తుంది. ఈ జ్ఞానం రైతులకు పాల ఉత్పత్తిని పెంచడానికి పశువుల శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
జa్‌్‌శ్రీవజువవ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి హార్డ్‌వేర్‌-స్వతంత్ర స్వయంప్రతిపత్తి కలిగిన పశువుల పర్యవేక్షణ వేదిక. ఇది వీడియో ఫుటేజీని క్యాప్చర్‌ చేయడానికి మరియు మీ పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతపై అంతర్దృష్టులను అందించడానికి తక్కువ ధర సెక్యూరిటీ కెమెరాను ఉపయోగిస్తుంది.

ఎరువులు పురుగుమందుల చల్లేందుకు మేథాశక్తి సాహాయం:

ఇటీవల పురుగు మందులు, ఎరువులను చల్లేందుకు, నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడంలో సాయమందిస్తుంది. %AI% శక్తి ద్వారా డ్రోన్‌లు కంప్యూటర్‌ విజన్‌ని ఉపయోగించి ఒక్కో ప్రాంతంలో ఎంత పురుగుమందును, ద్రవరూప ఎరువులను పిచికారీ చేయాలో సూచిస్తుంది.

Artificial Intelligence in Agriculture

Drone Spray

కలుపు తీయుటం మరియు పంటకోయడం:

మెషిన్‌ లెర్నింగ్‌ ద్వారా సాగుచేసిన పంటల్లో కలుపు మొక్కలను గుర్తించి వేరు చేయడానికి ఆకుల పరిమాణం, ఆకారం మరియు రంగును కంప్యూటర్‌ విజన్‌ విశ్లేషించి, కలుపు తీయడం వంటి రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (RూA) పనులకు రోబోట్‌ లకు ప్రోగ్రామ్‌ చేయబడుతుంది. రోబోట్‌ ఇప్పటికే సమర్థవంతంగా ఉపయోగించబడుతుంది.

పంట దిగుబడులు తెలిపే విధానం:

పంటల నమూనాలు మరియు లక్షణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతూ, రియల్‌ టైమ్‌లో పెద్ద డేటాసెట్‌లను విశ్లేషించడానికి దిగుబడి మ్యాపింగ్‌ వీూ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. 3డి మ్యాపింగ్‌, సెన్సార్లు మరియు డ్రోన్‌ల నుండి డేటా వంటి సాంకేతికతలను తీసుకుంటూ, అల్గారిథమ్‌ల వాడకంతో మరింత ఖచ్చితమైన విశ్లేషణను అందిస్తుంది.

భవిష్యత్తులో రైతులకు ఎక్కడ మరియు ఎప్పుడు విత్తనాలు విత్తాలి అలాగే పెట్టుబడిపై ఉత్తమ రాబడి కోసం వనరులను ఎలా కేటాయించాలో తెలుసుకోవడంలో సహాయపడతాయి.

గ్రెండిగ్‌ ప్రాసెస్‌ చేయడం:

దిగుబడులు సాధించిన తర్వాత మార్కెట్లో అధిక ధరలు రావాలంటే మంచి నాణ్యత గలవి గ్రెడిరగ్‌ చేయాల్సిందే. కానీ ఇది సార్టింగ్‌ మరియు గ్రెండిరగ్‌ ప్రక్రియలు సమయం మరియు ఖర్చుతో కూడినవి. అయితే AI ద్వారా ఈ పక్రియ మరింత ఖచ్చితంగా చేయగలదు. కంప్యూటర్‌ విజన్‌ ద్వారా ఆకారం, పరిమాణం మరియు రంగు ఆధారంగా పంట ఉత్పత్తులను గ్రేడ్‌ చేయగలదు. ఇది రైతుల ఉత్పత్తులను గ్రేడ్‌ ల వారిగా విభజించడానికి వీలు కల్పిస్తుంది.

వ్యవసాయంలో AI యొక్క సవాళ్లు:

AI మరియు కంప్యూటర్‌ విజన్‌ టెక్నాలజీలు మనం పంటలను పండిరచే విధానం మరియు పంట దిగుబడిని మెరుగుపరచడంలో విప్లవాత్మక మార్పులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, పరిగణించవలసిన సవాళ్లు మరియు పరిమితులు కూడా ఉన్నాయి. చాలా మంది వ్యక్తులు AI అనేది భౌతిక వ్యవసాయ పనులకు సంబంధం లేకుండా డిజిటల్‌ ప్రపంచానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఊహ సాధారణంగా AI సాధనాలపై అవగాహన లేకపోవడంపై ఆధారపడి ఉంటుంది. AI ఎలా పనిచేస్తుందో చాలా మందికి పూర్తిగా అర్థం కాలేదు, ముఖ్యంగా సాంకేతికత-సంబంధిత రంగాల్లోని వారు వ్యవసాయ రంగం అంతటా నెమ్మదిగా AI స్వీకరణకు దారి తీస్తుందనేవి నా నమ్మకం.

సవాళ్లు మరియు పరిమితులు:

1. సాంకేతికత పరిజ్జాన వ్యవస్థకు అధిక ధర వెచ్చించాల్సి వస్తుంది. ఇది చిన్న రైతులకు భారంతో కూడినది.
2. సాంకేతికత, మౌళిక సదుపాయాలు మరియు శిక్షణలో గణనీయమైన పెట్టుబడులు అవసరం.
3. అన్ని ప్రాంతాలలో పంట పెరుగుదల మరియు వాతావరణ పరిస్థితులపై డేటా లేదు. ఇది AI-ఆధారిత పరిష్కారాల ప్రభావాన్ని పరిమితం చేస్తుంది.
4. సెక్యూరిటీి పరంగా ఆందోళనలు
ఉదాహరణకు, పంట ఆరోగ్యం మరియు వృద్ధిపై డేటాను సేకరించడానికి డ్రోన్లు మరియు ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించడం వలన రైతుల కార్యకలాపాలను ట్రాక్‌ చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. కాబట్టి గోప్యతా సమస్యలను పెంచుతుంది.

విజయ్‌ కుమార్‌ ముత్తె, ఫ్రీలాన్స్‌ వ్యవసాయ జర్నలిస్ట్‌, ఫోన్‌ : 97047 42236

Leave Your Comments

Management of Paddy Stem Borer: యాసంగి వరిలో ఉధృతమవుతున్న కాండం తొలిచే పురుగు

Previous article

Keera Dosa: వేసవి కీర దోసలో ఆశించే చీడ పీడలు వాటి సమగ్ర సస్య రక్షణ చర్యలు

Next article

You may also like