1. ప్రత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు జిగురు అట్టలు ఎన్ని అమర్చుకోవాలి ( డి )
ఎ. పసుపు రంగు జిగురు అట్టలు -10
బి. నీలి రంగు జిగురు అట్టలు -10
సి. తెలుపు రంగు జిగురు అట్టలు -10
డి. పై వన్ని
2. వరి నారు వేసుకోవడానికి వారం రోజుల ముందు ఎటువంటి గుళికలు నారు మడిలో చల్లుకోవాలి (బి)
ఎ. ఫోరేట్ 1 కిలో
బి. కార్భోఫ్యూరాన్ 1 కిలో
సి. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 1 కిలో
డి. ఫిప్రోనిల్ 1 కిలో
3. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఎకరాకి ఎన్ని లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవాలి (ఎ)
ఎ. 4
బి. 6
సి. 10
డి. 20
4. మిరప నారును నాటుకునే ముందు వేరు కుళ్ళు తెగులు రాకుండా మిరప నారును ఏ రసాయనంలో ముంచి నాటుకోవాలి (బి)
ఎ. కార్బండిజమ్
బి. కాపర్ ఆక్సీక్లోరైడ్ ఏ 3 గ్రా. / లీటరు నీటికి
సి. మాంకోజెబ్
డి. మెటలాక్సిల్
5. ఐ. సి. ఏ. ఆర్ ఆధ్వర్యం కేంద్రీయ బంగాళాదుంప పరిశోధనాసంస్థ ఎక్కడ ఉంది? (డి)
ఎ. హైద్రాబాద్
బి. పూణే
సి. న్యూ ఢిల్ల్లీ
డి. సిమ్లా
Also Read: వాతావరణం పంటల పరిస్థితి విశ్లేషణ, రైతులకు సూచనలు.!
6. మొదటి ‘‘ఫార్మర్ ఫీల్డ్ స్కూల్’’ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? (ఎ)
ఎ. సెంట్రల్ జావ, ఇండోనేషియా
బి. బెంగుళూరు, భారత దేశం
సి. చికాగో, అమెరికా
డి. టోక్యో, జపాన్
7. మొదటి ‘‘కృషి విజ్ఞాన కేంద్రం’’ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ? (ఎ)
ఎ. పాండిచ్చేరి
బి. హైదరాబాద్
సి. కేరళ
డి. బెంగుళూరు
8. ఆలస్యంగా విత్తు వరికి అనువైన స్వల్ప కాలిక రకం ఏది? (ఎ)
ఎ. జె.జి.ఎల్-24423
బి. సాంబమషూరి (బి.పి.టి-5204) ఈఅఅఅ
సి. సిద్ది
డి. స్వర్ణ
9. అధిక వర్షాల వలన కంది, పెసర, మినుములో ఇనుముధాతు లోప సవరణ ఏ మందుతో చేయాలి? (ఎ)
ఎ. అన్నభేది – 5గ్రా.నిమ్మ ఉప్పు – 0.5 గ్రా./ లీటరు నీటికి
బి. జింక్ సల్ఫేట్ – 2 గ్రా. / లీటరు నీటికి
సి. మెగ్నీషియం సల్ఫేట్ – 10 గ్రా. / లీటరు నీటికి
డి. అసిఫేట్ – 1.5 గ్రా. / లీటరు నీటికి
10. మొక్కజొన్న పంటలో అధిక వర్షాల వలన మొక్క పోషకాలు గ్రహించలేని సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (ఎ)
ఎ. 19-19-19 లేదా 13-0-45-5 గ్రా. లీటరు నీటికి పిచికారి చేయాలి
బి. డి.ఎ.పి 25 కిలోలు ఎకరాకు వేయాలి
సి. అట్రాజిన్ -800 గ్రా. / ఎకరాకు
డి. వీటిలో ఏవి కావు
Also Read: షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచే పోషకాల గని “స్కై ఫ్రూట్”