Tomato Prices: రైతు తన అవసరానికి అనగా విత్తనం దగ్గర నుండి పంటను మార్కెట్లో అమ్ముకునే వరకు ప్రతి దానికి ఆటు ప్రభుత్వాలను మరియు ప్రవేటు వడ్డీ వ్యాపారులను ప్రతిరోజు బిచ్చగాడి మాదిరిగా అడగాల్సి వస్తుంది. వ్యాపారులకు లక్షల కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వాలను చూసాం కాని, రైతుల అప్పులను మాఫీ చేసిన ప్రభుత్వాలను మనం చూడలేదు. అసలు ఇందుకు ఈ తేడా, మనకు అన్నం పెట్టే అన్నదాత మీద కక్ష పూరిత చర్యలు ఎందుకు. రైతే రాజు అనే రాజ్యంలో ఆ రైతుకే రక్షణ లేని రాజ్యాంగం మాకు అవసరం లేదు. రైతును రాజును చేసే చట్టాలతో కొత్త రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు తీసుకురావాలి.
లోయలో పడిపోయిన టమాటా
ఇన్ని రోజులు కాసుల వర్షం కురిపించిన టమాటా (Tomato) .. ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. ఎంతగా అంటే.. ఛాయ్ కంటే తక్కువకే మొదటి రకం టమాటాలు కిలో వచ్చేంత. అదేంటీ ఇన్ని రోజులు చుక్కలు చూపించిన టమాటా అంత ఘోరంగా ఎలా పడిపోతుంది అనుకుంటున్నారా.. నిజమండీ బాబు టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కిలో టమాటాలు కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే పలుకుతోంది., దీంతో రైతులు రైతులు లబోదిబోమంటున్నారు. ఇన్ని రోజులు కొండెక్కి కూర్చొన్న టమాటా.. ఇప్పుడు అమాంతం లోయలో పడిపోయింది. సామాన్యులు కొనలేని స్థాయిలో ధరలతో మంటెక్కించిన టమాటా.. ఇప్పుడు ఛాయ్ కంటే చీప్‌గా మారిపోయింది. రైతులను కోటీశ్వరులను చేసిన అదే టమాటా.. ఇప్పుడు దీవాలా తీపించే స్థాయికి దిగజారిపోయింది. దేశ వ్యాప్తంగా టమాటా ధరలు దిగు వస్తున్నాయి.
Also Read: Azotobacter: మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే రైజోబాక్టీరియా – (అజోటోబాక్టర్)
రెండు నెలలుగా వినియోగదారులకు చుక్కలు చూపిస్తూ వచ్చిన టమాటాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టుతున్నాయి. దేశవ్యాప్తంగా టమాటాల ధరల్లో తగ్గుదల కనిపించింది. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా టమాటాల ధరల తగ్గుదలలో క్షీణత ఉంది. గతంలో పెరిగిన టమాట ధరలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఒకానొక దశలో కిలో రూ.300 దాకా చేరిన వార్తల్లోకెక్కిన టమాటా. ఇప్పుడు ఊహించని స్థాయిలో పడిపోయి మళ్లీ చర్చనీయాంశంగా మారిపోయాయి. గడిచిన నెల రోజులుగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (Telangana) , ఆంధ్రప్రదేశ్‌తో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో సరఫరా అమాంతం పెరిగింది. దీంతో.. ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి. ఈటమాటాలే కాదు రైతు పండించే ప్రతి వస్తువుకు రైతుకు దక్కేది పావలా మాత్రమే. ముప్పావలా వ్యాపారులకు రాజకీయ నాయకులకు అదికారులకు లంచాల రూపంలో పార్టీ పండ్ గా సరుకు నిల్వ ద్వారా రైతు కష్టాన్ని గజదొంగల మాదిరిగా దోచుకు తింటున్న ఈ వ్యవస్థలను మరియు ఈవిధమైన వ్యవస్థలను ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని మార్చి రైతును రాజును చేసే విధమైన విదానాలతో నూతన పద్ధతులతో నూతన ఆలోచనలతో నూతన ఆవిష్కరణలతో నూతన రాజ్యాంగాన్ని రాయండి.
Also Read: Pink bollworm: పత్తి పంటలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు యాజమాన్యం.!