Jackfruit Based Value Added Products: పనస పండు శాస్త్రీయ నామం ఆర్టోకార్పస్ హెటెరోఫిల్లస్ మరియు ఇది మోరేసి కుటుంబానికి చెందినది. ఉష్ణమండల దేశాలు పనస యొక్క ప్రధాన ఉత్పత్తిదారులు. పనస పండు ప్రాథమికంగా, భారతదేశంలోని ఉత్తర మరియు దక్షిణ భాగంలో ఉత్పత్తి చేయబడుతుంది. భారతదేశంలో కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాలలో పనస ప్రధానంగా ఉత్పత్తి చేయబడుతుంది.
పనస పండు పరిపక్వం చెందినప్పుడు ప్రజలు దీనిని తింటారు. అయినప్పటికీ పండు యొక్క తీపి గుజ్జును దాని అత్యంత పాడైపోయే స్వభావం వలన ఎక్కువ కాలం నిల్వ ఉంచలేరు. అందువల్ల, ప్రతి సంవత్సరం పండు పండిపోయిన తర్వాత అత్యధిక నష్టం వాటిల్లుతుంది.
ప్రస్తుతం, వివిధ ప్రభుత్వ పరిశోధనా కేంద్రాలు పనస నుండి విలువ ఆధారిత ఉత్పత్తుల ఉత్పత్తి ప్రోటోకాల్‌ను ప్రామాణీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నీ ఖీూూAI ప్రమాణం ప్రకారం ఉంటాయి. అందువల్ల వ్యవస్థాపకులు పనస నుండి విలువ ఆధారిత ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి చిన్న-స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించవచ్చు.
పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులు :
పనస తొనలు, విత్తనాలను ఉపయోగించి వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయవచ్చును. అందులో ముఖ్యంగా పనస పచ్చడి, పనస అప్పడాలు, పనస చిప్స్, జామ్, స్క్వాష్, గుజ్జు, హల్వా, భజ్జీ,తొనల పొడి, చాక్లెట్స్, పనస తాండ్ర మొదలుగు వస్తువులు తయారు చెసే విధానం గురుంచి తెలుసుకుందాం.
1. పనస పచ్చడి :
కావాల్సిన పదార్థాలు :
పనస పండు (సగం పక్వానికి వచ్చింది) – 1 కిలో
వెల్లుల్లి – 100 గ్రా.
అల్లం – 100 గ్రా.
పచ్చిమిర్చి – 100 గ్రా.
శనగపిండి / శెనగపిండి – 50 గ్రా.
ఎండుమిర్చి – 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి – 1 టీ స్పూను
కరివేపాకు – 2-3 రెబ్బలు
నూనె – 1/2 లీటరు
వెనిగర్ – 200 మి.లీ
ఆవాలు పొడి – 2 టీస్పూన్లు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
మెంతులు – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి తగినంత
పంచదార – రుచికి తగినంత.
పూర్తిగా పరిపక్వత చెందని పనస పండును ఎంచుకొని. ఆకుపచ్చని (బాహ్య రిండ్) తొలగించాలి, తర్వాత పనస పండును విత్తనాలతో పాటు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పనస ముక్కలను మరుగుతున్న నీటిలో మెత్తబడే వరకు ఉడికించాలి. పనస ముక్కలను వడకట్టి, వాటి పైన ఉప్పు చల్లి,ఒక ప్లేట్ లో ఆరబెట్టి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. బాణలిలో 2-3 టీస్పూన్ల నూనె వేడి చేసి అందులో ఆవాలు, సోంపు, మెంతులు, వేయించాలి. వేయించిన మసాలా దినుసులను చల్లార్చి మెత్తగా పొడి చేసుకోవాలి. వెడల్పాటి బాణిలో నూనె వేడిచేసి పసుపు, కారం, ఇంగువ వేసి వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసి పైన గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేయాలి. నూనె చల్లారిన తర్వాత, ఎండిన పనస ముక్కలు వేసి, తరువాత వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి శుభ్రమైన డ్రై స్టెరిలైజ్డ్ బాటిల్లో భద్రపరుచుకోవాలి.
2. పనస అప్పడాలు :
కావాల్సిన పదార్థాలు :
లేత/పచ్చి పనస తొనలు – 500 గ్రా.
ఉప్పు – 2 టీ స్పూన్లు
నల్ల నువ్వులు లేదా జీలకర్ర – 2 టీస్పూన్లు
లేత పనస పండును ఉపయోగించి, పనస తొనలను విత్తనాల నుంచి బయటకు తీయాలి. పనస తొనలను మరిగించి, బాగా వడకట్టి, ఉప్పుతో పాటు మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. నువ్వులు లేదా జీలకర్ర వంటి పదార్థాలను మెత్తని మందం గల పొరగా చదును చేసి, ఎలక్ట్రిక్ లేదా సోలార్ క్యాబినెట్ డ్రైయర్ యొక్క ట్రేలలో పెట్టడం / ఎండలో ఆరబెట్టడం ద్వారా డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకోవచ్చు.
3. పనస చిప్స్ :
కావాల్సిన పదార్థాలు :
పనస తొనలు (సగం పక్వానికి ) – 1 కిలో
ఉప్పు – రుచికి తగినంత
నీరు`ఉబ్బిపోవటానికి
నూనె – 500 మి.లీ.
పండని పనస పండును కత్తిరించి, తొనల నుండి విత్తనాలను బయటకు తీయాలి. తొనలను 0.5 నుండి 0.6 సెం.మీ వెడల్పు గల ముక్కలుగా కత్తిరించి, ముక్కలను మరుగుతున్న నీటిలో ఉప్పు కలిపి, అందులో రెండు నిమిషాలు సేపు ఉంచి, తేమ పూర్తిగా ఆరిపోయిన తర్వాత వేడి చేసిన నూనెలో చిప్స్ వేయించాలి. వేయించేటప్పుడు నూనెలో 1-2 చెంచాల ఉప్పు నీరు కలపాలి.తర్వాత మసాలా వేసి కలుపుకోవాలి.
4. పనస జామ్ :
కావాల్సిన పదార్థాలు :
బాగా పండిన పనస – 500 గ్రా.
పంచదార – 350 గ్రా.
సిట్రిక్ యాసిడ్ – 1 టీస్పూన్
నీళ్లు ` తగినంత
తయారు చేసే విధానం :
జామ్ ఒక మధ్యస్థ తేమ ఆహారం మరియు అధిక చక్కెర శాతం దాని కెలోరిక్ విలువను పెంచుతుంది. తీపి రుచి కారణంగా, అన్ని వయసుల వారు తరచుగా జామ్ తింటారు. బాగా పండిన పనస పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలను నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేయాలి. పనస పండు పేస్ట్, పంచదార వేసి పాన్ మీద కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చక్కెర,పెక్టిన్ మరియు యాసిడ్‌తో పండ్ల గుజ్జును ఉడకబెట్టడం ద్వారా దీన్ని సిద్ధం చేయవచ్చు. అనుమతించిన రంగు వచ్చేవరకు మరియు ఒక టేబుల్ స్పూన్ సిట్రిక్ ఆమ్లాన్ని మిశ్రమానికి జోడిరచాలి. జామ్ స్థిరత్వం వచ్చే వరకు నిరంతరాయంగా కలపండి.
5. పనస స్క్వాష్ :
కావాల్సిన పదార్థాలు :
బాగా పండిన పనస తొనలు – 1 కిలో
పైనాపిల్ -1
పంచదార – 3/4 కప్పు
నీరు – 100-150 మి.లీ.
సిట్రిక్ యాసిడ్ – 1 టీస్పూన్
తయారు చేెసే విధానం :
బాగా పండిన పనస పండును కోసుకోవాలి. తొనలు తొలగించి విత్తనాలను బయటకు తీయాలి. బాగా పండిన తొనలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోని, 1 కిలో ముక్కలను నీటిలో మరిగించి, తర్వాత గుజ్జును మెత్తని పేస్ట్‌లా చేయాలి. 1 భాగం గుజ్జు తీసుకుని, నీళ్లు పోసి మిక్సీలో బాగా కలపాలి. పైనాపిల్ నుండి రసం తీసి మరియు పనస గుజ్జుకు 0.5: 1 నిష్పత్తిలో జోడిరచాలి. 250 మి.లీ నీటిలో 250 గ్రాముల చక్కెరను మరిగించి చక్కెర సిరప్ తయారు చేయండి. పనస గుజ్జులో చక్కెర సిరప్ వేసి సిట్రిక్ యాసిడ్ కలపాలి. 1 లీటర్ స్క్వాష్‌కు 700 మి.గ్రా పొటాషియం మెటా బైసల్ఫైట్ జోడిరచాలి.
6. పనస గుజ్జు :
కావాల్సిన పదార్థాలు :
పనస పండు గుజ్జు – 1 కిలో
బెల్లం – 1 కిలో
నెయ్యి – 200 గ్రా
నీరు – 1 లీటరు
తయారు చేసే విధానం :
బాగా పండిన పనస పండును కట్ చేసుకోవాలి. పనస తొనలను తొలగించి విత్తనాలను బయటకు తీయాలి. బాగా పండిన పనస తొనలను మెత్తగా అయ్యే వరకు తక్కువ నీటితో మరిగించాలి. అదనపు నీటిని వడకట్టి మిక్సీని ఉపయోగించి పనస తొనలను మెత్తని గుజ్జులా గ్రైండ్ చేయాలి. లీటర్ నీటిలో కిలో బెల్లం కరిగించి బెల్లం సిరప్ తయారు చేయాలి. సిరప్ ఉడికిన తర్వాత పనస గుజ్జు, నెయ్యి వేయాలి. బాగా మిక్స్ చేసి గుజ్జు చిక్కగా అయ్యే వరకు నిరంతరం కలియబెట్టాలి.
Also Read: వర్షాభావ పరిస్థితుల్లో వివిధ పంటల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్దతులు.!
7. పనస హల్వా :
కావాల్సిన పదార్థాలు : పనస గుజ్జు – 200 గ్రాములు (బేసిక్ రెసిపీ)
నీళ్లు – 1 కప్పు
నెయ్యి – 1/2 కప్పు
పంచదార – 1 కప్పు
జీడిపప్పు`10
మైదా – 1 టీ స్పూను
తయారు చేసే విధానం :
మందపాటి బేస్ ఉన్న వెడల్పాటి పాత్రలో పంచదార, పనస గుజ్జు, నీళ్లు, మైదా వేసి కలపాలి. ఉడికిన తర్వాత యాలకులు, నెయ్యి వేయించిన జీడిపప్పు వేయాలి. మరియు నెయ్యి హల్వా చిక్కగా అయ్యే వరకు కలపాలి. నెయ్యిని ట్రే/ప్లేట్ లో వేసి స్ప్రెడ్ చేయాలి. చల్లార్చి, కట్ చేసి సర్వ్ చేయాలి.
8. పనస బజ్జీ :
కావాల్సిన పదార్థాలు : పనస (లేత/అపరిపక్వత) – 250 గ్రాములు
పచ్చిమిర్చి – 5 నుంచి 6
ఆవాలు – 2 టీస్పూన్లు
జీలకర్ర – 1 టీస్పూన్
కరివేపాకు – 10-15 ఆకులు
కొబ్బరి తురుము – 1 టేబుల్ స్పూన్
బెల్లం – 10 గ్రాములు
ఉప్పు – రుచికి తగినంత
నూనె – 20 మి.లీ.
తయారు చేసే విధానం:
లేత పనస పండును బాగా చిన్నగా ముక్కలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేయాలి. ఆవాలు ఇంగువ, కరివేపాకు వేసి కలపాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించే వరకు బాగా కలపాలి.బాగా వేయించాక సన్నగా తరిగిన పనస ముక్కలు, కొబ్బరి,రుచికి సరిపడా బెల్లం, ఉప్పు జోడిరచాలి.
9. పనస విత్తనాలతో చాక్లెట్స్ :
కావాల్సిన పదార్థాలు : పనస పండు గుజ్జు – 1 కిలో
పంచదార – 500 గ్రా.
పాలపొడి – 150 గ్రా.
వెన్న – 100 గ్రా.
కోకో పౌడర్ – 50 గ్రా.
తయారు చేసే విధానం :
బాగా పండిన జాక్ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుజ్జును మెత్తగా పేస్ట్ చేయాలి.హెవీ బాటమ్ పాన్‌లో పనస గుజ్జు, పంచదార కలపాలి. 1/3వ వంతుకు తగ్గే వరకు మంట మీద ఉడికించాలి. తర్వాత 100 మి.లీ. వేడినీటిలో కరిగిన పాలపొడి, ఆ తర్వాత నెయ్యి వేయాలి. మరియు కోకో పౌడర్‌ను వేడి నీటిలో కలపాలి. బాగా మిక్స్ చేసి తక్కువ మంట మీద కావలసిన స్థిరత్వం వచ్చే వరకు కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పోసి చాక్లెట్లలో రోల్ చేయాలి. 2 గంటలు రిఫ్రిజిరేటర్లో ఉంచండి మరియు తరువాత విడిగా బటర్ పేపర్లో ప్యాక్ చేయాలి.
10. పనస తొనలు మరియు గింజల పిండి :
విత్తనాలను నీటిలో ఉడకబెట్టండి. ముక్కలుగా కట్ చేసి, సీడ్ కోటు తొలగించండి. వేడి గాలి ఓవెన్లో ఆరబెట్టి మిక్సీలో రుబ్బుకోవాలి. చక్కటి జాక్ సీడ్ పిండిని పొందడానికి మెష్ ద్వారా జల్లెడ పట్టండి దీనిని చపాతీ, బజ్జీలు, వడ తయారీలో ఉపయోగించవచ్చు లేదా శిశు ఆహారాలలో కలపవచ్చు. జాక్‌ఫ్రూట్ గింజలలో ప్రోటీన్, (6-8%) కొవ్వు, కార్బోహైడ్రేట్లు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
11. పనస తాండ్ర :
కావాల్సిన పదార్థాలు :
బాగా పండిన పనస – 500 గ్రాములు
బెల్లం : 500 గ్రా.
తయారు చేసే విధానం :
బాగా పండిన జాక్ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుజ్జును మెత్తని పేస్ట్‌గా చేయాలి. మృదువైన గుజ్జును ట్రేలపై ఏకరీతి పొరగా వ్యాప్తి చేయాలి. సోలార్ లేదా ఎలక్ట్రిక్ క్యాబినెట్‌ను ఉపయోగించి తేమను అరికట్టాలి. ప్లేట్లు లేదా ట్రేలలో ప్రత్యక్ష సూర్య కాంతి ద్వారా కూడా ఎండబెట్ట వచ్చును. ఆరిన తర్వాత కావాల్సిన సైజులో, ఆకారంలో కట్ చేసి పాలిథీ¸న్ పౌచ్‌లలో ప్యాక్ చేయాలి.
12. పనస పిండితో బర్ఫీ :
కావాల్సిన పదార్థాలు :
పనస విత్తనాలు – 25-30
మైదా – 100 గ్రా.
శనగపిండి – 150 గ్రా.
పాలు – 200 మి.లీ.
పంచదార – 500 గ్రా.
వెన్న – 150 గ్రా.
వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూను
యాలకుల పొడి – అర టీ స్పూను
పిస్తా తురుము – 1 టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం :
బాగా పండిన పనసను కట్ చేసుకోవాలి. బల్బులు తొలగించి విత్తనాలను బయటకు తీయాలి. పనస విత్తనాలు ఉడికే వరకు ఉడికించాలి. విత్తన పొట్టును తొలగించి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మిక్సర్ ఉపయోగించడం పాలలో మైదాపిండి, శనగపిండి, పంచదార వేసి బాగా కలపాలి.
ఒక బాణలిలో పనస గింజల పేస్ట్, పాల మిశ్రమం వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద ఉంచి తక్కువ పరిమాణంలో వెన్నను జోడిరచి అది గట్టిపడే వరకు ఉంచిన తరువాత బంతిగా చుట్టండి. చివర్లో వెనీలా ఎసెన్స్, యాలుకుల పొడి, పిస్తా వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని జిడ్డుగల పాన్‌లో పోయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి.
Also Read: సాగు చేయబడని ఆకు కూరలతో ఎన్నో ప్రయోజనాలు.!