వ్యవసాయ పంటలు

Cabbage – Onion Prices: ఉల్లిగడ్డ ధర పెరిగితే .. ఈ కూరగాయ ధర కూడా పెరుగుతుంది.!

3
Cabbage - Onion Prices
Cabbage - Onion Prices

Cabbage – Onion Prices: క్యాబేజీని ఉల్లిగడ్డకు ప్రత్యమ్న్యయంగా కూడా వాడటం వల్ల క్యాబేజీని ఉల్లి ధరలు అధికంగా ఉన్న సమయాల్లో క్యాబేజీ ధర కూడా పెరగటం జరుగుతుంది. ఈ పంటను పూర్తి విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా విడతలవారిగా వేసుకోవడం మంచిది. క్యాబేజీ చల్లని, వాతావరణంలో తేమగా ఉన్న వాతావరణాలలో మంచి దిగుబడులను సాధించవచ్చు. ఈ పంటలో మంచి మెలకువ పద్ధతులను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించి మంచి లాభాలను ఆర్జించవచ్చు.

ఈ పంటకు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు అనువైనవి. ఉదజని సూచిక విలువ 5.5 – 6.5 గా ఉన్న నేలలు సాగుకు అనువైనవి. క్యాబేజీ పంట వెయ్యడానికి ఎంచుకున్న నేలను 2 నుండి 3 సార్లు నేల వదులు అయ్యేలా దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల పోటాష్, 40 కిలోల బాస్వరం వేసుకొని చివరి దుక్కిని కలియ దున్నుకోవాలి.

Cabbage

Cabbage

ఒక్క ఎకరానికి సూటి దేశవాళి రకం విత్తనాలు అయితే 300 గ్రాముల విత్తనాలు, సంకర రకం విత్తనాలు అయితే 100-150 గ్రాముల విత్తనాలు అవసరం పడుతాయి. విత్తేముందు ఒక్క 1కిలో విత్తనానికి 3 గ్రా తైరం లేదా 3 గ్రా కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకొనవలెను. నారు పెంచుటకు నారు మడులను నేలకు దాదాపుగా 10 – 15 సెంటి మీటర్ల ఎత్తుగా మడులను చేసుకొని మడులపై అచ్చుగా గీతలు గీసుకొని విత్తనాలను వేసి మెత్తటి మట్టితో కప్పివేయ్యాలి. విత్తనాలకు నీటిని అందించి దానిపై వరిగడ్డిని పలుచగా వేసుకోవాలి. లేదా కోకోఫిట్ తో నింపిన ట్రేలలో విత్తుకోవడం మంచిది. ఈ ట్రేలలో విత్తుకోవడం వల్ల నారును ఆకూ తినే పురుగు ఆశించకుండా ఉంటుంది. ప్రతి రోజు నీటిని పైపాటుగా అందించాలి. నేలపై నారును పెంచే క్రమంలో మడులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

Cabbage - Onion Prices

Cabbage – Onion Prices

Also Read: Red Sorghum Cultivation: ఈ పంటని ఖరీఫ్, రబీ రెండు కాలాలలో పండిస్తూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు..

నారు వయస్సు 25 – 30 రోజుల మద్య మొక్కలను నాటుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. మొక్కలను నాటుకునేప్పుడు సళ్ళ మధ్య దూరం 60 సెం.మీ. మొక్కల మధ్య దూరం 45 సెం. మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. ఎకరానికి 15000 – 18000 మొక్కలు అవసరం పడుతాయి.

తేలికపాటి ఎర్రనేలలు లేదా దుబ్బా నేలలో 7 రోజులకు, నల్లరేగడి నేలలు అయితే 10 రోజులకు ఒక్కసారి నీటిని అందిస్తే సరిపోతుంది. పంట చేనులో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

Onion Juice Health Benefits

Cabbage – Onion Prices

ప్రతి పంటలో ఈ కలుపు ప్రధాన సమస్య మొక్కలు నాటిన 24 నుండి 48 గంటల మధ్య ఒక్క ఎకరానికి 1.25 లీటర్ల పెండిమితలిన్ లేదా అలాక్లోర్ 1.2 లీటర్ల రసాయనాన్ని ఇసుకలో కలుపుకొని తేమ గల నేల మీద చల్లుకోవాలి. కానీ పిచికారి చెయ్యకూడదు పిచికారి చెయ్యడం వల్ల నాటిన మొక్కలపై ఈ రసాయనం పడి ప్రమాదానికి గురి అవ్వడం జరుగుతుంది.

క్యాబేజీని పంటని రైతులు ఈ పద్దతిలో సాగు చేయడం ద్వారా మంచి దిగుబడితో పాటు లాభాలు వస్తున్నాయి. పంట కూడా నాణ్యంగా ఉండటంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి.

Also Read: Agricultural Electricity Connections: విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం రికార్డు.!

Leave Your Comments

Red Sorghum Cultivation: ఈ పంటని ఖరీఫ్, రబీ రెండు కాలాలలో పండిస్తూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు..

Previous article

Rainy Season Suitable Crops: ప్రస్తుత్త వర్షాలకు వేసుకోదగ్గ పంటలు

Next article

You may also like