తెలంగాణ

Minister Niranjan Reddy: ఈ యాసంగికి రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు – మంత్రి

1
Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: వానాకాలం పంటల పరిస్థితి, రబీ సాగుకు సన్నద్దం, రుణమాఫీ అమలు, ఆయిల్ పామ్ సాగుపై సచివాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, అదనపు సంచాలకులు విజయ్ కుమార్ , అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.

ఈ వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో సాగయిన వరి. ఇప్పటివరకు ఇది అత్యధికం. తెలంగాణ చరిత్రలో ఇది ఒక రికార్డ్. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలో గతంకన్నా ఈ వానాకాలం 24 వేల ఎకరాల్లో వరి సాగు పెరిగింది. సిద్దిపేట, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలలో గతంకన్నా పెరిగిన వరిసాగు. సజావుగా ఎప్పటిలాగే ఎరువుల సరఫరా అవుతుంది.

మరోవైపు యాసంగి సాగుకు సన్నద్దం చేయాలని అధికారులకు సూచనలు చేస్తున్నారు. గత ఏడాది యాసంగిలో 74 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని ఈ వానాకాలంలో ఇప్పటి వరకు కోటి 26 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు పండిస్తున్నారని మరో 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు. లక్ష 93 వేల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు చేరింది.

ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు అందుబాటులో ప్రోత్సాహకాలు జరుగుతున్నాయని ఈ యాసంగికి రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉంచాలని సుమారు 75 నుండి 80 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగవుతాయని అంచనా అని మంత్రి అన్నారు. రబీ పంటల సాగుకోసం అన్ని రకాల ఎరువులు కలిపి 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయింపు జరుగుతుంది.

Also Read: అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ పర్యావరణ వ్యవస్థల కోసం కొత్తరకం విస్తరణ విధానాలు.!

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

రబీ సాగు కోసం 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి నివేదిక .. 9.2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయించింది. గత యాసంగి కన్నా సాగు పెరిగే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశారు.

ఇప్పటి వరకు 21 లక్షల 34 వేల 949 రైతులకు చెందిన రూ.11,812.14 కోట్లు రుణమాఫీ చెయ్యడం జరిగింది. కొనసాగుతున్న రుణమాఫీ ప్రక్రియ .. అర్హులయిన రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తాం అని మంత్రి అన్నారు. బ్యాంకు ఖాతా మూతపడడం కారణంగా కాని, సాంకేతిక కారణాలతో కానీ, బ్యాంకుల నుండి తిరిగి వెళ్లిన రుణ మాఫీ నగదు కాని లేదా మరే కారణం వలన తిరిగి వెళ్లిన అందరి రైతుల రుణమాఫీ చేస్తాం అని మంత్రి అన్నారు.

రుణమాఫీపై సందేహాలున్న రైతులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను సంప్రదించాలి అని రుణమాఫీ సందేహాల నివృత్తి కొరకు రాష్ట్రస్థాయిలో 040 23243667 నంబరులో సంప్రదించగలరు అని ఇప్పటి వరకు పెండింగులో ఉన్న రైతుభీమా క్లెయిములన్నీ వేగంగా పూర్తిచేయాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించుకుని నేల ఆరోగ్యం పెంపొందించుకునేందుకు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలి అని మంత్రి అన్నారు.

Also Read: వరిలో ఉల్లికోడు సమగ్ర యాజమాన్యం.!

Leave Your Comments

New Extension Strategies: అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ పర్యావరణ వ్యవస్థల కోసం కొత్తరకం విస్తరణ విధానాలు.!

Previous article

Custard Apple Farming: సీతాఫలాలు పండిస్తూ లక్షల్లో ఆదాయం.!

Next article

You may also like