Steps to Boost Grape Yield: ద్రాక్ష పండులో అనేక రకాల పోషకాలు లభించడం వల్ల మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ద్రాక్షలో 60 పైగా జాతులున్నాయి. ప్రపంచంలో అనేక రకాల ద్రాక్ష పండ్లు ఉన్నాయి. తినే ద్రాక్ష రకం, వైన్, జెల్లీ, జామ్, జ్యూస్, వెనిగర్, ఎండు ద్రాక్ష, ద్రాక్ష గింజల నూనె మరియు ద్రాక్ష గింజల సారం వంటి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి. మన దేశంలో ద్రాక్ష పంట ఎక్కవగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో రైతులు పండిస్తారు.
ఇప్పటి వరకు కొన్ని వాతావరణ పరిస్ధితుల్లోనే ద్రాక్షను సాగుచేస్తుండగా, కొత్త సేధ్యపు పద్దతులతో అన్ని ప్రాంతాల్లో ద్రాక్ష పంటను రైతులు సాగు చేస్తున్నారు. రైతులు సాగులో వస్తున్న నూతన విషయాలపై పెంచుకుని.. పంటలను పండిస్తే లాభాలను ఆర్జించొచ్చు. స్పెయిన్‌కి చెందిన క్యానరీ దీవుల్లోని లన్సారటే దీవిలో 20 సంవత్సరాల క్రితం అగ్ని పర్వతాలు పేలి అక్కడ అంతా బూడిద, రాళ్లమయమైపోయింది. అక్కడ వర్షపాతం కూడా తక్కువే ఇలాంటి ప్రాంతంలో సైతం ఓ రైతు దాక్ష తోటల్ని పెంచుతున్నారు.
ద్రాక్ష అన్ని రకాల నేలలు (Soils) తట్టుకునే గల శక్తి ఉంటుంది. ఇసుక గరప నేలలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉంటుంది. ద్రాక్షకు తక్కువ మోతాదులో నేల పోషకాలు అవసరమవుతాయి. తక్కువ పోషకాలు కలిగిన నేలల్లో సీజన్ కు ముందు నేలలో నత్రజని మరియు పొటాషియం కలుపుకోవడం వల్ల మంచి లాభం ఉంటుంది. 5.5 నుండి 7.0 వరకు కొద్దిగా ఆమ్లత్వం ఉన్న నేలలో ద్రాక్ష సాగు అనుకూలంగా ఉంటుంది.
Also Read: గోనె సంచుల కొరత సమస్యను ఎదుర్కొంటున్న రైతులు.!
వేరు ఉత్పత్తికి మరియు పంట తెగులు నివారించడానికి బాగా ఆరిన నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. బంకతో కూడిన నల్లరేగడి నేలలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉండవు. మరీ ఎక్కువ వర్షపాతం మరియు తక్కువ వర్షపాతం ఉంటె ద్రాక్ష సాగు అభివృద్ధి ఉండదు. ఈ పంటకు కనీసం 10 డిగ్రీల సెల్సియస్ లేదా 50 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత అవసర పడుతుంది. ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు వాతావరణ ప్రభావం ఉత్పత్తి సమయంలో మార్పులు ఉంటే ద్రాక్ష(Grapes) రుచి పైన ప్రభావం చూపుతాయి. మంచి లాభాలు పొందాలంటే రైతులు ద్రాక్ష తోటల్లో కనీస జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
ద్రాక్ష పంటలో రైతులు కొమ్మలు తప్పని సరిగా కత్తిరించుకోవాలి. దీని వల్ల పంట చేతికి త్వరగా వస్తుంది. అలాగే ద్రాక్ష తీగకు సరిగా ప్రాకించకపోయినా, కత్తిరించకపోయినా పంట దిగుబడిలో చాలా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర సంవత్సరంకు 2 సార్లు కత్తిరించుకోవాలి.. మొదటి సారి వేసవిలో పిబ్రవరి-ఏప్రిల్ నెలలో కత్తిరించుకోవాలి అలాగే 2వ సారి శీతాకాలంలో సెప్టెంబర్-అక్టోబర్ లో కొమ్మలు కత్తిరించాలి. వేసవిలో కొమ్మలు కత్తిరించుకోవడం వలన ఎక్కువ కొత్త కొమ్మలు ఏర్పడతాయి. ద్రాక్ష పంటలో ఎరువులను కత్తిరింపుకు ముందుగా వేసుకోవాలి.
కత్తిరింపు చేయడానికి ముందు ద్రాక్ష మొక్క చుట్టూ 15 నుండి 20 సెం.మీల లోతు మట్టిని తీసి మొదలుకు ఎగదోయాలి. మొదట పశువుల ఎరువును సమపాళ్ళలో ప్రతి చెట్టుకు సుమారు 100 గ్రా వరకు వేసుకోవచ్చు. చెట్టూ చుట్టూ బోదెలు 75-100 సెం.మీల దూరంలో వేయాలి. ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు ఉన్నప్పుడు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్, రెండు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. బోరాన్ లోపం ఉన్నట్లయితే 15 నుండి 30 గ్రాముల బోరాక్స్ ను నేలలోనే వేసుకోవాలి. అలాగే ఉద్యాన శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని చిన్న, సన్నకారు రైతులు ఈ పంట సాగుపై అవగాహన పెంచుకోవాలి. వాతావరణ పరిస్థితులను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: మిద్దె తోటల పెంపకంతో లాభాలు ఎన్నో.!