Milk Related Problems in Cattle: పొదుగు మరియు చనుమొనలపై ఉన్న గాయాలను తగిన క్రిమినాశక ద్రావణాలతో శుభ్రం చేయవచ్చు మరియు తరచుగా యాంటిసెప్టిక్ పౌడర్లు లేదా స్ప్రేలను ఉపయోగించడం ద్వారా గాయాలను చికిత్స చేయవచ్చు. చనుమొనలు చేరి ఉంటే, అంటుకునే టేప్ త్వరగా వైద్యం చేయవచ్చు. చనుమొన రంధ్రానికి సంబంధించిన గాయాలను యాంటిసెప్టిక్ క్రీమ్లు పూసి, పాలు పితికిన తర్వాత కట్టు కట్టాలి. ప్రభావిత త్రైమాసికంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు మాస్టిటిస్ అభివృద్ధిని నివారించడానికి ఇంట్రామ్యామరీ యాంటీబయాటిక్స్తో రోగనిరోధక చికిత్స చేయించాలి.
రొమ్ములు పగలటం, దూడలు రొమ్ములు కొరకటం :
కారణాలు :
నిలువుగా పగలటానికి రాగి ధాతు లోపం అద్దంగా పగలటానికి జింకు ధాతు లోపం. తల్లి ఆవు బాధగా కదలటం, తన్నటం పాలు పిండే వాని చేతులు గరుగా వుండటం, గోళ్ళ వల్ల గాయాలవటం, వాతావరణ మార్పులు
పరిష్కారాలు:
గృహ వైద్యం:
పటిక నీళ్ళతో పొదుగు కడగి పగుళ్ళకు వెన్న పూస గానీ, పేరిన నెయ్యి గానీ, ఆముదం గానీ రాయాలి.మంచి గంధం అరగదీసి రొమ్మునకు పూయాలి. పసుపు నీళ్ళలో కలిపి రాయాలి. కరక్కాయ లేదా మాచి కాయ అరగదీసి రొమ్ములకు పూయాలి. నల్ల ఉమ్మెత్త ఆకు పసరు రొమ్ములకు రాని, దూడని కుడవటానికి ముందు, పొదుగు శుభ్రంగా కడిగి,దూడను వదలాలి లేదా నల్ల తుమ్మ చెక్క నీళ్ళతో పొరుగు కడగాలి. హైమాక్స్ అయింట్ మెంట్ రాయాలి.
తీవ్రమైన పొదుగువాపు
ఇది పొదుగుకు దెబ్బలు తగలడం వల్ల, బాక్టీరియా మరియు శిలీంద్రాలు సోకటం వల్ల, పాలు పిండలేకపోవటం వల్ల, అధిక పాలనిచ్చే ఆవులలో ఎక్కువగా వస్తుంది..
పాలు నీళ్ళలా వుండటం, పాలు విరగటం పాలు కాఫీ రంగులో మారటం, నొప్పి కలగటం, పాలలో చీము రక్తం రావటం పొదుగు బాగా వాయటం, గట్టి పడటం పొదుగు తాకితే వేడిగా వుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read: కొర్ర సాగు మేలైన యాజమాన్య పద్దతులు.!
ముఖ్యమైన కారణాలు : అపరిశుభ్ర పరిసరాలు, వృద్ధాప్యపు ఆవులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గటం, దూడలు పాలు కుడుచుకునేటప్పుడు చన్నులు కొరకటం.
గర్భకోశ వ్యాధులు వున్న ఆవుల చన్ను రంధ్రాల ద్వారా వ్యాధి కారక క్రిములు పొదుగులోనికి ప్రవేశించటం సరైన వ్యాధి నిర్ధారణ- సమర్థవ్యాధి నివారణకు తొలిమెట్టు. పశువైద్యునికి చూపించాలి. పశువైద్య నిపుణులు స్వయంగా పరీక్షలు నిర్వహించి మాత్రమే వ్యాధి నిర్ధారణ చేయాలి.
గుర్తించే విధానం :
1. పాలను నల్ల గుడ్డపై పిండితే పాలు పలుచగా నీళ్ళ మాదిరిగా వున్నా, కుదపలు గానీ రక్తపు జీరలు గానీ, చీము గానీ వుంటే అది పొదుగు వాపు వ్యాధిగా భావించవచ్చు.
2. పాలను వేడి చేస్తే పాలు విరిగిపోతే పొదుగు వాపు వ్యాధి ప్రధమ దశలో వున్నట్లుగా గుర్తించాలి.
3. ప్రయోగ శాలలలో వివిధ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.
వైద్యం : వెన్నెతో పసుపు కలిపి పొదుగుపై రాయాలి లేదా వెన్నతో గుడ్డ మసి కలిపి పొదుగుపై రాయాలి.
పెరటి వైద్యం :
1. జామ ఆకులు, వేపాకు మరిగించి, చల్లార్చి ఆ నీటితో పొదుగును కడగాలి.
2. కలబంద గుజ్జుకు పసుపు, సున్నం కలిపి పొదుగుకు పట్టించాలి.
3. తులసి ఆకులు, వేపాకులు సమపాళ్ళలో నూరి రసం తీసి, దానిలో వెన్న కలిపి చన్నులపై తగ్గే దాకా రాయాలి.
4. పిప్పింటి ఆకు, మూర్కొండకు పసరు కలిపి పొదుగుకు రాయాలి.
5. వావిలాకు, పుట్ట తుమ్మ ఆకు, రుద్రజడాకు నూరి పొదుగుకు రాయాలి.తగ్గక పోతే దేక్సమితసోన్, మెగ్లుడైన్ మరియ జెన్టామైసిన్లు వాడాలి.
పాలలో రక్తం రావటం :
1. పొదుగుకు గాయాలు, పొడుగు వాపు వంటి కారణాల వల్ల పాలలో రక్తం వస్తుంది.
2. పాలు గులాబీ రంగులో ఉంటాయి. కలబంద గుజ్జుకు పసుపు, సున్నం కలిపి పొదుగుకు పట్టించాలి.
Also Read: పనస పండు మరియు విత్తనాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు