Silage Making Process: పాడి రైతులు ఎక్కువగా పశువుల మేతపైన ఖర్చు చేస్తుంటారు. ఎందుకంటే పశువులకు మేత సంవత్సరం పొడువునా దొరకడం కష్టమవొచ్చు, దీనికి మంచి ప్రత్యామ్నాయం సైలేజ్ గడ్డి తయారీ. మేతను నిల్వ చేసి అధిక పోషకాలు జోడించే ప్రక్రియే సైలేజ్. వర్షా కాలంలో, శీతాకాలంలో పచ్చి మేతలు ఎక్కువగా లభిస్తుంది. ఇలాంటి సమయంలో మేత వృధా చేయకుండా, పుష్కలంగా లభించే మేతను వివిధ పద్ధతులలో నిల్వ చేసుకుంటే వేసవిలో కరువు సమయంలో అక్కరకు వస్తుంది. మేతను రెండు పద్ధతుల్లో నిల్వ చేసుకోవచ్చు. వాటిలో ఒకటి పచ్చి మేతను ఎండు మేత గా మార్చి నిల్వ చేసుకోవడం, రెండవది పాతర గడ్డి దీనిని సైలేజ్ గడ్డి తయారీ అంటారు. వీటిలో రైతులకు సైలేజ్ గడ్డి తయారీ కొంత అనుకూలంగా ఉంటుంది. పచ్చి మేత పుష్కలంగా ఉన్నప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి, గుంతలో వేసి, గాలి చొరబడకుండా కప్పి పెట్టి, పోషక విలువలు తగ్గకుండా కాపాడుకొని, అవసర సమయాల్లో పశువులకు మేపుకునే గ్రాసాన్ని సైలేజీ గడ్డి అంటారు.
జొన్న, మొక్కజొన్న, నేపియర్, గిన్నీ గడ్డి, సజ్జ వంటి ఎక్కువ పిండి పదార్థాలు కలిగి, సుమారుగా మాంసకృత్తులు కలిగిన పశుగ్రాసాలు అనువైనవి. అంతే కాదు గుర్రపుడెక్క, చెక్క తట్టాకు, గుంతకల్లుడు ఆకు, చెట్టింటాకు లాంటి కలుపు మొక్కలను కూడా సైలేజీకి వాడవచ్చు. సైలేజీ గడ్డిలో ఎండు గడ్డిని కూడా 1:4 నిష్పత్తిలో వాడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక టన్ను పశుగ్రాసానికి సుమారు 30 కిలోల మొలాసిస్ వాడితే మంచిది. సైలేజీ తయారీకి వాడే గుంతలు 3 రకాలు.. అపార్ట్‌మెంట్ పద్ధతి, గుంత కాల్వ పద్ధతి, బంకర్ పద్ధతి. రైతు తన అవసరాన్ని బట్టి సైలేజీని తయారు చేసుకోవచ్చు. సైలేజీ తయారీకి వాడే గుంత ముఖ్యంగా పశువుల సంఖ్య, నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది.
Also Read: Snake Gourd Farming: పొట్టి పొట్ల తో అధిక లాభాలు.!
సైలేజ్ తయారీకి ఎంచుకున్న పశు గ్రాసాన్ని పూత దశ వరకు పెరగనివ్వాలి. తర్వాత పశుగ్రాసాన్ని కోసి పాలంలోనే ఎండ బెట్టాలి. తేమ బాగా తగ్గే వరకు లేత ఎండలో ఆరనివ్వాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పశుగ్రాసాన్ని తిప్పుతూ ఉండాలి. గుంట అడుగు భాగాన, చుట్టూ, సిమెంట్ పూత పూయాలి లేదా కనీసం పాలిథిన్ షీట్ తో లేదా పొడి గడ్డితో కప్పాలి. దీనివల్ల మట్టి పెళ్లలు విరిగి సైలేజ్‌లో కలిసి పాడవ్వకుండా నివారించవచ్చు. ఎండిన మేతను చిన్న ముక్కలుగా కత్తిరించాలి. కత్తిరించిన మేతను పాతరలో నింపాలి. ఇలా నింపేటప్పుడు గాలి లేకుందా జాగ్రత్త తీసుకోవాలి. ఉదయపు వేళ ఈ పని ప్రారంభించటం మంచిది. గుంటలో పొరలు పొరలుగా మేత పేరుస్తూ, గాలి చేరకుండా అదుముతూ ఉండాలి. గాలి చేరితే మేత బూజు పట్టి చెడిపోతుంది.
సైలేజ్ చాలా పోషకమైనది.పశువులకు ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఎండుగడ్డిని నిల్వ చేయడం కంటే సైలేజ్‌నునిల్వ చేయడం చాలా సులభం, ఎందుకంటేదీనికి తక్కువ స్థలం అవసరం. పశువులకు సైలేజ్‌తో ఆహారం ఇస్తే అది అధిక పాల ఉత్పత్తినిఇస్తుంది అంతేకాదు ఆరోగ్యంగా ఉంటుంది. సైలేజ్ గడ్డిని ఒక్కొక్క పశువుకు రోజుకు 20 కిలోలు ఇవ్వవచ్చు. పచ్చిమేత ఒక భాగం, ఎండు మేత ఒక భాగం కలిపి మేపుకుంటే మంచిది. పశువులు ఇష్టంగా తింటాయి.
Also Read: Palamuru Rangareddy Lift Irrigation Scheme: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈనెల 16న ప్రారంభం.!