Suggestions to Boost Lemon Yield: ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ తోటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. దక్షిణ భారత దేశంలో సాగయ్యే నిమ్మ తోటల్లో సంవత్సరంలో రెండు శాతం మాత్రమే సహజ సిద్దంగా పూత ఏర్పడుతుంది. నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత, కాపు వుంటుంది. కానీ రైతుకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే. అందుకే రైతులు ఆసమయంలో పూత నియంత్రణ యాజమాన్యం చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. ఆ సమయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే తప్పుకుండా నాణ్యమైన దిగుబడులను తీయవచ్చు.
సేంద్రియ సాగులో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటలు కొన్ని ఉంటాయి. వాటిలో నిమ్మ ఒక్కటి. ప్రపంచంలో అత్యధికంగా నిమ్మను సాగు చేస్తున్న దేశం మనదే, ఏటా 40లక్షల టన్నుల నిమ్మను మనం పండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహరాష్ట్ర, గుజరాత్ తమిళనాడు రాష్ట్రాల్లో నిమ్మను ఆధికంగా సాగు చేస్తున్నారు. నిమ్మకు పెద్దగా చీడపీడలు ఆశించవు. రసాయన ఎరువులతో పోలిస్తే సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే పెట్టుబడులు తగ్గడమే కాకుండా ఆదిక దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్దతిలో సాగు చేయడం వల్లన నాణ్యమైన దిగుబడి వస్తుందని తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతులు అంటున్నారు.
Also Read: బీహార్ లో ఈ పధకానికి 81 వేల మంది రైతులు అనర్హులు.!
పంటలను రైతులు పూర్తిగా సేంద్రియ పద్దతులోనే సాగుచేస్తున్నారు. ప్రకియ కాస్త నెమ్మదిగా కొనసాగినప్పుటికిని దిగుబడి రాబడి అధికంగా ఉంటాయి. తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులను తీస్తున్నారు, వాతావరణం సాగుకు అనుకూలంగా మారడంతో దిగుబడులు అనుకున్న స్ధాయిలో కంటే ఎక్కువగా వచ్చాయి. కానీ ఆశించిన స్దాయిలో మార్కెట్ లేదు. హెచ్చుతగ్గుల నుండి బయట పడటానికి నిమ్మలో అంతర పంటగా అరటిని సాగుచేస్తున్నారు. ఒకపంటలో ధర రాకపోయినా మరోక పంటలో అయినా ధర వస్తుందన ఆలోచనతో సాగు చేశారు. మార్కెట్ లో ధరలు ఒక్కేలా ఉండవు కాబట్టి అంతర పంటలను సాగు చేస్తే ఒక్క పంట కాకపోయినా , మరో పంట అయినా కలిసి వస్తుందని రైతులు భావిస్తున్నారు.
మన తెలుగు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల తాకిడికి అక్టోబరు – నవంబరులో వర్షాలు ఎక్కువగా వస్తాయి. ఇలాంటి సమయాల్లో చెట్లను సహజంగా వాడుకు తీసుకురావడం కుదరదు. కనుక రైతులు మేలైన యాజమాన్యపద్ధతులను పాటించి వేసవిలో అధిక దిగుబడులను పొందవచ్చు. నిమ్మ రైతులు వేసవిలో కాయ దిగుబడికి మంచి డిమాండ్ ఉండడం వల్ల రైతులు వేసవిలో అధిక దిగుబడిని సాధించడానికి కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి.
Also Read: రైతులకు తీపి గా మారిన పుచ్చకాయ సాగు.!